Топ-100
Back

ⓘ భౌగోళిక గుర్తింపులు ..
                                               

గిర్ కేసర్ మామిడి

గిర్ కేసర్ మమిడి, భారతదేశంలోని గిర్నర్ పర్వత ప్రాంతాల్లో పండే మామిడి రకం. దీనిని గిర్ కేసర్ అని కూడా అంటారు. మంచి నారింజ పండు రంగులో ఉండే ఈ మామిడి గుజ్జు వల్ల ఈ రకం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రకం మామిడి పండుకు 2011లో భౌగోళిక గుర్తింపు లభించింది.

                                               

చందేరి చీర

పురాణాలు లేదా వేద కాలం ప్రకారం ఈ చందేరి చీర కృష్ణుడు యొక్క దాయాది శిశుపాల/శిశుపాలుడు స్థాపించాడు అని చెప్పబడింది. ఈ ప్రసిద్ధ నేత సంస్కృతి 2 వ శతాబ్దం, 7 వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇది బుందేల్ఖండ్, మాల్వా రెండు రాష్ట్ర సాంస్కృతిక ప్రాంతాల సరిహద్దులలో నెలకొని ఉంది. వింధ్యాచల్ శ్రేణులు ఆచారములు, సంప్రదాయాలు చాలా విస్తృతంగా ఉంది. 11 వ శతాబ్దంలో వాణిజ్య స్థానాలు అయిన మాల్వా, మెడ్వే, మధ్య భారతదేశం, దక్షిణ గుజరాత్ దీనికి ప్రాముఖ్యతను ఇచ్చింది.

                                               

జిందా తిలిస్మాత్

జిందా తిలిస్మాత్ హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధమైన యునానీ మందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు. ఇలా అన్నింటికీ ఇది సర్వరోగనివారిణిలా పనిచేస్తుంది. ఈ మందు ఫార్ములాను కనిపెట్టింది ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు వలస వచ్చిన హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. దాదాపు వందేళ్ల నుండి ప్రచారంలో ఉన్న ఈ ఔషధం పల్లెటూళ్లోని పచారీ కొట్టు మొదలు సిటీలోని డిపార్ట్‌మెంటల్ స్టోర్ వరకు ఎక్కడైనా దొరుకుతుంది. దేశీయ వైద్యవిధానానికి ప్రజలలో ఉన్న ఆదరణకు ఇది ఒక ఉదాహరణ.

                                               

జైపూర్ కాలు

జైపూర్ కాలు అంగవైకల్యం కలవారికి ఒక వరప్రసాదం. ఇది రబ్బరు ఆధారిత పాలీ యూరిథేన్‌తో తయారుచేయబడిన కృత్రిమ అవయవము. మోకాలు క్రింది భాగం నుండి పాదం వరకు వివిధ పరిమాణాలలో ఈ కృత్రిమ అవయవం ఉంటుంది. ఇది ఈ తరహా కృత్రిమ అవయవాలలో అతి చవకైనది, సులువుగా తయారు చేయడానికి, అమర్చుకోవడానికి అనువైనది. జైపూర్ కాలుతో ఓ వ్యక్తి నడవడం, పరిగెత్తడం, సరిగ్గా కూర్చోవడం వంటి తన రోజు వారి అవసరాలు సులువుగా చేసుకోవచ్చు. దీని పనితీరు కారణంగా ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరుపొందింది.

                                               

భౌగోళిక గుర్తింపు

ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని చేసిందే "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999". ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ వర్తిస్తుంది. వ్యవసాయ సంబంధమైన, సహజమైన, తయారుచేసిన వస్తువులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తిఅయిన వస్తువుల విషయంలో, ఆ వస్తువులను ఆ ప్రాంతంలోనే ప్రాసెస్ చేసి ఉత్పత్తిచేయడం జరగాలి. ఆ వస్తువుకు ప్రత్యేకమైన లక్షణాలు, ఖ్యాతి ఉండాలి.

                                               

శివకాశి బాణాసంచా

తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణం భారతదేశంలో బాణాసంచా ఉత్పత్తికి ప్రఖ్యాతి చెందింది. బాణాసంచాను ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో పేల్చినప్పటికీ వివాహాలు, ఎన్నికల ఊరేగింపులు, నాయకుల పుట్టినరోజు వేడుకలు, క్రీడలలో విజయం సాధించినప్పుడు మొదలైన అనేక సందర్భాలలో ఉపయోగిస్తారు.