Топ-100
Back

ⓘ నటీమణుల సినిమా జాబితాలు ..




                                               

కాజోల్ సినిమాల జాబితా

కాజోల్ ప్రముఖ బాలీవుడ్ నటి. 1992లో బెఖుదీ సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ ఆమె నటనకు మాత్రం మంచి స్పందన వచ్చింది. 1993లో షారుఖ్ ఖాన్ తో కలసి బాజీగర్ సినిమాలో నటించారు ఆమె. ఆ సినిమా విజయం సాధించింది. 1994లో ఆమె చేసిన ఉధార్ కీ జిందగీ సినిమాలోని నటనకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లతో కలసి యే దిల్లగీ సినిమాలో నటించారు ఆమె. 1995లో ఆమె ఐదు చిత్రాల్లో నటించారు. కరణ్ అర్జున్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు లభించడమే కాక, ఈ రెండూ ఆ సంవత్సరానికిగానూ అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రాలు ...

                                               

తమన్నా నటించిన సినిమాల జాబితా

తమన్నా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీ సినిమాతో తమిళంలో అడుగుపెట్టిన తమన్నా నేటి వరకూ 36 సినిమాల్లో నటించింది. 2011లో తమిళనాడు ప్రభుత్వం తమన్నాని కలైమామణి పురస్కారంతో సత్కరించింది. నేటివరకూ తమన్నా దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డుకి 3 నామినేషన్లు, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డుకి 3 నామినేషన్లు సంపాదించి మొత్తమ్మీద 17 అవార్డ్ నామినేషన్లు అందుకోగా అందులో 5 అవార్డులను గెలుచుకుంది.

                                               

మాధురీ దీక్షిత్ సినిమాల జాబితా

మాధురీ దీక్షిత్ ప్రముఖ బాలీవుడ్ నటి. 1984లో అబోధ్ సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత ఆవారా బాప్, స్వాతి వంటి సినిమాల్లో ఆమె నటించినా, వీటి వల్ల ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. 1988లో ఎన్.చంద్ర దర్శకత్వంలో వచ్చిన తెజాబ్ సినిమాతో ఆమెకు మొదటి హిట్ లభించింది. ఆ సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ చేసిన "ఎక్ దో తీన్" పాట పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ చాలామందికి ఈ పాట, మాధురీ డ్యాన్స్ మర్చిపోరు. ఆ తరువాత ఆమె నటించిన రామ్ లఖన్, త్రిదేవ్, కిషన్ కన్హయ్యా వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 1990లో ఆమె నటించిన దిల్ సినిమాతో మొదటి ఫిలింఫేర్ ఉత ...