Топ-100
Back

ⓘ సునీతా కృష్ణన్. డా. సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సంఘసేవకురాలు. ప్రజ్వల అనే సేవాసంస్థ స్థాపించి అందులో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయ ..
                                               

నా బంగారు తల్లి (సినిమా)

నా బంగారు తల్లి వేశ్యావృత్తి కథాంశంగా రూపొందిన తెలుగు చిత్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా సినిమాతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించిన దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలిగా పరిచయమున్న సునీతా కృష్ణన్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాను తెలుగుతో పాటుగా మలయాళంలో ఎంతె అనే పేరుతో ఒకే సారి నిర్మించారు. ఈ సినిమా విడుదలకంటే ముందే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. అలాగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు పొందింది.

                                               

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక స్వచ్ఛంద సంస్థ. అట్టడుగు నుంచి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న అక్కినేని నాగేశ్వరరావు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాదులో అభివృద్ధికి అక్కినేని గారు విశేష కృషి చేశారు. కృషి, పట్టుదల, అంకిత భావం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ కల వ్యక్తులు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన అక్కినేని ఆశయాలకు అనుగుణంగా వివిధ రంగాలలో ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు తోటకూర ప్రసాద్. డిసెంబరు 20వ తేదీన హైదరాబాదులో ద్వితీయ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రధానం చేశారు.

                                               

సైనికుడు (2006 సినిమా)

సైనికుడు 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. మహేష్ బాబు, త్రిష, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. అంతకు ముందే మహేశ్ బాబు హీరోగా సంచలనాత్మకమైన విజయం సాధించిన పోకిరి చిత్రం వెంటనే ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యింది కాని బాక్సాఫీసు వద్ద పూర్తిగా విఫలమయ్యంది.

                                               

2013 నంది పురస్కారాలు

2013 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2017, మార్చి 1వ తేదీన ప్రకటించబడ్డాయి. ప్రభాస్ నటించిన మిర్చి ఉత్తమ చిత్రంగా బంగారునందిని గెలుచుకోగా, నా బంగారు తల్లి వెండినంది గెలుచుకుంది. మిర్చి సినిమాలోని నటనకు ప్రభాస్ కి ఉత్తమ నటుడిగా, నా బంగారు తల్లి సినిమాలలోని నటనకు అంజలి పాటిల్ కి ఉత్తమ నటి అవార్డులు లభించాయి. హేమా మాలినికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, వాణిశ్రీకి రఘుపతి వెంకయ్య అవార్డు, దిల్ రాజుకి నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం, ఎ. కోదండరామిరెడ్డికి బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులు వచ్చాయి. 2013 సంవత్సరానికి దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహర ...

                                               

భారతి (నటి)

భారతి కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. ఈమె కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ను 1975, ఫిబ్రవరి 27వ తేదీన బెంగుళూరులో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కీర్తి, చందన అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త డా.విష్ణువర్ధన్ 2009,డిసెంబర్ 30న మరణించాడు.

                                               

బాంబే జయశ్రీ

"బాంబే" జయశ్రీ రామనాథ్ ఒక భారతీయ సంగీత విద్వాంసురాలు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో అనేక సినిమా పాటలను పాడింది. సంగీతకారుల కుటుంబంలో జన్మించిన జయశ్రీ వారి వంశంలో నాలుగవ తరానికి చెందిన గాయనీమణి. లాల్గుడి జయరామన్, టి.ఆర్.బాలమణి, ల వద్ద శిష్యరికం చేసిన ఈమెకు 2021 వ సంవత్సరానికి భారత నాల్గవ పెద్ద పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది.

సునీతా కృష్ణన్
                                     

ⓘ సునీతా కృష్ణన్

డా. సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సంఘసేవకురాలు. ప్రజ్వల అనే సేవాసంస్థ స్థాపించి అందులో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన ఆడపిల్లలను రక్షించి వారిని తిరిగి మంచి జీవితాల్ని ప్రసాదించడం ఈ సంస్థ యొక్క ప్రధానోద్దేశ్యం. 2016 లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమె కథ అందించి ఆమె భర్త రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన నా బంగారు తల్లి అనే సినిమాకి నాలుగు జాతీయ సినిమా పురస్కారాలు లభించాయి.

                                     

1. బాల్యం, విద్యాభ్యాసం

సునీత బెంగుళూరులో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డ రాజు కృష్ణన్, నళిని కృష్ణన్. ఆమె తండ్రి సర్వే ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవాడు. భారతదేశానికంతా మ్యాపులు గీయడం ఈ సంస్థ కర్తవ్యం. ఆయన ఉద్యోగరీత్యా ఆమె దేశంలో పలు ప్రాంతాలు చూడగలిగింది.

ఆమె 8 సంవత్సరాల వయసులోనే మొదటి సారిగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు నాట్యం నేర్పడంతో సమాజ సేవ వైపు ఆకర్షితురాలైంది. పన్నెండేళ్ళ వయసొచ్చేసరికి మురికివాడల్లో పాఠశాలలు ప్రారంభించింది. పదిహేనేళ్ళ వయసులో దళితుల పక్షాన ఒక ఉద్యమంలో పాల్గొనడంతో ఆమెను ఎనిమిది మంది దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సంఘటనే ఆమెను ప్రస్తుతం చేస్తున్న సేవకు పురిగొల్పింది.

సునీత బెంగుళూరు, భూటాన్లో కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. బెంగుళూరులోని సెయింట్ జాన్స్ కళాశాలలో ఎన్విరాన్ మెంట్ సైన్సు నుంచి బ్యాచిలర్ పట్టా పుచ్చుకున్న తర్వాత మంగుళూరులోని రోషిణి నిలయ నుంచి మాస్టర్స్ తర్వాత సామాజిక సేవా రంగంలో డాక్టరేటు సంపాదించారు పరిశోధనలో భాగంగా ఫీల్డు వర్కు చేయడానికి వ్యభిచారుల జీవితాలను పరిశీలించాలనుకుంది.

                                     

2. కెరీర్

1996 లో మంచి సామాజిక కార్యకర్తగా ఎదిగిన సునీతా, బెంగుళూరులో జరగబోతున్న మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొనింది. దాంతో ఆమెను మరో డజను మంది కార్యకర్తలతో సహా జైలులో వేశారు. ఆ ఉద్యమానికి ఆమె నేతృత్వం వహిస్తుండటంతో ఆమెను రెండు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. అన్ని రోజులు ఆమె తల్లిదండ్రులు ఆమెను చూడటానికి కూడా రాలేదు. ఒకసారి ముంబైలో గ్లోబలైజేషన్ మీద నిర్వహించిన సదస్సులో సునీతకు బ్రదర్ వర్ఘీస్ తో పరిచయం అయ్యింది. ఆయన హైదరాబాదులో మురికివాడల్లో ప్రజలకు సేవ చేయడానికి పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ పిన్ అనే సంస్థను ప్రారంభించాలని అనుకున్నాడు.

రెండు నెలల తర్వాత ఆమె జైలు నుంచి విడుదలైంది. ఆమె తనకు తల్లిదండ్రుల సహాయం లేదని తెలుసుకొని హైదరాబాదుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అక్కడ పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ శాఖలో యువతులను ఉత్తేజ పరిచే పనిచేయడానికి నిశ్చయించుకుంది. తొందరలోనే ఆమె మురికివాడలో ఉంటున్న నివాస సమస్యలకు అర్థం చేసుకొన్నది. అప్పటి ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనలో భాగంగా వారి ఇళ్ళను కూలదోయాలని నిర్ణయించడంతో ఆమె పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ తరఫున అందుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. దాంతో ప్రభుత్వం ఆ పథకానికి స్వస్తి చెప్పింది. అక్కడ ఉన్నప్పుడే ఆమెకు బ్రదర్ జోస్ వెట్టికాటిల్ తో పరిచయమైంది. ఆయన సెయింట్ గేబ్రియల్ కు చెందిన మాంట్ ఫోర్ట్ బ్రదర్స్ తరఫున నిర్వహించే బాయ్స్ టౌన్ అనే సంస్థకు డైరెక్టరుగా వ్యవహరించేవాడు. ఈ సంస్థ ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న యువకులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేసేది. ఇది 1995 లో మాట.

                                     

2.1. కెరీర్ ప్రజ్వల

1996 లో హైదరాబాదులోని మెహబూబ్ కీ మెహందీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో నివసించే కొంతమందిని ఖాళీ చేయించారు. దీని ఫలితంగా వ్యభిచార కూపంలో చిక్కుకున్న వేలమంది నిరాశ్రయులయ్యారు. వెట్టికాటిల్ సహకారంతో వారిని ఖాళీ చేయించిన స్థలంలోనే సునీతా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, వారి రెండో తరం కూడా ఈ వృత్తిలో దిగకుండా ఉండేందుకు ఒక పాఠశాలను ప్రారంభించింది. సంస్థ ప్రారంభించిన కొత్తల్లో దాన్ని నడపడానికి ఆమె తన నగలను, ఇంట్లో ఉన్న సామాను సైతం అమ్ముకోవాలసి వచ్చింది.

ప్రస్తుతం ఈ సంస్థ నివారణ, సంరక్షణ, పునరావాసం, పునరంకితం, సహాయం అనే ఐదు మూల స్థంబాల ఆధారంగా పనిచేస్తుంది. వ్యభిచార భాదితులకి ఈ సంస్థ నైతికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా సహాయం చేస్తుంది. అంతే కాకుండా నేరం చేసిన వారికి తగిన శిక్ష పడేలా చేస్తుంది. ప్రజ్వల ఇప్పటి దాకా 12000 మందిని వ్యభిచార కూపం నుంచి రక్షించింది. వారు చేసే కార్యక్రమాలు దాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ హక్కుల సంస్థగా గుర్తింపు సాధించి పెట్టాయి.

                                     

3. కుటుంబం

ఆమె భర్త పేరు రాజేష్ టచ్ రివర్. జోస్‌ వెట్టికాటిల్‌ ద్వారా రాజేష్‌ ఆమెకు పరిచయమయ్యాడు. వృత్తి రీత్యా సినిమా దర్శకుడు. రాజేష్‌కు సందేశాత్మక చిత్రాలు తీసే దర్శకుడిగా మంచి పేరుంది. రాజేష్ కు ఒకసారి ప్రమాదం జరగడంతో ఆమె చికిత్స జరిపించింది. ఇదే సమయంలో జోస్‌ వెట్టికాటిల్‌ గుండెపోటుతో చనిపోయారు. జోస్‌ ఆఖరి కోరిక మేరకు వారిద్దరూ ఒక్కటయ్యారు.

                                     

4. దాడులు, బెదిరింపులు

సునీతా మీద ఇప్పటిదాకా 14 సార్లు భౌతికంగా దాడులు జరిగాయి. చంపుతామంటూ బెదిరింపులు ఇప్పటికీ వస్తున్నాయి. ఒకసారి ఆమె ప్రయాణిస్తున్న ఆటోను ఓ సుమో వ్యాను ఉద్దేశ్యపూర్వకంగా గుద్దేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె తీవ్రగాయాలతో బయట పడింది. అలాగే మరోసారి యాసిడ్ దాడి నుంచి తప్పించుకొన్నది. మరోసారి విష ప్రయోగం నుంచి తప్పించుకొన్నది. కానీ ఆమె ఈ దాడులు తనలో మరింత పట్టుదలను పెంచాయని పేర్కొనింది.

                                     

5. పురస్కారాలు

ఆమె ధైర్యానికి అలుపెరగక చేస్తున్న పోరాటానికి మెచ్చి అనేక పురస్కారాలు ఆమెను వరించాయి.

 • అవుట్ స్టాండింగ్ వుమన్ అవార్డు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమన్, 2013.
 • మహిళా స్వావలంబనకు గాను రోటరీ క్లబ్ ముంబై వారిటే అనితా ఫరేఖ్ పురస్కారం, 2013.
 • హ్యూమన్ సింఫనీ ఫౌండేషన్ నుంచి లివింగ్ లెజెండ్స్ పురస్కారం, 2013.
 • CIVICUS ఇన్నొవేషన్ పురస్కారం, 2014.
 • నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ద్వితీయ ఉత్తమ చిత్రం నా బంగారు తల్లి
 • భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ - 2016
 • లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్ నుంచి పీపుల్ ఆఫ్ ది ఇయర్, 2014.
 • కేరళ ప్రభుత్వం నుంచి మహిళా తిలకం అవార్డు, 2013.
 • యధువీర్ ఫౌండేషన్ పురస్కారం
 • కైరాలి అనంతపురి పురస్కారం, మస్కట్, 2014.
 • ఎక్సెంప్లరీ వుమన్ అవార్డు.
 • గాడ్ ఫ్రే ఫిలిప్స్ నేషనల్ ఆమోదిని అవార్డు, 2013.
 • రోటరీ సోషియల్ కాన్షస్ నెస్ అవార్డు, పాల్ హారిస్ ఫెలోషిప్, రోటరీ క్లబ్ ముంబై, 2013.
 • మదర్ థెరిసా పురస్కారం
 • వుమన్ ఆఫ్ సబ్ స్టాన్స్ పురస్కారం, రోటరీ క్లబ్ ముంబై, 2014.


                                     

6. ఇతర లింకులు

 • ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
 • Prajwala home page
 • "I experimented with myself during my stay in Mangalore". The Hindu. November 16, 2012.
 • Sunitha Krishnans blog
 • "From real to reel". The Hindu. June 20, 2012.
 • The Sex Slave Rescuer
 • "TED gain: $100.000 in 20 minutes, all for a cause". Hindustan Times. November 7, 2009.
 • Ms. Sunitha Krishnan Conferred with CNN IBN Real Heroes Award
 • "Sunitha Krishnan and Prajwala Foundation". Journalist Diary - Tv9. June 3, 2013.
 • "Half the Sky: Turning Oppression into Opportunity for Women". Spectrum Magazine. June 7, 2010. Archived from the original on 2014-11-27. Retrieved 2016-03-06.