Топ-100
Back

ⓘ హిందీ-భాషా చలనచిత్రాలు ..
                                               

జుడ్వా 2

జుడ్వా 2 2017లో భారతీయ హిందీ - భాషా సాహస -కామెడీ చిత్రం. డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1997లోని చిత్రం జుడ్వా యొక్క రీబూట్, ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కవలలు రాజా, ప్రేమ్ నటించారు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్నూ వారిద్దరి సరసన నటించారు. నాడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ ఈ నిర్మించింది, జుడ్వా 2 29 సెప్టెంబర్ 2017 న విడుదలైంది.

                                               

నయీ కహానీ (1943 సినిమా)

నయీ కహానీ 1943లో విడుదలైన హిందీ చలనచిత్రం. డి.డి. కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, పైడి జైరాజ్, రోజ్, నంద్రేకర్, బెనర్జీ, శాలిని నటించిన ఈ చిత్రానికి శ్యామ్ సుందర్ సంగీతం అందించాడు.

                                               

ప్రతిబంధ్

ప్రతిబంధ్ 1990 లో హిందీ- భాషా యాక్షన్ చిత్రం. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా చిరంజీవి, జూహి చావ్లా, రామి రెడ్డి నటించారు. ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా నటుడు చిరంజీవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో నటనకు గాను జూహి చావ్లాకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు ప్రతిపాదన లభించింది. ఈ చిత్రం కోడి రామ కృష్ణ దర్శకత్వం వహించిన రాజశేఖర్ నటించిన తెలుగు చిత్రం అంకుశం కు పునర్నిర్మాణం. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అయింది.

                                               

ప్రతిమ (1945 సినిమా)

ప్రతిమ 1945, డిసెంబరు 14న విడుదలైన హిందీ చలనచిత్రం. బాంబే టాకీస్ పతాకంపై నటుడు పైడి జైరాజ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్ కుమార్, స్వర్ణలత, ముంతాజ్ ఆలీ, షా నవాజ్ నటించగా అరుణ్ కుమార్ ముఖర్జీ సంగీతం అందించాడు.

                                               

బాఘీ (2016 చిత్రం)

బాఘీ అనేది 2016 భారతీయ హిందీ- భాషా మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన చిత్రం. ఈ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు, సాజిద్ నాడియాద్వాలా తన నిర్మాణ సంస్థ నాడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్లో నిర్మించారు. ఇందులో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు, సుధీర్ బాబు, సునీల్ గ్రోవర్ సహాయక పాత్రల్లో ఉన్నారు. ఈ చిత్రం 2011 ఇండోనేషియా చిత్రం ది రైడ్: రిడంప్షన్, 2004 తెలుగు చిత్రం వర్షం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం 29 ఏప్రిల్ 2016 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.ఈ చిత్రం ₹ 37 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబదగా, ప్రపంచవ్యాప్తంగా ₹ 127 కోట్ల సంపాదించింది. ఈ చిత్రం భారతదేశంలో నే కాక ...

                                               

బాబీ (1938 సినిమా)

బాబీ 1938, డిసెంబరు 17న ఫ్రాంజ్ ఓస్టెన్ దర్శకత్వంలో హిందీ కుటుంబ కథా చలనచిత్రం. శారదిండు బండియోపాధ్యాయ్ రాసిన "బిషర్ ధోన్" అనే బెంగాలీ చిన్న కథ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, రేణుకాదేవి, మాయదేవి, వి.హెచ్. దేశాయ్ తదితరులు నటించారు. యుక్తవయసులోనే వితంతువులైన వారిపట్ల భారతీయ సమాజం ఎలాంటి వైఖరిలో ఉంటుంది,"పురుష-స్త్రీ సంబంధాలకు" సమాజంలో ఉన్న విధానం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.

                                               

మంగల్‌ పాండే, ద రైజింగ్

మంగల్ పాండే: ది రైజింగ్ 2005 భారత చారిత్రక, జీవితచరిత్ర, నాటక భరితమైన చిత్రం, 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు నాంది పలికినందుకు ప్రసిద్ది చెందిన ఒక భారతీయ సైనికుడు మంగల్ పాండే జీవితం ఆధారంగా. భారత స్వాతంత్ర పోరాట తొలి యుద్ధం అని కూడా పిలుస్తారు ఈ చిత్రానికి కేతన్ మెహతా దర్శకత్వం వహించారు. ఫరూఖ్ ధోండి స్క్రీన్ ప్లే. దిల్ చాహ్తా హై 2001 తో విరామం పొందిన తరువాత అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇది 2005 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని మార్చి డు ఫిల్మ్ విభాగంలో ప్రదర్శించబడింది. ఇది 2005 లో అత్యధిక వసూళ్లు చేసిన నాలుగవ చిత్రం

                                               

సింగార్ (1949 సినిమా)

సింగార్ 1949, డిసెంబరు 12న విడుదలైన హిందీ చలనచిత్రం. జె.కె. నంద దర్శకత్వంలో పైడి జైరాజ్, సురైయ, మధుబాల, మధన్ పూరి నటించిన ఈ చిత్రానికి ఖుర్షీద్ అన్వర్ సంగీతం అందించాడు.

                                               

హతిమ్ తాయ్ (1956 సినిమా)

హతిమ్ తాయ్ 1956లో విడుదలైన హిందీ చలనచిత్రం. హోమి వాడియా దర్శకత్వంలో పైడి జైరాజ్, షకిల, మీనాక్షి, షేక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎన్. త్రిపాఠి సంగీతం అందించాడు.

                                               

అమర్ కహానీ (1949 సినిమా)

నిర్మాత: ఎస్. రంజిత్ నిర్మాణ సంస్థ: కమల్ కుంజ్ చిత్ర సంగీతం: హాసన్‌లాల్ భాగత్రం పాటలు: రాజేంద్ర కృష్ణన్ గానం: సురైయ, గీతా దత్ ఛాయాగ్రహణం: శివరాం మలయ దర్శకత్వం: బైజ్ శర్మ