Топ-100
Back

ⓘ తెలంగాణ సంస్కృతి. తెలంగాణ సుమారు 5.000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్రను కలిగివుంది. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులచే, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ ర ..
                                               

తెలంగాణ

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం, తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం, తెలుగు దేశం + ఆణెం అంటే దేశం, కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాయచూర్, గుల్బర్గా, బీదర్ కర్ణాటక ప్రాంతం కన్నడ మాట్లాడే ప్రాంతాలు, మరాఠి మాట్లాడే ప్ర ...

                                               

తెలంగాణ కోటలు

తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలు, వైభవం, నాగరికత మొదలైన వాటి గురించి చెప్పే వాటిలో తెలంగాణ కోటలు ప్రముఖమైనవి.ఈ కోటలలో అప్పటి రాజులు వేయించిన శాసనాలు, నాణాలతోపాటు వారు రాజ్యపరిపాలన సాగించిన తీరుతెన్నులు, శత్రుదుర్భేద్యంగా నిర్మించిన రాతి గోడలు అబ్బురపరిచే వాటి నిర్మాణశైలి మొదలైన ఎన్నో ఈ కోటల ద్వారా తెలుస్తాయి. అంతేకాకుండా ఏయే రాజవంశీయులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారో వారి ఆచార్య వ్యవహరాలు, వారు వాడిన వస్తువులు, దుస్తులు, ఆయా రాజుల కళాపోషణ, నాటి శిల్పకళా వైభవం, అద్భుతమైన రాతికట్టడాలు మొదలైనవి గత చరిత్రకు సాక్షీభూతంగా ఈ కోటలలో నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా వరకు కోటలు శిథిలావస్థలో ఉన్నా ...

                                               

తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి అనగా తెలంగాణ అమ్మ. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రాంతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఈ తెలంగాణ తల్లి భావన మలిదశ ఉద్యమ వ్యాప్తిలో ఎంతో దోహదపడింది.

                                               

శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (పుస్తకం)

శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన తొలి పుస్తకం. శాతవాహనుల కాలం నుండి కాకతీయుల కాలం వరకుగల తెలంగాణ చరిత్ర, భాష, సంస్కృతి, సాహిత్యం గురించి ఇందులో రాయబడింది.

                                               

తెలంగాణ రిసోర్స్ సెంటర్

తెలంగాణ రిసోర్స్ సెంటర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో తమదైన రీతిలో కృషిచేసిన వివిధ సంస్థలు, ప్రజాసంఘాలలో ఒకటి. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ వీధి నెం.12లోని దక్కన్ అకాడమీలో ఈ సంస్థ నెలకొంది. ఈ సంస్థ పరిమిత వనరులతో ప్రారంభమై అనతి కాలం లోనే అపరిమిత స్థాయిలో తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది.

                                               

కోయిలకొండ కోట

తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి. కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది.కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్టగా పిలుస్తారు. కొందరు దురభిమానులు కోటలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు ఉన్నాయి.

తెలంగాణ సంస్కృతి
                                     

ⓘ తెలంగాణ సంస్కృతి

తెలంగాణ సుమారు 5.000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్రను కలిగివుంది. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులచే, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజవంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉపఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవిర్భవించింది. కళలు, సంస్కృతిలపై ఆసక్తి కలిగిన పాలకులు, ఇతరులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో "కాకతీయ పండుగ" తోపాటుగా బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మీలాద్-ఉన్-నబి, రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుకలను కూడా జరుపుకుంటారు.

విభిన్న భాషలు, సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం చాలాకాలం నుండి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. "దక్షిణానికి ఉత్తరం, ఉత్తరానికి దక్షిణం" గా, గంగా-యమున తెహజీబ్ గా పిలవబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నగరం.

                                     

1. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొద్దికాలం స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.

దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించగా, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి.

                                     

2. భాష

తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. తెలంగాణా వారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది.

                                     

3. సాహిత్యం

మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉర్దూ సాహిత్యంలో మొట్టమొదటి సాహిబ్-ఎ-దివాన్ గా ప్రఖ్యాతుడయ్యాడు. పోతన, కంచర్ల గోపన్న భక్త రామాదాసు, మల్లియ రేచన, గోన బుద్ధారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, మల్లినాథ సూరి, హుళక్కి భాస్కరుడు మొదలైనవారు తెలంగాణకు చెందిన ప్రాచీన కవులుకాగా, ఆధునికయుగ సాహిత్యకారుల్లో తొలి తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దాశరథి కృష్ణమాచార్యులు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి, భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు వంటివారు ఉన్నారు. ఉర్దూ సాహిత్యం, ముషాయిరాల సంస్కృతి తెలంగాణలో విలసిల్లింది. ఉర్దూ విప్లవ కవి మఖ్దూం తెలంగాణకు చెందినవాడు.

                                     

4. మతం

తెలంగాణలో 6 వ శతాబ్దం వరకు బౌద్ధ మతం ఆధిపత్య మతంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం హిందూ, ఇస్లాం మతాలు ప్రధాన మతాలుగా ఉన్నాయి. నాగార్జునకొండలో మహాయాన బౌద్ధమతానికి సంబంధించిన స్మారక కట్టడాలు ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు శ్రీ పర్వతం వద్ద ఏర్పాటుచేసిన ప్రపంచ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 12వ శతాబ్దంలో చాళుక్యులు, కాకతీయుల కాలంలో హిందూ మతం పునరుద్ధరించబడింది. విజయనగర రాజుల పాలనలో హిందూ మతం మిక్కిలి ప్రసిద్ధి పొందింది. విజయనగర చక్రవర్తులు ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయలు కొత్త ఆలయాలు నిర్మించడమేకాకుండా పాత ఆలయాలను పునరుద్ధరించారు. ఇవన్ని శివ, విష్ణు, హనుమంతుడు, గణపతి మొదలైన ప్రసిద్ధ హిందూ దేవుళ్ల ఆలయాలు.

                                     

5. ఉత్సవాలు

అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌ తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించారు. ఇలాంటి పండుగ నిర్వహించడం దేశంలోనే ప్రథమం.