Топ-100
Back

ⓘ సంస్థాగత సంస్కృతి సంస్థలలో సాంస్కృతిక విలువల పద్ధతుల మూలాలని, అభివృద్ధిని వివరించే సంస్థాగత సిద్ధాంతం లోని ఒకానొక అంశం. సంస్థలు, పరిపాలకులు ఈ ప్రక్రియనే Corpora ..
                                               

సంస్థాగత నడవడిక

మూస:Morefootnotes సంస్థాగత నడవడిక లేదా సంస్థాగత ప్రవర్తన ఆంగ్లం: Organizational behaviour అనగా సంస్థల్లో వ్యక్తుల వ్యవహార శైలిపై క్రమబద్ధ అధ్యయనం చేయటం, ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మానవ వ్యవహారానికి, సంస్థకి మధ్య సమన్వయం ఏర్పరచటం. సంస్థాగత నడవడిక సంస్థ అభివృద్ధిలో, సంస్థాగత పనితీరు మెరుగుపరచడంలో, వ్యక్తి, సమూహ పనితీరు/సంతృప్తి/నిబద్ధతలని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. సిమ్స్ అభిప్రాయాల ప్రకారం 1994, సంస్థాగత సిద్ధాంతంలో విప్లవం తీసుకురావడం, సంస్థాగత జీవితంలో మెరుగైన భావ సంకల్పనను అభివృద్ధి చేయడం సంస్థాగత సిద్ధాంతకర్తల యొక్ఒక ప్రధాన లక్ష్యంగా కనబడుతోంది. సిద్ధాంతంలో సూచించిన అంచనాల స్థా ...

                                               

సరఫరా గొలుసు

వ్యాపారం, ఫైనాన్స్‌లో, సరఫరా గొలుసు అనేది వినియోగదారులకు ఉత్పత్తి లేదా సేవను సరఫరా చేయడంలో పాల్గొనే సంస్థలు, వ్యక్తులు, కార్యకలాపాలు, సమాచారం, వనరుల వ్యవస్థ. సహజ వనరులు, ముడి పదార్థాలు, విడిభాగాలు మొదలైనవాటికి తగు పరిణామాలు చేర్చి తుది ఉత్పత్తిగా మార్చి వినియోగదారునికి అందించడం సరఫరా గొలుసు కార్యకలాపాలు. అధునాతన సరఫరా గొలుసు వ్యవస్థలలో, ఉపయోగించిన ఉత్పత్తుల అవశేష విలువలో ఇంకా పనికొచ్చేది ఉంటే వాటిని ఏ సమయంలోనైనా తిరిగి సరఫరా గొలుసు లోకి ప్రవేశ పెట్టవచ్చు. ఇంటర్నెట్‌లో, వినియోగదారులు నేరుగా పంపిణీదారులను సంప్రదించే వీలుంది. దీనివలన మధ్యవర్తులు తగ్గిపోయి గొలుసు పొడవు కొంతవరకు తగ్గింది.

                                               

మానవ వనరులు

మానవ వనరులు పాశ్చాత్య దేశాలలో 1960వ సంవత్సరంలో నూతనంగా, సాపేక్షంగా, కనుగొనబడిన నిర్వహణకు సంబంధించిన ఆధునిక పదం అయినప్పటికీ, మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వేద యుగాలు నుండే భారతదేశంలో గుర్తించవచ్చును. భగవద్గీతలో, కృష్ణుడు అర్జునుడికి ఆధ్యాత్మికంగా ఉపదేశాలు చేశాడు. అయితే ఈ ఉపదేశాల ద్వారా అప్పటిలోనే ఇప్పటి నిర్వహణలో బోధనాంశాలైన స్వీయ నిర్వహణ, ఆగ్రహ నిర్వహణ, ఒత్తిడి నిర్వహణ, సంఘర్షణ నిర్వహణ, నాయకుని మార్పిడి, ప్రేరణ, లక్ష్యం నిర్దేశ్యం మొదలగు వంటి వాటి గురించి ప్రస్తావించబడింది. నిజానికి, నేడు అనేక బి-స్కూళ్ళు నిర్వహణా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు భగవద్గీత ఆధునిక నిర్వహణలో అలా అవసరం అని, అభివృద ...

                                               

రంజని-గాయత్రి

రంజని, గాయత్రి ల తల్లిదండ్రులు బాలసుబ్రమణ్యం, మీనాక్షి. తల్లి మీనాక్షి కర్నాటక సంగీత విద్వాంసురాలు. వారు క్లాసికల్ సంగీతంలో ప్రసిద్ధమైన పాలక్కడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. వైలెన్‌ విద్వాంసులుగా తమ 9వ ఏటనుంచే నేర్చుకోవడం ఆరంభించారు.ఈ సోదరీమణులు. ముంబాయి షన్ముఖానంద సంగీత విద్యాలయానికి చెందిన టి.ఎస్‌.కృష్ణస్వామి గురువు వద్ద ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ సంగీత సాధన ఆరంభించారు

                                               

శాన్ ఫ్రాన్సిస్కో

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పశ్చిమాన పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న అందమైన నగరం శాన్ ఫ్రాన్సిస్కో. పసిఫిక్ సముద్రతీరానికి దీనిని ద్వారంగా వ్యవహరిస్తారు. దీని జనాభా సుమారు ఎనిమిది లక్షలు. ఇది జనాభా పరంగా రాష్ట్రంలో నాల్గవస్థానంలోనూ, జనసాంద్రత విషయంలో అమెరికాలో ఇది రెండవస్థానంలోనూ ఉంది. ఈ పట్టణం కొండలకు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 50 కొండలు ఉన్నాయి. ఈ కొండలను సుందర పర్యాటక కేంద్రంగా మలచారు. ఇవికాక పర్యాటక కేంద్రాలైన అనేక దీవులు ఉన్నాయి.

                                               

చైనా

ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్ చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం English: Peoples Republic of China పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. 130 కోట్ల 1.3 బిలియన్ పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్ Beijing.అతిపెద్ద నగరం షాంఘై shangai.చైనా ఏక పార్టీ పాలిత దేశం. చైనాలో 22 భూభాగాలు ఉన్నాయి., వీటిలో 5 స్వయం ప్రతిపత్తి అటానిమస్ కలిగిన భూభాగాలు, నాలుగు డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీలు, రెండు స్వయంపాలిత భూభాగాలు హాంగ్‌కాంగ్, మాకౌ ఉన్నాయి. పి.ఆర్.సిలో ఉన్న ఫ్రీ ఏరియా ఆ ...

                                     

ⓘ సంస్థాగత సంస్కృతి

సంస్థాగత సంస్కృతి సంస్థలలో సాంస్కృతిక విలువల పద్ధతుల మూలాలని, అభివృద్ధిని వివరించే సంస్థాగత సిద్ధాంతం లోని ఒకానొక అంశం. సంస్థలు, పరిపాలకులు ఈ ప్రక్రియనే Corporate Culture లేదా Administrative Culture అని కూడా వ్యవహరిస్తారు.

సంస్థాగత సంస్కృతి నిర్వహణ యొక్క అని అంశాల పై ప్రభావితం చూపుతుంది. ఉదా:

  • నిర్ణయం తీసుకొనే విధానం
  • సహోద్యోగులతో, వినియోగదారులతో, సరఫరాదారులతో సత్సంబంధాలు, భావప్రకటన
  • నాయకత్వం

సంస్థ యొక్క ప్రతి కార్యాచరణ యొక్క సృష్టి సంస్థాగత సంస్కృతితోనే నిర్దేశించబడటమే గాక, సాంస్కృతికంగా ప్రభావం చూపబడుతుంది. సంస్థాగత సంస్కృతిని సంస్థలు వాటికై అవి అర్థం చేసుకొనటం వలన సంస్థ యొక్క సభ్యులు సమర్థవంతంగా లక్ష్యాలని చేరుకోవటంలో దోహదపడుతుంది. ఈ పరిజ్ఞానంతో బాహ్య జనులు కూడా సంస్థని అర్థం చేసుకొనటానికి అవకాశం ఉంది.

                                     

1. ప్రాథమిక అంశాలు

సంస్థాగత సంస్కృతి యొక్క భావన, సాంస్కృతిక నృశాస్త్రంలో సంస్కృతి పై ఉన్న భావన నుండి ప్రసరిస్తుంది. అందుకే నిర్ధిష్ట సంస్కృతిని రూపుదిద్ది తద్వారా సామూహిక సంస్థాగత ప్రవర్తనని, సంస్థలలో వ్యక్తుల ప్రవర్తనలని ప్రభావితం చేయగలిగే సంస్థలే మనగలుగుతాయి. విలువల, ప్రమాణాల, ఆలోచనావిధానాల, నమూనాల పరస్పర సంకర్షణల వలన సంస్థాగత సంస్కృతి ఉద్యోగులని సమష్టిగా వర్గీకరిస్తుంది. సంస్థాగత సంస్కృతి పైన, సంస్థ యొక్క రూపురేఖల పైన బాహ్య ప్రపంచపు ప్రభావమే అధికం ఉంటుంది.

సంస్థాగత సంస్కృతిలో మార్గదర్శక పరిశోధకులు అయిన ఎద్గార్ హెచ్ షైన్ సంస్థాగత సంస్కృతిని ఈ విధంగా నిర్వచించాడు. "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో, భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా."

ఇతర నిర్వచనాలు:

  • "సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల, ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985
  • "సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983
  • "పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997

సంస్థలో దాదాపు అన్నింటి గురించి ప్రస్తావించటం వలన పై నిర్వచనాలు సమస్యాత్మకంగా పరిగణించబడ్డాయి. సంస్కృతి యొక్క నిర్వచనాలు అస్పష్టంగా ఉండటం వలన సంస్థాగత సంస్కృతి సార్వత్రిక నియమం వలె అనిపిస్తుంది. వివిధ పరిశోధనా పద్ధతులు వేర్వేరుగా ఉన్ననూ జాతీయ, స్థానిక సంస్కృతులు సంస్థాగత సంస్కృతిపై ప్రభావం చూపుతాయనటానికి, వీటి ప్రభావం సంస్థాగత లక్ష్యాల సాధన పై ఉంటుందనటానికి మాత్రం ఏకాభిప్రాయం ఉంది. దీనిపై పరిశోధనలు జరిగి, ఇది నిరూపించబడింది.

వేర్వేరు ప్రదేశాలలో, సంస్థ-సంస్థకి సంస్థాగత సంస్కృతిలో తేడా ఉండటం వలన దీనికి ఒక సార్వత్రిక విధానాన్ని ఆపాదించలేము. శ్రామికులు వారి అనుభవాలని ఒకరితో ఒకరు పంచుకోవటం వలన ఇది సృష్టించబడుతుంది. దీనిలో మార్పులు అంత వేగంగా చోటుచేసుకోవు. అంతేగాక సంస్థాగత సంస్కృతి సంస్థని సాంఘికంగా, ఆర్థికంగా సంస్థాగత నిర్మాణ పరంగా, వ్యూహ పరంగా ప్రభావితం చేస్తుంది.

                                     

2. వ్యాపార నిర్వహణలో సంస్థాగత సంస్కృతి

సంస్థాగత సంస్కృతిని అన్ని సంస్థలు గుర్తించవు. సంస్థాగత సంస్కృతికి కారకాలు, ప్రభావాల యొక్క పరిశోధన సామాజిక శాస్త్త్రంతో కలిసిననూ నిర్వహణలో కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రవర్తనా నియమావళిలో సంస్థ యొక్క నియమాలు, నిర్దేశకాలు, అంతర్గత-బాహ్య సమాచార ప్రసారాలకి సిద్ధాంతాలు, ఉద్యోగి ప్రవర్తించవలసిన తీరు పేర్కొనబడి ఉంటాయి. సంస్థ కట్టుబడి ఉండే విలువలు, దినచర్యలో ఆచరించవలసిన కార్యాలు ప్రవర్తనా నియమావళికి మూలం.

సంస్థాగత సంస్కృతిని మార్చాలంటే వ్యాపార ధర్మాన్ని, వ్యాపార దృష్టిని మార్పు నిర్వహణ ద్వారా సమూలంగా మార్చవలసి ఉంటుంది. సారూప్య సంస్థాగత సంస్కృతి నెలకొనాలంటే వైవిధ్యత నిర్వహణలో వివిధ పద్ధతులని కలగలిపి వివిధ రకాల మనుషులని, సమూహాలని అనుసంధానం చేయవలసి ఉంటుంది.

సంస్థాగత సంస్కృతితో సంస్థ తన స్వంత ప్రతిబింబాన్ని ప్రదర్శిస్తుంది. భావప్రకటన చేస్తుంది. అనుచరించబడుతుంది. శిక్షణ ద్వారా, మార్గదర్శక సూచనల ద్వారా నేర్పబడుతుంది. సంస్థాగత లక్ష్యాలైన అంతర్గత భావవ్యక్తీకరణ, నిర్ణయం తీసుకోవటంలో వేగం, ఫలితంగా లభార్జన దీని వలన పెరుగుతాయి.