Топ-100
Back

ⓘ స్త్రీవాదం ..
                                               

అంతరిక్ష యానంలో మహిళలు

ప్రపంచంలోని చాలా మంది మహిళా వ్యోమగాములు అంతరిక్షయానం చేశారు. భూమి సముద్రమట్టానికి 100కి.మీ పైన ఉన్నదాన్ని కెరమన్ లైన్ అని అంటారు. ఎందరో మహిళలు ఆ లైను కన్నా పైన, ఔటర్ స్పేస్ లో కూడా ప్రయాణించారు. కానీ డిసెంబరు 2016 వరకూ భూమి కక్ష్య దాటి ఏ మహిళా ప్రయాణించలేదు. చాలా దేశాలకు చెందిన మహిళలు అంతరిక్ష పరిశోధనలలో పని చేశారు. అంతరిక్ష యానం చేసిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి వాలెంతినా తెరిష్కోవా. రష్యా కు చెందిన ఆమె 1963లో తొలిసారి అంతరిక్ష యానం చేశారు. అంతరిక్ష యానం, పరిశోధనల విభాగంలో మహిళలను ఎంపిక చేసుకోవడం చాలా అరుదుగా ఉండేది. 1980ల నుంచి మహిళా వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ఎక్కువమంది మహిళా వ్యోమగాముల ...

                                               

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గాపిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం, వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐ ...

                                               

క్యూబాలో స్త్రీల హక్కులు

క్యూబా దేశం మహిళలకు, పురుషులతో సమానంగా రాజ్యాంగ హక్కులు ఇచ్చింది. ఈ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులన్నింటిలో మాత్రమే కాక కుటుంబంలోనూ మహిళలూ, పురుషులూ సమానం. క్యూబా రాజ్యాంగం లోని 44వ ఆర్టికల్ ప్రకారం "క్యూబా దేశం ఈ ఆర్టికల్ ద్వారా ఇచ్చే హామీ ఏంటంటే ప్రతీ మహిళకూ, పురుషులతో సమానంగా అవకాశాలు ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధిలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది." క్యూబా జాతీయ అసెంబ్లీలో దాదాపు 48.9% పార్లమెంట్ సీట్లు స్త్రీలకే కేటాయింటారు. రాజకీయాల్లో మహిళా అభ్యర్థులు పాల్గొనే విషయంలో 162 దేశాల్లో క్యూబా 6వ స్థానంలో నిలిచింది. ఒక సీటుకి ఒక అభ్యర్థి మాత్రమే ఉంటారు. అభ్యర్థిని జాతీయ అభ్యర్థిత్వ ...

                                               

బిబిసి వారి 100 మంది మహిళలు

100 మహిళలు అనేది బిబిసి విడుదల చేసే జాబితా. 2013లో మొదలైన ఈ సిరీస్ లో ప్రతీ సంవత్సరం అంతర్జాతీయంగా 100 మంది మహిళలను ఎంపిక చేసి, జాబితాగా వేస్తారు. ఈ సిరీస్ ద్వారా 21వ శతాబ్దంలో మహిళల పాత్ర తెలుస్తుంది. ప్రతీ ఏటా లండన్, మెక్సికో నగరాల్లో బిబిసి ఈ విషయమై కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. బిబిసి జాబితాను ప్రచురించిన తరువాత మూడు వారాల సమయంలో మహిళల గురించి వార్తా కథనాలు, అంతర్జాల నివేదికలు, చర్చలు నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ లిస్టు గురించి ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తారు. అలాగే చర్చలు, ఇంటర్వ్యూలు చేసి లిస్టుపై అభిప్రాయాలు వెల్లడిస్తారు. అలా ఖరారు చేసిన జాబితాను బిబిసి ప్రచురిస్తార ...

                                               

భారతదేశంలో మహిళల ఆరోగ్యం

భారతదేశంలో మహిళల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి బహుళ సూచికలను దృష్టిలో పెట్టుకోవాలి. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సంప్రదాయాలను బట్టీ మహిళల ఆరోగ్య పరిస్థితులు మారుతుంటాయి. భారతదేశంలోని మహిళల ఆరోగ్యాన్ని పలు కోణాల్లో మెరుగుపరచేందుకు, ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలూ, భారత్ లోని పురుషుల ఆరోగ్యంతో పోల్చవలసి వస్తుంది. ఆరోగ్యం మనిషి జీవితానికీ, ఆర్థిక వృద్ధికి కూడా చాలా ముఖ్యమైనది. భారతదేశం లో మహిళల ఆరోగ్యం వారి పరిస్థితులను గమనిస్తూ, రోగ నిర్ధారణ తో చికిత్స చేయడం, వారి శారీరక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేసే వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వారికీ సరైన వైద్యను అందించటం ప్రభుత్వాల కర్తవ్యం. భారతదేశంలో మహిళలు అన ...

                                               

భారతదేశంలో స్త్రీవాదం

భారతీయ మహిళలకు సమాన అవకాశాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులు స్థాపించడం, నిర్వచించడం, రక్షించడం అనేవి లక్ష్యాలుగా కలిగిన ఉద్యమాలన్నిటినీ కలిపి భారతదేశంలో స్త్రీవాదం అని చెప్పుకోవచ్చు. భారతీయ సమాజంలో మహిళా హక్కుల కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీవాద ఉద్యమాల్లాగానే భారతేదశంలోని స్త్రీవాద ఉద్యమం కూడా లింగ సమానత్వాన్ని కోరుతుంది. ఈ లింగ సమానత్వం అనేదాంట్లో సమాన వేతనాలు అందుకునే హక్కు, విద్య, వైద్యం వంటివి పురుషులతో సమానంగా పొందే హక్కు, సమానమైన రాజకీయ హక్కులు వంటివి ఉన్నాయి. Indian feminists also have fought against culture-specific issues within Indias patriarchal soc ...

                                               

సైన్యంలో మహిళలు

గత 3.000 ఏళ్ళగా వివిధ సంస్కృతుల్లోనూ, దేశాల్లోనూ స్త్రీలు సైన్యాలలో పలు విధాలుగా ఎన్నో పాత్రలు పోషించారు. ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్కృతుల్లోనూ పురుషులే ప్రధానంగా యుద్ధాలలో పాల్గొంటున్నా, ప్రాచీన మహిళా యోధుల నుంచీ ప్రస్తుతం సైన్యాల్లో పని చేస్తున్న మహిళల దాకా ఎన్నో రకాలుగా యుద్ధాల్లో పాల్గొన్న వారు ఉన్నారు. సైన్యాల్లో వివిధ హోదాల్లో, పలు శాఖల్లో స్త్రీలు పనిచేస్తున్నారు. కానీ చరిత్రలో చాలా తక్కువ మంది స్త్రీలు, పురుషులతో పాటు యుద్దాలలో పాల్గొన్నారు. యుద్ధం చేయడం కోసం అమెరికన్ సివిల్ వార్ లో కొంత మంది స్త్రీలు, మగవారి వలే వస్త్రధారణ చేసుకున్నవారున్నారు. యుద్ధంలో ముఖాముఖీ పోరాటాల్లో పాల్గొ ...

                                               

స్త్రీవాద వ్యతిరేకత

స్త్రీవాద వ్యతిరేకత అనగా ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదం పట్ల నెలకొన్న వ్యతిరేకత. వివిధ సమయాలలో వివిధ సంస్కృతులలో ఇది వివిధ రూపాలని సంతరించుకొన్నది. 18వ శతాబ్దపు అంతం, 19వ శతాబ్దపు ప్రారంభంలో స్త్రీ ఎన్నికలలో పాలుపంచుకోవటాన్ని నిరసించటం ఒక ఉదాహరణ కాగా, 20వ శతాబ్దంలో సమాన హక్కుల సవరణలని వ్యతిరేకించటం మరొక ఉదాహరణ. స్త్రీ హక్కుల పై సర్వసాధారణంగా నెలకొని ఉన్న విరోధ భావము దీనికి ఒక కారణం కాగా, పురుషాధిక్య ప్రపంచం, సంఘంలో స్త్రీ నిత్యం ఎదుర్కొనే ప్రతికూలతలు అసంబద్ధమైనవని, అతిశయోక్తిగా చెప్పబడుతున్నవని లేదా స్త్రీవాద ఉద్యమం పురుష ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందని, పురుష జాతికి హాని తలపెడుతుందని లేదా పురుష ...

                                               

స్త్రీవాదం

తెలుగు సాహిత్యంలో రెండు ఉద్యమాలు వ్యాప్తిచెందాయి. అందులో ఒకటి స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం. స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీలకు సామాజికపరమైన న్యాయం కోసం మొదలయ్యాయి. భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతుంది. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీ నీచంగా చిత్రించబడింది. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది.

                                               

స్మృతికాలపు స్త్రీలు

స్మృతికాలపు స్త్రీలు జటావల్లభుల పురుషోత్తము రచించిన పుస్తకం. ఇది 1935 లో తొలిసారిగా ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము తరపున వల్లూరి సూర్యనారాయణరావుగారు ప్రచురించారు.