Топ-100
Back

ⓘ కేశవదేవ ఆలయం. ఈక్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. డిల్లీకి దక్షిణమున 140 కి.మీ. దూరమున గల మధురా స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతార స్థలము ..




కేశవదేవ ఆలయం
                                     

ⓘ కేశవదేవ ఆలయం

ఈక్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. డిల్లీకి దక్షిణమున 140 కి.మీ. దూరమున గల "మధురా" స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతార స్థలము ఉంది. దీనికి ఉత్తరము 10 కి.మీ.దూరములో గోవర్థనము పర్వతం ఉంది. ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రమిపుడు కనిపించదు. మధురానాథ, ద్వారకానాథ సన్నిధులు ప్రసిద్ధిచెందినవి. ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్యస్వామి వారిచే నిర్మింపబడిన సప్త ప్రాకారములు గల రంగమందిరం దాక్షిణాత్య సంప్రదాయముతో పాంచరాత్రాగ మోక్తముగా నిర్వహింపబడు చున్నది. ఇచట అన్ని సన్నిధులు ఉన్నాయి.

సర్వ సౌకర్యములు ఉన్నాయి.ఈ క్షేత్రమున గల ముఖ్యమైన స్నానఘట్టము విశ్రాంత్ ఘాట్. ఇచటనొక సన్నిధి నిర్మించి గోపుర శిఖరమున గంటలను కట్టిఉన్నాయి. ప్రతిదినము సాయంకాలము 6 గంటలకు ఇచట నుండి యమునా నదికి దీపారాధన జరిపింతురు.

కంసునికోట, కేశవాలయము, బందే ఖనా శ్రీకృష్ణుని జన్మస్థానము దర్శించతగినవి.