Топ-100
Back

ⓘ రవి పరస ప్రముఖ నఖచిత్ర కళాకారుడు. ఈయన గోటితో చిత్రాలు గీయడంలో దిట్ట. ఎన్నో వేల చిత్రాలు అవలీలగా ఈయన గోటితో గీసారు. ఇంకా గీస్తున్నారు. ఒక్క వినాయకుడి మీదే 999చిత ..
                                               

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2009 తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా 2018 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1978 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1957 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2014 తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా 2014 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1972 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1967

                                               

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు

భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 15-వ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికలలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకూ ప్రతినిధులను ఎన్నుకున్నారు. వోట్ల లెక్కింపు 23 మే, 2019 న ప్రారంభంకాగా, పూర్తి ఫలితాలు 24 మే, 2019 నాటికి విడుదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి ఆధిక్యతతో అనగా 175 సీట్లలో 151 గెలిచి విజయం సాధించింది. కడప, క ...

                                     

ⓘ రవి పరస

రవి పరస ప్రముఖ నఖచిత్ర కళాకారుడు. ఈయన గోటితో చిత్రాలు గీయడంలో దిట్ట. ఎన్నో వేల చిత్రాలు అవలీలగా ఈయన గోటితో గీసారు. ఇంకా గీస్తున్నారు. ఒక్క వినాయకుడి మీదే 999చిత్రాలు గీసి చరిత్ర సృష్టించారు. అంతేకాదు,1.503 గణపతులను గోటితో గీసిన నఖ చిత్రకారునిగా రికార్డు కెక్కారు. చేతిరాత నిపుణుడిగా, వ్యక్తిత్వ వికాశ నిపుణుడిగా,పలు విషయాలపై అవగాహన కల్పించే కౌన్సిలర్ గా రాణిస్తున్నారు. ఎన్నో అవార్డులు,రివార్డులు, బిరుదులు,సత్కారాలు అందుకున్నారు.

                                     

1. జీవిత విశేషాలు

ఆయన 1968 ఆగస్టు 1 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో పరస సత్యనారాయణ రావు, శకుంతల దంపతులకు జన్మించారు. నలుగురు అన్నదమ్ములు,ఒక సోదరి గల ఈయన ఆఖరి వాడు. టీచర్ గా ఉద్యోగం చేస్తూ రాజీనామా చేసిన ఈయన నఖ చిత్ర కారునిగా,చేతిరాత నిపుణుడుగా, వ్యక్తిత్వ వికాశ నిపుణుడుగా రాణిస్తూ రాజమండ్రి జవహర్ లాల్ నెహ్రు రోడ్ శ్రీ షిరిడి సాయి మార్గ్ లో నివాసం వుంటున్నారు. ఈయనకు భార్య రామ తులసి టీచర్ గా పనిచేస్తున్నారు. కుమరులు పవన్,ఫ్రవీణ్ ఉన్నారు.

                                     

2. చిత్ర కారునిగా ఎంట్రీ

స్వతహాగా చేతిరాత నిపుణుడైన డాక్టర్ రవి పరస నఖ చిత్రకళలో నిష్ణాతులైన శిష్ట్లా రామకృష్ణారావు దగ్గర ఒక్కరోజు శిష్యరికం చేసి, నఖ చిత్రకళలో మెళుకువలు నేర్చుకున్నారు. ఓ తెల్లని కార్డు ముక్కపై తన చేతి గోళ్లతో ఆద్భుత చిత్రాలను గీస్తారు. ఎదుటివారిని మురిపిస్తారు. కెరీర్ ఆనలటిక్స్ ఆంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ నిపుణులుగా పనిచేస్తున్న రవి వరస ప్రవృత్తి మాత్రం చేతిగోర్లతో తెల్లని చార్డు ముక్కలపై ఆందమైన చిత్రాలను చెక్క డమే ప్రయాణ సమయంలో ఆయనకు పెద్ద కాలక్షేపం నఖచిత్రాలను రూపొందించడమే. పక్షులు, జంతువులు, ప్రకృతి దృశ్యాలు, మనుషుల పేర్లు. ఇలా పలు రకాలుగా వివిధ కోణాలలో ఆయన తన నఖాలతో చిత్రాలను ఆవలీలగా గీసేస్తారు. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతోనే ఈ కళను సాధన చేసినట్టు ఆయన చెబుతుంటారు. ఆయనకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే చాలా ఇష్టం. చిత్రకళా పోటీలలో పలు బహుమతులు కూడా సాధించారు. చిత్రాలు గీసి తమ సృజనను చాటుకోవడం ప్రతి కళాకారునికీ సర్వసాధారణం. అయితే ఆయనకంటూ ఒక ప్రత్యేకతను సాధించాలనే తపన పడేవారు. ఓసారి ఆనుకోకుండా పెరిగిన చేతిగోళ్లతో ఆవలీలగా ఓ చార్డుపై చిన్న బొమ్మ గిసారు. అది చూసి అందరూ అభినందించారు. తన చిత్రకళలో ప్రత్యేకతను చాటుకొవడానికి ఇది మంచి మార్గమనుకున్నారాయన. అప్పటి నుండి చేతి గోళ్ళతో చిత్రాలను గీయడం ప్రారంభించారు. ప్రపంచంలోనే నఖ చిత్రకళలో మూడవ స్థానానికి చేరారు. గణేశ్ బొమ్మలను చిత్రించడంలో ఈయన ఓ రికార్డు నెలకొల్పారు. 22రోజులలో 333 ఓంకార్ గణపతులను చిత్రించారు. మొత్తం 94రోజులలో 254గంటలలో 999గణపతులను తీర్చిదిద్దారు.

                                     

3. గణేష్ చిత్రాలు

పలు రకాలుగా గణేశ రూపాలను డాక్టర్ రవి పరస గోటితో చిత్రించారు. పేరును బట్టి ఈయన గణపతిని అందులో ఇముడుస్తూ చిత్రాలు గీయడంలో దిట్ట. మొత్తం 2.850 చిత్రాలు గొటితో గీసారు.

 • 5 అక్షర గణేశ చిత్రాలు కన్నడ అక్షర మాల 48
 • లైవ్ షో మాదిరిగా ఒకరోజు నిర్వహించిన ప్రదర్శనలు: 20
 • 9 అక్షర గణేశ చిత్రాలు మరాఠీ అక్షర మాల 42
 • 7 అక్షర గణేశ చిత్రాలు ఒరియా అక్షర మాల 15
 • 1. వివిధ రూపాల్లో గణేష్ చిత్రాలు 766
 • 3 అక్షర గణేశ చిత్రాలు హిందీ అక్షర మాల 45
 • 2 ఓంకార్ గణేశ చిత్రాలు 602
 • ఇక లైవ్ షో లతో కలిపి దాదాపు 63.900 నఖ చిత్రాలు రవి పరస గీశారు.
 • ఎక్కువగా నఖ చిత్ర ప్రదర్శనలు మూడురోజులకన్నా ఎక్కువ నిర్వహించినవి:9
 • 8 అక్షర గణేశ చిత్రాలు ఇంగ్లీష్ అక్షర మాల 26
 • 10 అక్షర గణేశ చిత్రాలు బెంగాలీ అక్షర మాల 45
 • 6 అక్షర గణేశ చిత్రాలు మళయాళం అక్షర మాల 56
 • 4 అక్షర గణేశ చిత్రాలు తెలుగు అక్షర మాల 56
                                     

4. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్

డా. రవి పరస విభిన్న రీతులలో గణపతులను గోటితో చిత్రీకరించిన నేపథ్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2015మే 5న నమోదయ్యారు. సమన్వయ సరస్వతి,ప్రవచన విరించి సామవేదం షణ్ముఖ శర్మ నుంచి అభినందనలు అందుకున్నారు. నఖచిత్ర కళారత్న" బిరుదు, బంగారు పతకం, తెలుగు రాష్ట్రాల ప్రతిభా పురస్కారాలు శ్రీ శ్రీ కళావేదిక" నుంచి సత్కారం, "నఖ చిత్ర కళానిధి", నఖచిత్ర కళాతపస్వి" ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఈనాడు నిర్వహించిన హాయ్ బుజ్జీ చేతిరాత శిక్షణలో ఎందరో చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఐ.వై.ఆర్ కృష్ణారావు, పలువురు ప్రజా ప్రతినిధులు,ప్రముఖుల నుంచి సత్కారాలు అందుకున్నారు.

                                     

5. అవార్డ్స్

డాక్టర్ రవి పరస పలు అవార్డులు అందుకున్నారు

 • బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్
 • ఆంధ్ర బుక్ అఫ్ రికార్డ్స్
 • భారత్ బుక్ అఫ్ రికార్డ్స్
 • వర్మ బుక్ అఫ్ రికార్డ్స్
 • స్టేట్ వరల్డ్ రికార్డ్స్
 • యునైటెడ్ బుక్ అఫ్ రికార్డ్స్
 • తెలుగు బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్
                                     

6. అందుకున్న సత్కారాలు

డాక్టర్ రవి పరస ఎన్నో సత్కారాలు అందుకున్నారు. పలు బిరుదులతో ఈయనను పలు సంస్థలు, వ్యక్తులు సత్కరించారు. వాటివివరాలు

 • శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం నుంచి ఉగాది పురస్కార్
 • ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి ఉగాది పురస్కార్
 • మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్
 • లైన్స్ క్లబ్ వారినుంచి నఖచిత్ర కళానిధి
 • అఖిల బ్రాహ్మణ అసోసియేషన్ నుంచి
 • ఫిలాన్తరోపిక్ సొసైటీ నుంచి
 • న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు
 • శ్రీమేధ ఇనిస్టిట్యూషన్స్
 • దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు
 • ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఐ.వై. ఆర్. కృష్ణా రావు నుంచి
 • ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం. ముత్యాల నాయుడు నుంచి
 • యోగ కాన్షియస్ ట్రస్ట్ నుంచి
 • టీటీడీ దేవస్థానం
 • ఎన్టీఆర్ ట్రస్ట్
 • ప్రజా పత్రిక వార పత్రిక నుంచి
 • శ్రీ త్యాగరాజ నారాయణదాసు సేవా సమితి
 • లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్
 • రాజమహేంద్రవరం సిటీ ఎం ఎల్ ఏ డాక్టర్ ఆకుల సత్యనారాయణ నుంచి
 • ఫిలాంత్రోఫిక్ ట్రస్ట్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు2016 సర్ ఆర్థర్ కాటన్ అవార్డు
 • కళా గౌతమీ నుండి ఉగాది పురస్కార్
 • మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్ నుంచి నఖచిత్ర కళాతపస్వి
 • రాజమండ్రి శ్రీవిద్యా గణపతి కమిటీ నుంచి
 • బ్రాహ్మణ అసోసియేషన్ నుంచి
 • ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులయిన యాతగిరి శ్రీరామ నరసింహారావు తన పేరిట ఏర్పాటుచేసిన అవార్డుని మొట్టమొదటిసారి రవి పరసకే దక్కింది. 2017ఏప్రియల్30న ఈ అవార్డు అందుకున్నారు.
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నఖచిత్ర కళారత్న
 • బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ నుంచి


                                     

7. ప్రముఖుల ప్రశంసలు

ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చే డాక్టర్ మైలవరపు శ్రీనివసరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బి.వి. పట్టాభిరాం, సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళా తపస్వి కె.విశ్వవాధ్,సినీ గాయకులు పద్మశ్రీ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, సినీ గాయని ఎస్.పి శైలజ, రాజమహెంద్రవరం ఎం.పి.మాగంటి మురళీమోహన్,తదితరుల నుంచి ప్రశంసలు పొందారు. వీరిందరి చిత్రాలతో పాటు సర్ ఆర్దర్ కాటన్, కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వంటి ప్రముఖుల చిత్రాలను గోటితో గీసారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 2018జనవరి 29న రాజమండ్రి వల్లభ గణపతి వారి బ్రహ్మోత్సవాల సందర్భంలో సామవేదం షణ్ముఖశర్మ చే రచింపబడిన శివపదం" పాటలను గానంచేసిన వేడుకల, బాలకృష్ణ ప్రసాద్ నఖచిత్రం వేసి,బహూకరించారు.

                                     

8. 150రకాకులుగా జీసస్

డాక్టర్ రవి పరస ఏ దేవస్థానానికి వెళ్ళినా అక్కడి దేవుడు విగ్రహాన్ని గీయడం అలవాటుగా చేసుకున్నారు. సీంహాచలం,అన్నవరం, అయినవిల్లి,బిక్కవోలు,ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆ స్వామి రూపం తన గోటితో అవలీలగా గీసేసి, అక్కడి వారిచేత ఔరా అనిపించుకున్నారు. ఇక 150రకాకులుగా జీసస్ క్రైస్ట్ చిత్రాలను చిత్రించారు.

                                     

9. ఇతర లింకులు

 • Samavedam Sanmuka sarma garu with ravi parasa nail art Exhibition at Riverbay function hall
 • ఆయన నఖచిత్రాల గురించి వీడియో
 • biography of Ravi Parasa
 • తెలుగు వేదిక.నెట్ లో రవి పరస ఇంటర్వ్యూ