Топ-100
Back

ⓘ ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల జాబితా. ఈ వ్యాసం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగర పాలక సంస్థల గురించి వివరిస్తుంది. భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట ..




                                               

నగరపాలక సంస్థ

మునిసిపల్ కార్పొరేషన్, నగరపాలక సంస్థ, సిటీ కార్పొరేషన్, మహానగర్ పాలిక, మహానగర్ నిగం లేదా, నగర్ నిగం లేదా నగర్ సభ అనేవి, భారతదేశంలో ఒక స్థానిక ప్రభుత్వం వర్గానికి చెందిన సంస్థ.ఇది ఒక మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల పరిపాలనను నిర్వహిస్తుంది. భారతదేశంలోని వివిధ నగరాల్లో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు స్థానిక పాలకమండలి అవసరం అనే భావనతో ఏర్పడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, విద్యాసంస్థల నిర్వహణ, గృహనిర్మాణం, రవాణావంటి అవసరమైన సమాజ సేవలను అందించడానికి ఇది పని చేస్తుంది.74 వ రాజ్యాంగ సవరణ చట్టం, పట్టణ స్థానిక సంస్థల ప్రభుత్వాలకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.

                                               

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిని పంచాయితీ రాజ్ చట్టం 1994 ద్వారా చట్టబద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలి స్థానిక సంస్థల ఎన్నికలు 2020 లో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది.

                                               

తెలంగాణ పురపాలక సంఘాలు

ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాల జాబితా గురించి వివరిస్తుంది.ఈ జాబితాలోని పురపాలక సంఘాలు భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల ప్రకారం ఆధారంగా ఉంది.తెలంగాణలో రాష్ట్రంలో పురపాలక సంఘాలు 128 ఉన్నాయి.వీటికి తోడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఒకటి ఉంది.తెలంగాణ పురపాలక సంఘాల కొత్త చట్టం ప్రకారం నగర పంచాయితీలు లేవు.

                                               

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణకు చెందిన స్వయం ప్రతిపత్తి అధికారాలుగల ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ.ఇది 1992 భారత రాజ్యాంగం 73, 74 సవరణ చట్టాల నిబంధనలు ప్రకారం ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థ ఎన్నికలు ఈ సంస్థ నిర్వహిస్తుంది.

                                               

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇది ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగ, చట్టపరమైన అధికారం కలిగిన సంస్థ. ఇది భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్సు 243 ZA, 243 K కింద ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది.

                                     

ⓘ ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల జాబితా

ఈ వ్యాసం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగర పాలక సంస్థల గురించి వివరిస్తుంది. భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల" ఆధారం ప్రకారంగా ఉంది.

                                     

1. గణాంకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా మాత్రమే రెండు నగర పాలక సంస్థలు కలిగి ఉన్నాయి. మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, 9 డిసెంబర్ 2015న నగరపాలక సంస్థలుగా వృద్ధి చేయబడ్డాయి.రాష్ట్రంలోని అన్నిజిల్లా కేంద్రాలు నగర పాలక సంస్థలుగా ఉన్నాయి. వీటిలో కేవలం విజయవాడ, తిరుపతి, రాజమండ్రి మాత్రమే జిల్లా కేంద్రాలు కావు.