Топ-100
Back

ⓘ గుంటూరు హిందూ నాటక సమాజం. కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన ..
                                               

గుంటూరు హిందూ నాటక సమాజం

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన్ని స్థాపించారు. దీనికంటే ముందు కందుకూరి వీరేశలింగం పంతులు 1880వ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో స్థాపించిన సమాజం విద్యార్థి నాటక సమాజవడం వల్ల, అది కొద్దిరోజుల్లోనే అంతరించిపోవుట వల్ల గుంటూరు హిందూ నాటక సమాజమే మొదటిది అవుతుంది. గుంటూరు అగ్రహారంలోని ఏడుగొందుల సందులో ..

                                               

బెల్లంకొండ రామదాసు

1940లో శ్మశానం నాటకంతో ఇతడు రచనలు చేయడం ప్రారంభించాడు. ఇతను అభ్యుదయకవితా యుగంలో అచ్చయిన తొలి కావ్యము నయాగరాను ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులతో కలిసి వెలువరించాడు. ఈయన వ్రాసిన సాంఘిక నాటకాలు, పునర్జన్మ, అతిథి రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నాయి. చిలక చదువు 1953 పేరుతో కొన్ని రవీంద్రనాధ్ ఠాగూర్ కథలను అనువదించాడు.

                                               

పొనుగుపాడు (ఫిరంగిపురం)

పొనుగుపాడు, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఫిరంగిపురం నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

                                               

కొలకలూరి ఇనాక్

కొలకలూరి ఇనాక్ తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి. అతను తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఈయన చేసిన కృషికి తగ్గ ఫలితంగా 2014 లో భారత ప్రభుత్వం, జాతీయస్థాయిలో మహావ్యక్తులకు, మార్గదర్శకులకూ ఇచ్చే "పద్మశ్రీ" పురస్కారం ప్రకటించి గౌరవించింది. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతని "అనంత జీవనం" అనే రచనకు లభించింది.

                                               

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. అతను ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య. 336 కి పైగా సినిమాల్లో నటించాడు. 1938 లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో అతను సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. 1939లో స్థాపించబడిన వాహినీ స్టూడియోస్ తరపున నాగయ్య పలు సినిమాలకు వివిధ విభాగాల్లో పనిచేశాడు. తర్వాత తానే రేణుకా ఫిల్మ్స్ అనే పేరుతో స్వంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరు గాంచాడు. మహారాజుల దగ్గరా, విశ ...

                                               

తాతా రమేశ్ బాబు

తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది.

                                               

ఎం.ఎన్.రాయ్

ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత, 20వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్తలలో ప్రముఖులు. రష్యా తరువాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి రాయ్. మొట్టమొదటి కమ్యూనిస్ ఇంటర్నేషనల్కి మెక్సికో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. రష్యాలో లెనిన్ మరణానంతరం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాయ్ కార్యశీలక కమ్యూనిస్టు రాజకీయాలనుండి తపుకుని భారతదేశం వచ్చి రాడికల్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. వారు తీసుకు వచ్చిన మానవవాద ఉద్యమం పలువురు మేధావులను ఆకర్షించింది. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను ప్రతిపాదించ ...