Топ-100
Back

ⓘ పద్మ పురాణం హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి గురించి కూడా కొన్ని అధ్యాయా ..




పద్మ పురాణం
                                     

ⓘ పద్మ పురాణం

పద్మ పురాణం హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ పురాణం యొక్క రాతప్రతులు వివిధ పాఠాంతరాల రూపంలో లభ్యమౌతున్నాయి. వీటిలో రెండు ముఖ్యమైనవి. ఈ రెండింటి మధ్యలో చాలా తేడాలున్నాయి. ఒకటి భారతదేశం తూర్పు ప్రాంతానికి చెందినది కాగా మరొకటి పడమర ప్రాంతానికి చెందినది. ఇది 55.000 శ్లోకాలు కలిగిన పెద్ద గ్రంథాలలో ఒకటిగా చెప్పబడుతున్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతులలో సుమారు 50.000 శ్లోకాలు ఉన్నాయి.

ఈ గ్రంథంలోని పాఠ్యాన్ని మేళవించిన విధానాన్ని పరిశీలిస్తే ఇది వివిధ యుగాలలో వేర్వేరు రచయితలు రాసిన వేర్వేరు విభాగాలను సంకలనం చేసినట్లుగా కనిపిస్తుంది. ఇందులో సృష్టి నిర్మాణం, పురాణాలు, వంశచరిత్రలు, భూగోళ శాస్త్ర సంబంధ విషయాలు, నదులు, ఋతువులు, దేవాలయాలు, భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు ముఖ్యంగా రాజస్థాన్ లోని బ్రహ్మదేవాలయం తీర్థయాత్రలు, వాల్మీకి రామాయణంలోని సీతా రాముల కథ కన్నా భిన్నమైన కథనం, పండగలు, ఎక్కువగా విష్ణువును కీర్తించే, కొంచెం శివుని, కీర్తించే గాథలు, నీతి నియమాలు, అతిథి ఆదరణ, యోగా, ఆత్మను గురించిన తాత్విక వివరణ, అద్వైతం, మోక్షం లాంటి అంశాలను స్పృశించారు.

                                     

1. మూలాలు

  • Rocher, Ludo 1986. పురాణాలు. Otto Harrassowitz Verlag. ISBN 978-3447025225. CS1 maint: ref=harv link
  • K P Gietz; et al. 1992. Epic and Puranic Bibliography Up to 1985 Annoted and with Indexes: Part I: A - R, Part II: S - Z, Indexes. Otto Harrassowitz Verlag. ISBN 978-3-447-03028-1. CS1 maint: ref=harv link
  • Dalal, Rosen 2014. Hinduism: An Alphabetical Guide. పెంగ్విన్. ISBN 978-8184752779. CS1 maint: ref=harv link