Топ-100
Back

ⓘ ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్థగోళం. సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల ఉత్తర దిశ, భూమి యొక్క ఉత్తర ధృవం సౌరకుటుంబపు తలానికి ఎటువైపున ఉంటుందో, ..




                                               

మోల్నియా కక్ష్య

మోల్నియా కక్ష్య అధిక దీర్ఘవృత్తాకార కక్ష్య. దీని వాలు 63.4 డిగ్రీలు. పెరిజీ ఆర్గ్యుమెంటు -90 డిగ్రీలు. దీని కక్ష్యాకాలం అర సైడిరియల్ రోజు. రష్యాకు చెందిన "మోల్నియా" ఉపగ్రహాలు ఈ కక్ష్యలను వాడడం వలన ఈ కక్ష్యకు ఆ పేరే వచ్చింది. అధిక దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉండే ఉపగ్రహం, దాని కక్ష్యాకాలంలో ఎక్కువ భాగం దాని అపోజీ వద్ద గడుపుతుంది. మోల్నియా కక్ష్య యొక్క అపోజీ ఉత్తరార్ధగోళం పైన ఉంటుంది. అపోజీ వద్ద సబ్-సెటిలైట్ బిందువు 63.4 ఉ డిగ్రీల వద్ద ఉంటుంది. అపోజీ ఎత్తు 40.000 కి.మీ. ఉండడాన, అపోజీ వద్ద ఉండగా ఉత్తరార్ధగోళంలో - రష్యా నుండి, ఐరోపా, గ్రీన్‌ల్యాండ్, కెనడాల నుండి - ఉపగ్రహం చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ...

                                               

గ్లోబల్ వార్మింగ్

గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పులో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు. గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితి మార్పు అనే మాటలను తరచూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతూంటారు. కానీ, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానంగా మానవుల వలన ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అది కొనసాగడం. శీతోష్ణస్థితిలో మార్పు అంటే గ్లోబల్ వార్మింగుతో పాటు, దాని వలన అవపాతంలో ఏర్పడే మార్పులు కూడా చేరి ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ చరిత్ర పూర్వ కాలాల్లో కూడా జ ...

                                               

ఉత్తర ధ్రువం

ఉత్తరార్ధగోళంలో, భూమి భ్రమణాక్షం దాని ఉపరితలాన్ని కలిసే బిందువును ఉత్తర ధ్రువం అంటారు. దీన్ని భౌగోళిక ఉతర ధ్రువం అని, భూమి ఉత్తర ధ్రువం అనీ కూడా అంటారు. ఉత్తర ధ్రువం భూమిపై ఉత్తర కొనన ఉన్న బిందువు. ఇది దక్షిణ ధ్రువానికి సరిగ్గా అవతలి వైపున ఉంది. జియోడెటిక్ అక్షాంశం 90 ° ఉత్తరంను, అలాగే నిజమైన ఉత్తరం దిశనూ ఇది నిర్వచిస్తుంది. ఉత్తర ధ్రువం దగ్గర నుండి ఎటు చూసినా ఆ దిశలన్నీ దక్షిణమే; రేఖాంశాలన్నీ అక్కడ కలుస్తాయి, కాబట్టి, ఉత్తర్ ధ్రువ రేఖాంశం ఏది అంటే, ఏదైనా చెప్పవచ్చు. అక్షాంశ వృత్తాల వెంట, అపసవ్య దిశ తూర్పు, సవ్యదిశ పడమర అవుతాయి. ఉత్తర ధ్రువం ఉత్తర అర్ధగోళానికి మధ్యన ఉంది. దీనికి అత్యంత సమీ ...

ఉత్తరార్ధగోళం
                                     

ⓘ ఉత్తరార్ధగోళం

భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్థగోళం. సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల ఉత్తర దిశ, భూమి యొక్క ఉత్తర ధృవం సౌరకుటుంబపు తలానికి ఎటువైపున ఉంటుందో, అటువైపే ఉంటుంది.

భూపరిభ్రమణతలం నుండి భూమి అక్షం కొంత కోణంలో వంగి ఉన్న కారణంగా ఉత్తరార్థగోళంలో శీతాకాలం డిసెంబరు ఆయనం డిసెంబరు 21 నుండి మార్చి విషువత్తు మార్చి 20 వరకూ ఉంటుంది. వేసవి కాలం జూన్ ఆయనం జూన్ 21 నుండి సెప్టెంబరు విషువత్తు సెప్టెంబరు 23 వరకూ ఉంటుంది. కాలెండరు సంవత్సరానికి, ఖగోళ సంవత్సరానికీ మధ్య ఉన్నతేడా వలన ఈ తేదీలు ప్రతీ ఏడాదీ ఒకేలా ఉండక కొద్దిగా మారుతూ ఉంటాయి.

ఉత్తరార్థగోళంలో భూమి 60.7% నీటితో నిండి ఉంటుంది. దక్షిణార్థగోళంలో ఇది 80.9% గా ఉంది. భూమిపై ఉన్న మొత్తం నేలలో 67.3% ఉత్తరార్థగోళంలో ఉంది.

                                     

1. భౌగోళికం, శీతోష్ణస్థితి

ఆర్కిటిక్ వలయానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఆర్కిటిక్ అంటారు. అక్కడి శీతోష్ణస్థితిని బాగా చలిగా ఉండే చలికాలం, చల్లగా ఉండే వేసవి కాలంగానూ చెప్పవచ్చు. అవక్షేపణం అధికభాగం మంచు రూపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవిలో కొన్ని రోజులపాటు సూర్యాస్తమయం అసలే జరగదు. శీతాకాలంలో కొన్ని రోజులపాటు సూర్యుడు ఉదయించనే ఉదయించడు. ఈ వ్యవధి ఒక్కొక్కచోట ఒక్కో రకంగా ఉంటుంది. ఆర్కిటిక్ వలయం వద్ద ఒకరోజు ఉండగా, ఉత్తర ధృవం వద్ద కొన్ని నెలలపాటు ఉంటుంది.

ఆర్కిటిక్ వలయానికి, కర్కట రేఖకూ మధ్య ఉత్తర సమశీతోష్ణ ప్రాంతముంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో వేసవి, శీతాకాలాల మధ్య తేడా స్వల్పంగా ఉంటుంది. అయితే, ఈ శీతోష్ణస్థితి అనూహ్యంగా మారుతూ ఉంటుంది.

భూమధ్య రేఖకు, కర్కట రేఖకూ మధ్య ఉన్నవి ఉష్ణ ప్రాంతాలు. ఇక్కడ సాధారణంగా ఏడాది పొడుగునా వేడిగా ఉంటుంది. వేసవిలో వర్షాకాలం వస్తుంది. శీతాకాలంలో పొడిగా ఉంటుంది.

ఉత్తరార్థగోళంలో, భూతలంపైన కదులుతున్న వస్తువులు కుడివైపు తిరిగే ప్రయత్నం చేస్తూంటాయి. దీనికి కారణం కొరియోలిస్ ఎఫెక్ట్. ఈ కారణంగా, భూతలంపై ప్రయాణించే గాలి, నీటి ప్రవాహాలు కుడివైపు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక బకెట్టులో కొంత ఎత్తునుండి నీళ్ళు పోసినపుడు ఆ నీళ్ళు కుడివైపు సుడి తిరగడం గమనించవచ్చు.

ఇదే కారణం చేత, ఎత్తులనుండి ఉత్తరార్థగోళపు భూతలంవైపు కిందికి వచ్చే గాలి ప్రవాహాలు సవ్యదిశలో తిరుగుతూ నేలపై పరుచుకుంటాయి. అంచేత, అధికపీడన వాతావరణంలో సవ్యదిశలో గాలి సుళ్ళు తిరగడం ఇక్కడి లక్షణం. ఇందుకు విరుద్ధంగా, భూతలం నుండి పైకిలేచే గాలి సృష్టించే అల్పపీడన ప్రాంతంలోకి చుట్టుపక్కల నుండి లాక్కునే గాలి అపసవ్య దిశలో సుడి తిరుగుతుంది. ఉత్తరార్థగోళంలో హరికేన్లు, తుపానులూ అపసవ్యదిశలో సుడి తిరుగుతాయి.

నీడగడియారపు నీడ, ఉత్తరార్థగోళంలో సవ్యదిశలో తిరుగుతుంది. పగటివేళ, సూర్యుడు నడినెత్తికి చేరేక్రమంలో కొద్దిగా దక్షిణం వైపుకు ఉంటాడు. అయితే కర్కట రేఖకు, భూమధ్యరేఖకూ మధ్య మాత్రం, ఏడాదిలోని సమయాన్ని బట్టి ఉత్తరానికిగాని, నడినెత్తినగాని, దక్షిణానికి గాని ఉంటాడు.

దక్షిణార్థగోళంతో పోలిస్తే, చంద్రుడు ఉత్తరార్థగోళం నుండి చూసినపుడు తిరగేసినట్లుగా కనిపిస్తాడు. ఉత్తరార్థగోళం పాలపుంత యొక్క కేందం నుండి పెడగా దూరంగా ఉంటుంది. అందుచేత దక్షిణార్థగోళంతో పోలిస్తే ఇక్కడ పాలపుంత తక్కువ కాంతితో, మసకగా కనిపిస్తుంది. ఈ కారణంచేత ఉత్తరార్థగోళం, సుదూర అంతరిక్ష శోధనలకు అనుకూలంగా ఉంటుంది - పాలపుంత యొక్క వెలుతురు కమ్మెయ్యదు కాబట్టి.