Топ-100
Back

ⓘ పంజాబీ సంస్కృతి. ఆధునిక కాలంలో పంజాబీప్రజలు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న కారణంగా ప్రత్యేకంగా భారతదేశం, పాకిస్తాన్ పంజాబీ సంస్కృతి అనేక మందికి పరిచయమై ప్రభావం చ ..
                                               

పంజాబీ సంస్కృతి

ఆధునిక కాలంలో పంజాబీప్రజలు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న కారణంగా ప్రత్యేకంగా భారతదేశం, పాకిస్తాన్ పంజాబీ సంస్కృతి అనేక మందికి పరిచయమై ప్రభావం చూపుతుంది. సంప్రదాయమైన పంజాబీ సంస్కృతి శక్తివంతమై పశ్చిమదేశాల వరకు విస్తరించింది. పంజాబీ సంస్కృతి యునైటెడ్ స్టేట్స్, యు.కే, యురేపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా వరకు విస్తరించింది. పంజాబీ తాత్వికత, కవిత్వం, ఆధ్యాత్మికత, విద్య, కళలు, సంగీతం, ఆహారసంస్కృతి, ని ..

                                               

పంజాబీ సినిమా(భారతదేశం)

పంజాబీ సినిమా, సాధారణంగా పాలీవుడ్ అని అంటారు. పాకిస్థాన్, భారతదేశాల్లోని పంజాబీ భాషా సినిమా రంగాన్ని పాలీవుడ్ అని పిలుస్తారు. 20వ శతాబ్ద పంజాబీ సినిమా రంగం పాకిస్థాన్ కేంద్రంగా సాగింది. కానీ 21వ శతాబ్ద పంజాబీ సినిమా మాత్రం భారతదేశం కేంద్రంగా నడుస్తోంది. మొట్టమొదటి పంజాబీ సినిమా కలకత్తా లో నిర్మించి, అప్పటి పంజాబ్ బ్రిటిష్ ప్రావిన్స్ కు రాజధాని లాహోర్ లో విడుదలైంది. పాకిస్థాన్ లోని లాహోర్ సినిమా రంగానికి లాలీవుడ్ అని పేరు. లాహోర్, హాలీవుడ్ కలిసి లాలీవుడ్ అనే పదం తయారైంది. 2009కల్లా పంజాబీ సినిమా రంగం 900 నుండి 1000 సినిమాలు నిర్మించింది. 1970లలో సగటున 9, 80ల్లో 8, 90లలో 6 సినిమాలు విడుదలయ్య ...

                                               

హనుమాన్‌గఢ్ జిల్లా

జిల్లా రాజస్థాన్ ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 12.645 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1.779.650. జనసాంధ్రత 184. జిల్లా ఉత్తర సరిహద్దులో పంజాబు రాష్ట్రం, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో చురు జిల్లా, పశ్చిమ సరిహద్దులో శ్రీ గంగానగర్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో వరి, జొన్నలు, పత్తి, సోనాముఖి, గోధుమ, కూరగాయలు పండిస్తారు. హనుమాన్‌గఢ్ జిల్లా 1994 జూలై 12 లో రాజస్థాన్‌లో 31వ జిల్లాగా అవతరించింది. జిల్లాలో కలిబంగన్ సింధూ నాగరికత, పల్లు వద్ద ఆర్కియాలజీ ప్రదేశం ఉంది. హనుమాన్‌గఢ్లో భట్నర్ కోట ఉంది.

                                               

పంజాబీ తండూర్

దీనిని ప్రత్యేకమైన మట్టితో తయారు చేస్తారు. గోళాకారంగానూ నిలువుగానూ ఉండే వీటిని పంజాబ్ లోని గ్రామాలలో సాంప్రదాయ వంటకాలకు వాడుతారు. ఈ తండూర్లను నేలలో అతికించేస్తారు. కర్రలు, చెక్కలు, బొగ్గులతో అందులో మంట వేస్తారు. దాదాపు 480 డిగ్రీలు కూడా మండగలవు వీటిలో. కొన్ని రకాల పంజాబీ తండూర్లు నేలకు ఎత్తులో కూడా ఉంటాయి. కొన్ని గ్రామాలలో గ్రామ మొత్తానికి ఉమ్మడి తండూర్లు కూడా కలిగి ఉంటారు. సింధు లోయ నాగరికత ప్రదేశాల్లో ఈ పంజాబీ తండూర్ల అవశేషాలు కూడా దొరికాయి. అవిభాజ్య పంజాబ్‌లో కూడా ఈ పంజాబీ తందూర్లను వాడేవారు.

                                               

బోలియాన్

బోలియాన్ అంటే పంజాబీలో పాడుకునే ద్విపద గేయాలు. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజులు లాంటి శుభకార్యాలలో ఇలాంటి పాటలు పాడుతూ నృత్యం చేయడం పంజాబ్ లో చాలా కాలంగా వస్తున్న ఆచారం. ఇవి ఒక తరం నుండి ఇంకో తరానికి కేవలం విని నేర్చుకోవడం ద్వారానే కొనసాగుతూ వస్తున్నాయి. సాధారణంగా వీటిని ఒక మహిళ పాడుతూ ఉంటే మిగతా వారు బృందగానం చేయడం పరిపాటి. ఆడవారి మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, పరిస్థితులను వివరించడానికి ఈ కవితాత్మక శైలి ఉపయోగపడుతుంది. ఈ సంస్కృతి ఇప్పుడు భాంగ్రా పాటలతో కలిసి కేవలం ఉత్తర భారతదేశంలోనే కాక భారతదేశమంతటా, ఉత్తర అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లాంటి విదేశాల్లో కూడా ప్రదర్శితమవ ...

                                               

పంజాబీ తంబా, కుర్తా

లాచా అనునది టెహ్మట్ కన్నా విభిన్నంగా ఉండి ఒక బోర్డరును కలిగి ఉంటుంది. అది వివిధ రంగులతో కూడుకొని ఉంటుంది. ఈ లాచా అనునది పశ్చిమ పంజాబ్ లో ప్రసిద్ధమైనది. ఈ లాచా అనేది టెహ్మట్ వలే కాకుండా అనేక మడతలతో ధరించబడి ఉంటుంది. పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలలోని మహిళలూ టెహ్మట్, లాచా లను ధరిస్తారు. ముఖ్యంగా గుజరాత్ లోని జిల్లాలైన గుజ్రన్ వాలా, షాపూర్, ముజ్జఫార్గర్ లలో లాచాలను ధరిస్తారు.

                                               

మాన్సా జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మాన్సా జిల్లా ఒకటి. జిల్లాలో బుధ్లడ, మాన్సా అనే 2 తాలూకాలు ఉన్నాయి. భిఖి, బుధ్లడ మన్సా ఝునిర్, సర్దుల్గర్ అనే 5 డెవలెప్మెంటు బ్లాకులు 3 ఉపతాలూకాలు ఉన్నాయి. మాన్సా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం.