Топ-100
Back

ⓘ కరీనా కపూర్ సినిమాల జాబితా. కరీనా కపూర్, ప్రముఖ భారతీయ నటి. దాదాపు 50 బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఆమె. 2000లో అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం ..




కరీనా కపూర్ సినిమాల జాబితా
                                     

ⓘ కరీనా కపూర్ సినిమాల జాబితా

కరీనా కపూర్, ప్రముఖ భారతీయ నటి. దాదాపు 50 బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఆమె. 2000లో అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేశారు కరీనా. ఆ సినిమాలోని నటనకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాతి ఏడాది ఆమె 5 సినిమాల్లో నటించారు. ముఝే కుచ్ కెహనా హై, అజ్నబీ, కభీ ఖుషీ కభీ గం వంటి సినిమాల్లో నటించారు కరీనా. కభీ ఖుషీ కభీ గం సినిమా ఆ సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విజయం ఆమెను బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఆ తరువాత ఆమె నటించిన ముఝ్సే దోస్తీ కరోగీ, మై ప్రేంకీ దీవానీ హూ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు.

2004లో చమేలీ సినిమాలో వేశ్య పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది. ఈ చిత్రానికి ఫిలింఫేర్ ప్రత్యేక పెర్ఫార్మెన్స్ పురస్కారం అందుకున్నారు కరీనా. అదే ఏడాది గోవింద్ నిహలానీ దర్శకత్వంలో దేవ్ సినిమాలో నటించారు ఆమె. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ఒక ముస్లిం పాత్రలో కనిపించారు కరీనా. రెండేళ్ళ తరువాత ఓంకారా 2006 సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమా విలియం షేక్స్ పియర్ రాసిన ఒథెల్లో నవల ఆధారంగా తీశారు. ఇందులో డెస్డెమోనా పాత్రలో కనిపించారు కరీనా. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని నటనకు కరీనా రెండు ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. 2007లో షాహిద్ కపూర్ సరసన జబ్ వియ్ మెట్ సినిమాలో సిక్కు అమ్మాయిగా నటించారు ఆమె. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని నటనకు కూడా కరీనా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.

2001
  • కభీ ఖుషీ కభీ గమ్