Топ-100
Back

ⓘ దత్తాంశ సేకరణ. దత్తాంశమే లేకపోతే సాంఖ్యకశాస్త్రమనుగడే ప్రశ్నర్ధకం. దత్తాంశాన్ని సేకరించి, నమోదు చేసి, వర్గీకరించి, విశ్లేషించేది సాంఖ్యకశాస్త్రమని చెప్పవచ్చు. ఇ ..
                                     

ⓘ దత్తాంశ సేకరణ

దత్తాంశమే లేకపోతే సాంఖ్యకశాస్త్రమనుగడే ప్రశ్నర్ధకం. దత్తాంశాన్ని సేకరించి, నమోదు చేసి, వర్గీకరించి, విశ్లేషించేది సాంఖ్యకశాస్త్రమని చెప్పవచ్చు. ఇది ఒక శాస్త్రం. దీనిలో నిర్ధిష్టమైన, నిర్వచనాత్మకమైన పద్ధతులు, వివిధ సంఘటన వివరాలు, వివరణలు సేకరించి భవిషత్తులో సంభవించబోయే అంశాలకు సమాచారన్ని సమకూర్చడానికి దత్తాంశ సేకరణ, పట్టికీకరణ ఉపకరిస్తుంది. సేకరించిన సమాచారం పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయ్తే ఆ దత్తాంశం ఏర్పడడానికి తోడ్పడ్డ అంశాల ప్రత్యేక లక్షణాల ఆధారంగా దత్తాంశాన్ని వర్గీకరించి, సరిచుసి తగురీతిలో పొందుపరచాలి. దత్తాంశన్ని ప్రత్యక్షీకరింప చేయడానికి ముందు స్పష్టంగా ఉండేటట్లుగా చూసుకొని తగురీతిలో అమర్చవలసి ఉంటుంది.

ఈ అధ్యాయంలో దత్తాంశ సేకరణ, వర్గీకర్ణ, పట్టికీకరణ పద్ధతుల గురించి అధ్యయనం చేస్తాం.

ప్రాథమిక దత్తాంశం, దాని సేకరణ:

మనమొక నూతన ప్రొజెక్ట్ని మొదలుపెట్టినపుడు, అందుకు సంబంధించిన సమాచారం లభించకపోవచ్చు. ఒకవేళ లభించినా అది పూర్తిగా చాలినంత కాకపోగా, సంపూర్ణంగా విశ్వసింపదగింది కూడా కాకపోవచ్చు. అటువంటి సందర్బల్లో సేకరించే దత్తాంశన్ని ప్రథమిక దత్తాంశం అంటారు. ఉదాహరణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పరీక్షా ఫలితాలకు సంబంధించిన ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఉత్తీర్ణత సాధించలేని అభ్యర్థుల సంఖ్య, ఉత్తీర్ణులైన వారిలో ప్రథమ శ్రేణి పొందిన వారి సంఖ్య, మొదలైన వివరాలతో దత్తాంశాన్ని రూపొందిస్తుంది. ఈ ఫలితాలు ప్రాథమిక దత్తాంశం. ప్రాథమిక దత్తాంశం సేకరణకు కింద పేర్కొన్న ఏదైనా ఒక పద్ధతిని ఎంపిక చేసుకోవచ్చు.

 • ప్రత్యక్ష వ్యక్తిగత అంతర్వ్యుహం
 • బట్వడా చేయబడిన ప్రశ్నవళి
 • పరోక్ష వ్యక్థిగత అంతర్వ్యుహం
 • సేకరణ కర్తల ద్వారా పంపే ప్రశ్నవళి

ప్రత్యక్ష వ్యక్తిగత భేటి: ఈ పద్ధతిలో గణాంక సేకరణ కర్త తనంతటతాను స్వయంగా సమాచార కర్తలను కలిసి వారిని ప్రశ్నించి సమాచారాన్ని గ్రహించలి. దత్తాంశ నిష్పాక్షికత, సేకరణ కర్త సమాచార కర్తల ఆచార వ్యవహరాలు, అలవాట్లు తెలుసుకొని వారిని నొప్పించకుండగా జాగ్రత్తగా సేకరించే దానిపై ఆధారపడి ఉంటుంది. విచారణ పద్ధతి చాలా క్లిష్టంగా ఉన్న, సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్న ఈ పద్ధతి చాలా అనువైనది.

యోగ్యతలు:

 • నికరమైన, సరియైన, కచ్చితమైన దత్తాంశన్ని సేకరించే వీలుంది.
 • వారికి తెలిసిన భాషలోనే అనుమానాలను నివృత్తి చేసే అవకాసముంది.
 • సమాచారమందించే వారి అనుమానాలను పరీక్షించి నివృత్తి చేసే వీలుంది.

అయోగ్యతలు:

 • ఈ పద్ధతిలో దత్తాంశసేకరణకు నైపుణ్యం కలిగిన సమాచారసేకరణకర్తల అవసరం ఉంటుంది.
 • ఈ పద్ధతిలో కాలం, ధనం, వనరుల వినియోగం ఎక్కువ.

పరోక్ష వ్యక్తిగథ భేటీ: ప్రత్యక్షంగా సమాచారమందించేందుకు సమాచారం అందించవలసిన వారు విముఖత చూసినప్పుడు ఈ పద్ధతి తోడ్పడుతుంది. అంచనా వెయ్యవలసిన క్షేత్రం చాలా పెద్దగా ఉండి, ఎక్కువ బదులిచ్చే వారికి సంబంధించిన సమాచారం సంస్థ అధిపతి ద్వారా పరోక్షంగా రాబట్టవచ్చు. ఈ పద్ధతి రహస్య సమాచార సేకరణకు సైతం ఉపయోగపడుతుంది. సాధారణంగా రక్షకభటులు, సి. బి. ఐ నేరలకు సంబంధించిన సమాచారన్ని అ పద్ధతి ద్వారా రాబడతారు. నేరపరిశోధనలో మూడో పార్టీ లేదంటే సాక్షం కాదంటే సంస్థ అధిపతి ద్వారా సమాచారం రాబడతరు.

యోగ్యతలు:
 • అంచనా వెయవలసిన క్షేత్రం చాలా పెద్దదిగా ఉండి, సమాచారమందించవలసిన వారు విముఖంగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ అత్యుత్తమమని చెప్పవచు.
 • మద్యపానం, ధుమపానం, జూదం మొధలైన వ్యసనాలు కలిగిన వ్యక్తి వటిని బయట పెట్టడనికి ఆసక్తి చూపరు. ఈ పద్ధతి వల్ల మూడోవ ఉపయొగించి విషయం సెకరించవచ్చు.
అయోగ్యత్గలు:
 • సమాచార సేకరణకు కర్తకు, సమాచారకర్తకు మధ్య నేరుగా సంబందం లేకపోవడం వల్ల కొన్ని అంశాలు విస్మరించే అవకాశం ఉంది.
 • మూడో పార్టీ ఇచ్చినందు వల్ల ఆ సమాచారం నిష్పక్షపాతంగా ఉండకపోవచ్చు.
 • విబిన్న వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించినందువల్ల ఆ సమాచారం ఒకటి కాకపోవచ్చు, పోలికలు ఉండకపోవచ్చు.

స్థానిక ప్రతినిధుల ద్వర సమాచారం: ఈ విధానంలో పరిశోదించవలసిన ప్రాంతంలో స్థానిక ప్రతినిధులను నియమిస్తారు. ఈ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంబందిత సమాచారాన్ని పంపిస్తుంటారు. ప్రతినిత్యం మనం చదివే వార్తా పత్రికలు, ప్రసార సాధనాలు ఈ విధానన్నే అనుసరిస్తుంటారు.

యోగ్యతలు:

 • పరిశోధించవలసిన ప్రాంతం ఎక్కువగా ఉండి, క్రమం తప్పని అంతరల్లో సమాచారం అవసరమైనప్పుడు ఈ పద్ధతి చాలా ఉపయుక్తమైంది.
 • సమయం, ధనం, శ్రమ ద్రుష్త్య ఇది పొదుపైంది.

అయోగ్యతలు:

 • సంబంధిత ప్రతినిధి పక్షపాతధోరణి సమాచారంపై ప్రభావాన్ని చూపుతుంది.
 • ఈ పద్ధతిలో సమాచారం వస్తవికతను కోల్పోతుంది.

బట్వాడా చేసే ప్రశ్నవళి పద్ధతి: ఈ పద్ధతిలో ప్రశ్నావళిని సంబంధిత వ్యక్తులకు పోస్టు ద్వారా పంపించబడుతుంది. వారు ప్రశ్నలకు సమాధానాలు నింపి తిరిగి వాటిని పంపించవలిసి ఉంటుంది. సంబధిత వ్యక్తులు విద్యవంతులై ఉండి పరిశోధించాల్సిన ప్రాంతం విశాలంగా ఉన్నప్పుడు ఈ పద్ధతి చాలా ఉపయోగకరం. యోగ్యతలు:

 • ఈ పద్ధతి ఖరీదైనదే కాక అధికసమయం తీసుకుంటుంది.
 • సేకరించిన సమాచారంలో సేకరణ కర్తల పక్షపాత ధోరణికి తావుండదు.

అయోగ్యతలు:

 • ఇది విద్యావంతులకు మాత్రమే సంబంధించింది.
 • కొందరు సమాధానాలను నింపలేక అసంపూర్తిగా పంపిచవచ్చు.
 • ప్రశ్నావళిని తపాలా ద్వారా అందుకున్న వారందరూ తిప్పి పంపిస్తారని ఆశించలేం.

ద్వితీయ దత్తాంశం: ఇంతకు ముందే వేరేవాళ్ళు సేకరించిన సమాచారాన్ని ద్వితీయ దత్తంశమంటారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక విశ్వవిద్యాలయం పరీక్షా ఫలితాలు ఆ విశ్వవిద్యాలయనికి ప్రాథమిక దత్తంశమవుతుంది. దీనిని వేరే వాళ్ళు ఉపయొగించినట్లయితే అది ద్వితీయ దత్తంశమవుతుంది.

ద్వితీయ దత్తాంశానికి మూలాలు: ద్వితీయ దత్తాంశానికి గల మూలాలు రెండు రకాలుగా చెప్పవచ్చు. ప్రచురిత మూలాలు, అప్రచురిత మూలాలు.

ప్రచురిత మూలాలు:
 • ప్రభుత్వ ప్రచురణలు

వివిధ కమిటీలు, కమిషన్ల రిపోర్టులు. గజెటీర్లు, ముఖ్యమైన గణాంకాలు వంటి అధికారిక ప్రచురణలు. కేంద్ర, రష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించే అధికారిక రిపోర్టులు.

 • అంతర్జాతీయ ప్రచురణలు

అంతర్జాతీయ సంస్థలు అయిన ఇక్యరాజ్య సమితి, ప్రపంచబ్యాంకు, అంతర్జతీయ ద్రవ్యనిధి మొదలైన సంస్థలు జర్నల్స్ నుంచి, వాటి అనుబంధ పత్రికలు నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశ్యాలపై సేకరించిన సమాచారన్ని ప్రచురించే రిపోర్టులు.

 • పాక్షిక అధికారిక సంస్థల ప్రచురణలు

పాక్షిక ప్రభుత్వ సంస్థల ప్రచురణలు. ఉదాహరణకు స్థానిక పరిపాలనా వ్యవస్థలు అయిన ముంసిపాలిటీలు, కార్పోరషన్, జిల్లా బోర్డులు వంటి సంస్థలు ప్రచురించే ఆరోగ్యం, జననాలు, మరణాలు వంటి ముఖ్యమైన అంశాలు.

 • ప్రైవేటు ప్రచురణలు

కింది ప్రయివేటు సంస్థల ప్రచురణల నుంచి కూడా ద్వితీయ దత్తాంశానికి సంబంధించి సమాచారాన్ని సేకరించవచ్చు. విశ్వవిధ్యాలయాలు అందులోని పరిశోధన విద్యార్థులు సేకరించి ప్రచురించిన రిపోర్టులు. ఐ. సి.ఎ.ఆర్., ఎన్.సి.ఇ.ఆర్.టి., ఐ.సి.ఎం.ఆర్., సి.ఎస్.ఐ.ఆర్., ఐ.ఎస్.ఐ., వంటి సంస్థలు తయారు చేసిన నివేదికలు. బ్యాంకులు, కంపెనీలు తయారుచేసిన సంవత్సరాంత నివేదికలు. వార్తా పత్రికలలో, పుస్తకాలలో, మ్యాగ్జైన్లలో ప్రచురించిన అంశాలు.

అప్రచురిత మూలాలు: సమాచారమంతా ప్రచురితమై ఉండవలసిన అవసరం లేదు. సమాచారాన్ని అప్రచురిత అంశాల నుండి కూడా సేకరించవచ్చు. ఉదాహరణకు డైరీలు, లేఖలు, ప్రచురించని జీవిత చరిత్రలు మొదలైనవి.

ద్వితీయ దత్తాంశాన్ని ఉపయోగించేటప్పుడు తీసుకఒవలసిన జాగ్రత్తలు: ద్వితీయ దత్తాంశాన్ని పూర్తిగా పరిశీలించి, ఎంపికచేసుకొని వాడాలి. ద్వితీయ దత్తాంశాం ప్రస్తుత అధ్యయనికి సంబంధించినదిగా ఉంటుందా, సరైనదా, కచ్చితమైందా, వాస్తవమైందా అనే విషయాలను పరీశీలించాలి. యోగ్యత గల వ్యక్తి లేదా సంస్థ సేకరించిన దత్తాంశం అయి ఉండాలి. ఇది ప్రస్తుత కాలనికి సంబంధించినదై ఉండాలి. అటువంటికచ్చితమైన దత్తాంశం విశ్లేషణకు పూర్తిగా ఉపయోగపడుతుంది.

ప్రశ్నావళి, షెడ్యులు తయారీవిధానం:

* ప్రశ్నావళి:

ప్రాథమిక దత్తాంశ సేకరణలో ప్రశ్నావళి ద్వారా దత్తాంశ సేకరణను అత్యంత ప్రజారంజక పద్ధతిగా చెప్పవచ్చు. ప్రశ్నావళి అనేది పరిశీలనకు సంబంధించిన కొన్ని ప్రశ్నలతో కూడుకుంది. ఈ పద్ధతిలో విభిన్న వ్యక్తులకు ప్రశ్నావళిని పోస్టుద్వారా పంపూతూ, ప్రశ్నావళికి తగిన సమాధానలు నింపి వాటిని తిప్పి పంపవలసిందిగా అభ్యర్ధన ఉంటుంది. సంబందిత వ్యక్తులకు పంపి వారి స్పందనను అందులో నింపవలిసి ఉంటుంది. సంబందిత వ్యక్తులు స్వయంగా తమ స్పందనను రాయవలిసి ఉంటుంది. ఆర్థిక, వ్యాపార పరిశోధనల్లో ఈ పద్ధతి అత్యధికంగా ఉపయోపడింది. ప్రయోజనాలు: ఈ పద్ధతి వల్ల ప్రయోజనాలు

 • ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు బాధ్యులైన వారి స్వంతపదాల్లో ఉంటున్నందుకు ఇంటర్వు చేసేవారికి పక్షపాత ధోరణికి లోను కావు.
 • మారుమూల ప్రాంతల్లోని వారినైనా, తేలిగ్గా సంప్రదించే అవకాశం లేనివారినైనా సౌకర్యంగా చేరుకునే వీలుంది.
 • పెద్ద ప్రెతిరూపాలు పరిగణలోనికి తేసుకుణ్టున్నందువల్ల ఫలితాలు ఆధరపడే విధంగా, విశ్వసనీయంగాను ఉంటాయి.
 • సమయం నిర్బందం లేనందువల్ల ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలివ్వడంలో బాధ్యులు తమకు చాలినంత సమయం తీసుకొని లోతుగా ఆలోచించి సమాధానామిచ్చే అవకాశముంది.
 • విశ్వం పెద్దగా ఉండి భౌగోళికంగా విస్త్ర్త్స్మైన బౌగొళీక వైశాల్యం కలిగి ఉన్నప్పుడు ఈ పద్ధతి చాలా పొదుపుతో కూడింది.

మంచి ప్రశ్నవళి లక్షణాలు: ప్రశ్నవళి శక్తివంతంగా ఉంచాలంటీ వాటినెంతో జగ్రత్తగా రూపొందించాలి. మంచి ప్రశ్నవళిలో కనిపించే కొన్ని లక్షణాలు: 1. ప్రశ్న సులభంగాను క్లుప్తంగాను ఉండాలి. 2. ప్రశ్నలు వరసక్రమంలో సులభతరం నుంచి క్లిష్టతరమైన ప్రశ్నలు ఉండాలి. వీలైనంతవరకు వ్యక్తిగత ప్రశ్నలుండరాదు. ఒకవేళ తప్పదనుకుంటే చివరిలో ఉండాలి. 3. ప్రశ్నలు వీలైనంతవరకు అవునూ/కాదూ అని సమాధానమిచ్చే రీతిలో ఉండలి. విశ్లేషణతో కూడిన సమాధానాలుండే ప్రశ్నలను సాధ్యమైనంతవరకూ లేకుండా చూసుకొవవటం శ్రేయస్కరం. 4. బాధ్యులైన వారి విశ్వసనీయతకు నియంరత్రనతో కూడిన కొన్ని ప్రశ్నలుండాలి. సేకరించే సమాచారం నిజమో కాదో నిర్ధారించుకొనేందుకు క్రాస్చెక్ తప్పనిసరి.

షెడ్యూల్: ఈ పద్ధతిలో దత్తాంశసేకరణ ప్రశ్నవళి మాదిరిగానే ఉంటుంది. షెడ్యూల్ కూడా ప్రశ్నల సమితి కలిగిన నమూనా పత్రం. రెండింటి మధ్య తేడా ఎమిటంటే ప్రశ్నావళీకి బాధ్యులు సమాధానాలు నింపితే, షెడ్యూల్ని ఈ పనికోసం నియమితులైన గణకులు నింపుతారు. ముందుగా రూపొందించుకొన్నషెడ్యూల్ తో ఇచ్చిన స్థలంలో గణకులు క్రమబద్ధం చేశారు. కొన్ని సంధర్బలల్లో గణకుడు బధ్యులిచ్చే సమాధానాలకు అవసరమైన సహకారం అందిస్తూ, షెడ్యుల్ని వారికే అప్పజెప్పడం జరుగుతుంది. గణకులు పరిశోధన లక్ష్యాలను వివరిస్తూ, అందులోని అవరోధాలను తొలగించే ప్రయత్నం చేస్తూ బాధ్యులు కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఇవ్వడంలో సహకరిస్తూ వాటిని నమోదు చేస్తారు. అందువల్ల ప్రశ్నావళి, షెడ్యుల్ కు మధ్య ప్రధానమైన తారతమ్యం - మొదటిది బాధ్యులకు పంపడం జరిగితే, రేండోది గణకుడు బాధ్యుల చేతికిచ్చి వారి స్వదస్ఫూర్తితో నింపేలచూస్తారు. ఈ పద్ధతిని సాధారణంగా ప్రభుత్వ ఎజెంసీలు లేదాకొన్ని పెద్ద సంస్థలు నిర్వహించే పరిశోధనల్లో ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు, జనాభా లెక్కల నిర్వాహణను ప్రపంచవ్యాప్తంగా ఈపద్ధతిద్వారానే చేస్తుంటారు.

యొగ్యతలు: ఈ పద్ధతి వల్ల కలిగే ప్రధాన లాభాలు

 • సమాచారమిచ్చే వారి వివరాలు సరియైనవిగా ఉంటాయి.
 • ఈ పద్ధతి విస్త్రుత స్థాయి సమాచార సేకరణకు అనువైంది, విశ్వసనీయమైన ఫలితాలు లభిస్తాయి.
 • గణకులు స్వయంగా సమాధానాలు రాబడతారు కాబట్టి సమాధాన రాహిత్యన్ని తప్పించవచ్చు.
 • సమాచారమిచ్చే వారు వ్యవహర్తలు నిరక్షరాస్యులైన సంధర్బల్లో ఈ పద్ధతి స్వీకరించవచ్చు.