Топ-100
Back

ⓘ పంజాబీ పండుగలు. పంజాబీ ప్రజలు అనేక పండగలను జరుపుకుంటారు. వాటిలో మతపరమైనవి, సంస్కృతి పరమైనవి ఉన్నాయి. ఈ సాంస్కృతిక పండగలను అన్ని మతాల ప్రజలు కూడా జరుపుకుంటారు. ఈ ..
పంజాబీ పండుగలు
                                     

ⓘ పంజాబీ పండుగలు

పంజాబీ ప్రజలు అనేక పండగలను జరుపుకుంటారు. వాటిలో మతపరమైనవి, సంస్కృతి పరమైనవి ఉన్నాయి. ఈ సాంస్కృతిక పండగలను అన్ని మతాల ప్రజలు కూడా జరుపుకుంటారు. ఈ పండగల గూర్చి పంజాబీ కాలెండరును ఉపయోగిస్తారు.

ఈ క్రింది జాబితాలో పంజాబీ పండగలున్నాయి.

                                     

1. పంజాబీ పండుగలు

బసంత్ పండుగ

బసంత్ గాలిపటాల పండుగ ఋతుపరమైన పండుగ. ఇది వసంతకాలానికి ఆహ్వానం జరిపే పండుగగా జరుపుతారు. ఈ రోజు సాంప్రదాయమైన రంగు పసుపురంగు. ముఖ్యమైన వంటకం పసుపు అన్నం.

తీయన్

తీయన్ పండుగ ఋతుపవనాలను ఆహ్వానించెపండుగ. ఈ పండుగ అధికారికంగా "తీజ్" రోజున ప్రారంభమవుతుంది. 13 రోజులపాటు జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా మహిళలు, బాలికలు గిద్దా నృత్యాలను చేస్తారు.

                                     

1.1. పంజాబీ పండుగలు లోహ్రీ

లోహ్రీ అనేది పంజాబ్ ప్రాంతంలో శీతాకాలంలో పంటల కోత కాలంలోని పండుగ. ఈ పండగ కాలంలో చెరకు పంట కోతకు వస్తుంది. ఈ పండుగ సాంకేతికంగా శీతాకాలం ఉత్తరాయణ కాలంలో జరుపుతారు. ఇది రైతుల "ఆర్థిక సంవత్సరం" లో చివరిరోజు.

                                     

1.2. పంజాబీ పండుగలు బసంత్ పండుగ

బసంత్ గాలిపటాల పండుగ ఋతుపరమైన పండుగ. ఇది వసంతకాలానికి ఆహ్వానం జరిపే పండుగగా జరుపుతారు. ఈ రోజు సాంప్రదాయమైన రంగు పసుపురంగు. ముఖ్యమైన వంటకం పసుపు అన్నం.

                                     

1.3. పంజాబీ పండుగలు హోలీ

హోలీ సంస్కృతం: होलीఅనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా దోల్ జాత్రా లేదా బసంత-ఉత్సబ్ "వసంతోత్సవ పండుగ" అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి

                                     

1.4. పంజాబీ పండుగలు వైశాఖి

వైశాఖి ఆంగ్లం: Vaisakhi పంజాబీ: ਵਿਸਾਖੀ, visākhī, లేదా బైశాఖి పంజాబీలకు పెద్ద పండుగ. ఇది వైశాఖమాసం లో మొదటిరోజు ప్రారంభమౌతుంది. పంజాబీ పంచాంగం ప్రకారం ఇది మొదటి సూర్య మాసము. 1699 లో ఇదే రోజు ఖల్సా జన్మించింది. రోమన్ కాలెండర్ ప్రకారం ఇవి సాధారణాంగా ఏప్రిల్ 13, 14 తేదీలలో వస్తుంది.

                                     

1.5. పంజాబీ పండుగలు రాఖీ

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.

                                     

1.6. పంజాబీ పండుగలు తీయన్

తీయన్ పండుగ ఋతుపవనాలను ఆహ్వానించెపండుగ. ఈ పండుగ అధికారికంగా "తీజ్" రోజున ప్రారంభమవుతుంది. 13 రోజులపాటు జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా మహిళలు, బాలికలు గిద్దా నృత్యాలను చేస్తారు.

                                     

2. పంజాబీ పంట కోతల పండుగలు

ఈ క్రింది పండుగలు కోత కాలంలో జరుపుతారు.

లోహ్రీ

ఈ పండుగ శీతాకాలంలొ చెరకు పంట, పప్పులు, నట్స్ కోత సమయంలో జరుపుతారు.

వైశాఖి

వైశాఖీ అనునది వసంత ఋతువులో గోధుమ కోతల సందర్భంగా వచ్చే పండుగ.

దీవాలీ

సాంప్రదాయకంగా నవరాత్రులలో మొదటి రూజు పపంజాబీ ప్రజలు పప్పులు, తృణధాన్యాలు అంరియు యితర విత్తనాలు ఒక పాత్రలో విత్తుతారు. దానిని తొమ్మిది రోజులు నీరు పోస్తారు. అవి మొలకెత్తుతాయి. ఈ సాంప్రదాయాన్ని "ఖేత్రి" అంటారు. బార్లీ విత్తనాలలు విత్తడం అనేది సాంప్రదాయంగా "మొదటి పండు" గా పిలువబడుతుంది.

పంజాబీ రైతులు సాంప్రదాయకంగా ఖరీఫ్ ధాన్యాలను దసరా తరువాత కోతలు మొదలుపెడతారు. రబీ పంటగా గోధుమలను దీపావళి తరువాత విత్తుతారు. అందువలన దసరా అనేది ధన్యవాదాలు చెప్పే పండగగానూ, దీపావళి కోతల పండుగకానూ పిలువబడుతుంది.