Топ-100
Back

ⓘ తిరువిడందై 108 వైష్ణవ దివ్య దేశాలలో 62-వ ది. ఇది చెన్నపట్నం లోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార ..




తిరువిడందై
                                     

ⓘ తిరువిడందై

తిరువిడందై 108 వైష్ణవ దివ్య దేశాలలో 62-వ ది. ఇది చెన్నపట్నం లోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార్గము పై కోవళం బస్సు స్టేషను నుండి 3 కి. మి దూరములో కలదు.

                                     

1. ఆలయ విశేషాలు

ఇదియొక వరాహ క్షేత్రము. వివాహార్థులు ఇచట స్వామి వారిని కొలిచెనేని వివాహములు శిఘ్రముగ కుదురునని ఆస్తికుల నమ్మిక.

ఇక్కోవెల పల్లవ రాజులచే నిర్మింపబడెను. ఇది సముద్ర తీరమునకు సమీపమున కలదు. ఇక్కోవెలకు ముందు భాగమున పెద్ద పుష్కరిణి ఒకటి కలదు. దాని పేరు కల్యాణ తీర్థము. ఇచ్చటి మూలవిరాట్టు శ్రీ నిత్య కల్యాణ పెరుమాళ్, అఖిలవల్లి అమ్మవారు. స్వామి వారు ఆదిశేషునిపైనుండి అఖిలవల్లి అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టికొని దర్శనమిత్తురు. గర్భగుడికి కుడిప్రక్కన కోమళవల్లి అమ్మవారి సన్నిధియును ఎడమప్రక్కన ఆండాళ్ళమ్మవారి సన్నిధుయును కలదు. శ్రీ రంగనాథస్వామికిని ప్రత్యేక సన్నిధి గలదు.ఇక్కోవెల తెనాచార్య సంప్రదాయమును అనుసరించును.

                                     

2. ఐతిహ్యము

గవళ మహర్షికి 360 మంది కుమార్తెలు. వారి వివాహము చేయ నిశ్చయించినవాడై విష్ణుమూర్తిని వేడుకొనెను. తాను ఆ 360 మంది కన్యలను వివాహమాడగలనని శ్రీ మహావిష్ణువు వరమొసంగెను. దినమునకొక్కరు చొప్పున సంవత్సర పర్యంతము స్వామివారు వివాహమాడుచుండిరి. కావున వారికి నిత్య కల్యాణ పెరమాళ్ అను పేరు వచ్చెను. 360 మందిని వివాహమాడిన పిమ్మట వారెల్లరిని ఒక్కరిగ మార్చెను కావున అమ్మవారికి అఖిలవల్లి అను పేరు వచ్చెను. అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టికొనెను. కావున ఈ ప్రెదేశమునకు తిరువిడందై అను పేరు ఏర్పడెను.

                                     

3. రవాణా

చెన్నై నుండి మహాబలిపురమునకు వెళ్ళే పలు బస్సులు తిరువిడందై మిదుగా వెళ్తాయి. చెన్నై నుండి కడలూరు, పుదుచ్చేరి, వేళంగణ్ణి, కుంభకోణము మొదలగు ప్రాంతాలకు వెళ్ళే దూరప్రాంతపు బస్సులు కూడా తిరువిడందై మీదుగా వెళ్తాయి. నగర బస్సుల వివరములు