Топ-100
Back

ⓘ పంజాబీ భాష. పంజాబీ p ʌ n ˈ dʒ ɑː b i ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో ఉన్న భాష ..




పంజాబీ భాష
                                     

ⓘ పంజాబీ భాష

పంజాబీ / p ʌ n ˈ dʒ ɑː b i / ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో ఉన్న భాష. పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప్రాంతంలోని పంజాబీలకు ఇది మాతృభాష. కంఠస్వరం, ఉచ్చారణ మారితే పదం అర్థం మారేలాంటి టోనల్ భాష పంజాబీ. మొత్తం ఇండో-యూరోపియన్ భాషలన్నిటిలోనూ పంజాబీనే పూర్తిస్థాయి టోనల్ భాష.

పంజాబీ పాకిస్తాన్ లో అత్యంత విస్తారంగా మాట్లాడే భాష, భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల స్థానాల్లో పదకొండవది, భారత ఉపఖండంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో మూడవ స్థానంలో ఉంది. అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో యునైటెడ్ కింగ్‌డమ్ లో 4 స్థానంలో అత్యధికులకు మాతృభాషగా కలిగిన భాషల్లో కెనడాలో మూడవ స్థానంలో ఆంగ్లం, ఫ్రెంచి తర్వాత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. బాలీవుడ్ సినిమాల్లో పలు గీతాలు పాక్షికంగానూ, పూర్తిగానూ పంజాబీలోనే పాడివుండడం భారత ఉపఖండ వ్యాప్తంగా పంజాబీకి సాంస్కృతిక లింకులా అమరింది.