Топ-100
Back

ⓘ గుంటూరు హిందూ నాటక సమాజం. కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన ..
                                               

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి

ఈయన గోపాలకృష్ణ శాస్త్రి, వీరమ్మ దంపతులకు 1852వ సంవత్సరంలో గుంటూరు లో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణ శాస్త్రి తెలంగాణలోని విప్పుల మడక అగ్రహారంలో కొంతకాలం ఉన్నాడు.

                                               

బండారు రామస్వామి

వీరు 1906 సంవత్సరంలో "విబుధరంజని శృంగార హిందూ నాటక సమాజం" వారి పాండవ విజయం నాటకంలో అభిమన్యుని పాత్రతో ప్రప్రథమంగా నాటకరంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత వారి సారంగధర, వేణీసంహారం మొదలైన నాటకాలలో నటించారు. వీరు 1912లో పొత్తూరు హనుమంతరావు, పాదర్తి సోమయ్య నాయుడు, ప్రత్తి సుబ్రహ్మణ్యం మొదలగు వారితో "మూన్ థియేటర్" అనే సంస్థను స్థాపించి అనేక చారిత్రక, పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. వీరు గయోపాఖ్యానంలో గయుడు, బిల్హణీయంలో బిల్హణుడు, ప్రసన్నయాదవంలో శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, బొబ్బిలి యుద్ధంలో రంగారాయుడు, ప్రచండ చాణక్యంలో చాణక్యుడు, రాణీ సంయుక్తలో పృథ్వీరాజు మొదలైన ప్రముఖ నాయక పాత్రలు పోషించ ...

                                               

వేముల మోహనరావు

వేముల మోహనరావు రంగస్థల కళాకారుడు. అతను తన నటనతో అఖిలాంధ్ర ప్రేక్షక లోకంచే జేజేలు పలికించుకుంటున్న విలక్షణ నటునిగా గుర్తింపు పొందాడు. ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోయి నటించటమే కాక అతను చేసిన ఏపాత్రనైనా ఆయనకన్నా మరెవ్వరూ అంత బాగా చేయలేరని, నటనలో సహజత్వం ఆయన సొత్తు అని నాటక మేధావి పిఠాపురం బాబి గారిచే ప్రశంసలు అందుకున్న విలక్షణ నటుడు.

                                               

నూతలపాటి సాంబయ్య

ఇతడు గుంటూరు జిల్లా నడికుడి గ్రామంలో 1939, జూన్ 19వ తేదీన నూతలపాటి కోటమ్మ, కోటయ్య దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య నడికుడిలో, మాధ్యమిక విద్య దాచేపల్లిలో గడిచింది.తరువాత గుంటూరులోని ఎ.సి.కాలేజీలో ఇంటర్మీడియట్, మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. 1962లో ఇతనికి సరస్వతితో వివాహం జరిగింది. 1965లో కల్వకుర్తిలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరి 1970లో సత్తెనపల్లి హైస్కూలుకు బదిలీ అయ్యాడు.

                                               

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను నటరత్నాలు శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ...

                                               

శ్రీ గురు రాఘవేంద్ర చరితం

శ్రీ గురు రాఘ‌వేంద్ర‌ చ‌రితం ప‌ద్య‌నాట‌కం 2012లో విద్యాధ‌ర్ మునిప‌ల్లె ర‌చించారు. దీనిని పెద‌కాకాని గంగోత్రి నాట‌క స‌మాజంవారు ప్ర‌ద‌ర్శించారు. అనేక చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు అందుకున్న ఈ ప‌ద్య‌నాట‌కానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సాక్షాత్తు రాఘవేంద్రస్వామి ఆవాస‌మై కొలువైన మంత్రాల‌యం పుణ్య‌క్షేత్ర శ్రీ‌మ‌ఠ ప్రాంగ‌ణంలో ఈ ప‌ద్య‌నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించి పీఠాధిప‌తుల మ‌న్న‌న‌లు అందుకున్నారు విద్యాధ‌ర్ మునిప‌ల్లె. రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో జరిగిన నంది నాటక పరిషత్తు - 2013లో ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ సంగీతం విభాగంలో నంది బహుమతులు వచ్చాయి.

                                     

ⓘ గుంటూరు హిందూ నాటక సమాజం

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన్ని స్థాపించారు. దీనికంటే ముందు కందుకూరి వీరేశలింగం పంతులు 1880వ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో స్థాపించిన సమాజం విద్యార్థి నాటక సమాజవడం వల్ల, అది కొద్దిరోజుల్లోనే అంతరించిపోవుట వల్ల గుంటూరు హిందూ నాటక సమాజమే మొదటిది అవుతుంది. గుంటూరు అగ్రహారంలోని ఏడుగొందుల సందులో నాటకశాలను నిర్మించుకున్నారు.

ఈ సమాజ ప్రదర్శన లకు తగిన ప్రదేశంలో పాకలు వేయడం, తెరలు సిద్ధంచేయడం, నాటక పాత్రలకు కావలసిన దుస్తులు, అలంకారాలు మొదలైనవి పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యలు చూసుకునేవారు. ప్రతి నాటకంలో నాయక పాత్రలను కలపటపు నరసంహం అనే విద్యార్థి, స్త్రీ పాత్రలను చెన్నూరి సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణ అనేవారు వేసేవారు.

ఈ సమాజం నాలుగైదు సంవత్సరాలు మాత్రమే నడిచింది. ధనాపేక్ష లేకుండా వినోదం కోసమే నాటకాలను ప్రదర్శించారు. రాజమహేంద్రవరంలో హరిశ్చంద్ర నాటక మొదటి ప్రదర్శన సమయంలో ప్రదర్శన పాకపై ఎవరో నిప్పువేయడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. మరలా 1884లో రెంవడసారి ప్రదర్శన విజయవంతగా జరిగింది. ఈ సమాజంవారు ఎక్కువగా వచన నాటకాలను ప్రదర్శించేవారు. అందుచేత, వచన నాటకాలకు వరవడి దిద్దినది గుంటూరు హిందూ నాటక సమాజమేనని చెప్పవచ్చు.