Топ-100
Back

ⓘ అమెరికన్ చలనచిత్రాలు ..
                                               

గుడ్ ఫెల్లాస్ (1990 సినిమా)

గుడ్ ఫెల్లాస్ 1995, సెప్టెంబర్ 9న మార్టిన్ స్కోరెస్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం. నికోలస్ పిలెగ్గీ రాసిన ‘వైజ్ గై’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీ, లోరేన్ బ్రాకో, పాల్ సొర్వినో తదితరులు నటించారు. ప్రపంచ ప్రసిధ్ధ 100 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రంకు ఆరు ఆస్కార్ అవార్డు నామినేషన్లు దక్కడంతోపాటు, అయిదు బ్రిటిష్ అకాడమీ పురస్కారాలను గెలుచుకుంది.

                                               

డెడ్ పోయెట్స్ సోసైటి

డెడ్ పోయెట్స్ సోసైటి 1989లో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. టామ్ షుల్మాన్ రచించిన ఈ చిత్రానికి పీటర్ వీర్ దర్శకత్వం వహించగా రాబిన్ విలియమ్స్ నటించాడు. విద్యార్ధులకు స్వేచ్చను ఇచ్చి, వారికి నచ్చిన అంశాల్ని గుర్తించే దిశగా, వారికి నచ్చిన దారిని చూపేవాడే గురువు కధాంశంతో సినిమా నడుస్తూ, విద్యా వ్యవస్థ నడిచే విధానాన్ని చూపిస్తుంది.

                                               

ద బాయ్ ఇన్ ద స్ట్రిప్డ్ పైజమాస్

ద బాయ్ ఇన్ ది స్ట్రిప్డ్ పైజమాస్ 2008 లో విడుదలైన ఒక విషాదాంతమైన చిత్రం. ఈ సినిమా జాన్ బాయిన్ రచించిన ఇదే పేరు గల నవల మీద ఆధారపడి నిర్మించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన మారణహోమాన్ని ఇద్దరు ఎనిమిదేళ్ళ అబ్బాయిల థృక్కోణం నుంచి కథ నడుస్తున్నట్లు ఉంటుంది.

                                               

బిఫోర్‌ సన్‌రైజ్‌ (1995 సినిమా)

బిఫోర్‌ సన్‌రైజ్‌ 1995, జనవరి 27న రిచర్డ్‌ లింక్లేటర్‌ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. అమెరికా యువకుడు, ఫ్రెంచ్‌ యువతి రైలులో కలుసుకుని, వియన్నాలో ఒక రాత్రి గడిపే కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఎథాన్‌ హాకీ, జూలీ డిల్పే జంటగా నటించారు. కేవలం 11రోజుల్లో ఈ సినిమా స్క్రిప్టును రాశాడు. బిఫోర్‌ సన్‌రైజ్‌ సినిమాకు సీక్వెల్ గా బిఫోర్‌ సన్‌సెట్‌, బిఫోర్‌ మిడ్‌నైట్ సినిమాలు తీశాడు.

                                               

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ (సినిమా)

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ 1945లో డేవిడ్ లీన్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. నోయెల్ కవర్డ్ 1936లో రాసిన స్టిల్ లైఫ్ నాటకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సెలియా జాన్సన్, ట్రెవర్ హోవార్డ్, స్టాన్లీ హోల్లోవే, జాయిస్ కారే, సిరిల్ రేమండ్, ఎవర్లీ గ్రెగ్, మార్గరెట్ బార్టన్ తదితరులు నటించారు.

                                               

వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్

వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ఆంగ్లం: One flew over the cokoos nest. 1975 అనే అమెరికన్ డ్రామా చిత్రాన్ని మైలొస్ ఫొర్మన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కెన్ కెస్సీ రచించిన అదే పేరు గల నవల ఆధారంగా నిర్మ్ంచారు. ఈ చిత్రం లొ కథానాయకుడిగా ప్రఖ్యాత అమెరికన్ నటుడు జాక్ నికల్సన్ నటించారు. ఇతర తారాగణం లూయిస్ ఫిషర్, విలియం రెడ్ ఫీల్డ్, బ్రాడ్ డొరిఫ్, డాన్ని డి వీటొ, క్రిస్టొఫర్ లాయిడ్ ఇతరులు నటించారు. ఈ చిత్రంఆస్కార్ అయిదు ముఖ్య విభాగాలు అయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథారచన విభాగాలలొ గెలుపొందిన రెండొ చిత్రం. మెదటిది ఇట్ హాపెండ్ వన్ నైట్. మూడొ చిత్రం సైలెన్ స్ ఆఫ్ ద ల ...

                                               

సెల్మా (సినిమా)

సెల్మా 2014లో విడుదలైన అమెరికన్ చారిత్రాత్మక చలనచిత్రం. అవా డువెర్నే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చలనచిత్ర నటులు డేవిడ్ ఓయ్లోవా, టామ్ విల్కిన్సన్, టిమ్ రోత్, కార్మెన్ ఇజోగో, కామన్ తదితరులు నటించారు. 1965లో సెల్మా నుండి మోంట్గోమేరీ వరకు జరిగిన ఓటింగ్ హక్కుల నిరసన ర్యాలీ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం 2015లో ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.

                                               

ది డా విన్సీ కోడ్ (చలనచిత్రం)

ద డావిన్సీ కోడ్ జాన్ కల్లే, బ్రియాన్ గ్రాజర్ సంయుక్త నిర్మాణంలో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన 2006 నాటి అమెరికన్ మిస్టరీ-థ్రిల్లర్ సినిమా. డాన్ బ్రౌన్ రాసిన 2003 నాటి అత్యంత ప్రాచుర్యం పొందిన నవల ది డావిన్సీ కోడ్ ఆధారంగా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అకివా గోల్డ్స్ మాన్ అందించారు. చిత్రంలో టామ్ హాంక్స్, ఆడ్రే టాటో, ఇయాన్ మెక్ కెల్లన్, ఆల్ ఫ్రెడ్ మోలీనా, జూర్గెన్ ప్రోచ్నౌ, జీన్ రెనో, పాల్ బెటానే నటించారు.

స్లాకర్ (సినిమా)
                                               

స్లాకర్ (సినిమా)

స్లాకర్ 1990లో విడుదలైన అమెరికన్ ఇండిపెండెంట్ సినిమా. రిచర్డ్ లింక్లేటర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1991లో జరిగిన సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ - డ్రమాటిక్ విభాగంలో నామినేట్ అయ్యింది.