Топ-100
Back

ⓘ గోతమ మహర్షి ఋగ్వేదం కాలంలో 21 సూక్తాలను, అక్కడక్కడ కొన్ని మంత్రాలను కూడా దర్శించిన మహా మహర్షి. గోతమ అనే పదము రెండు సంస్కృత పదాలు, gŐ” ప్రకాశవంతమైన కాంతి, tama చ ..




                                     

ⓘ గోతమ మహర్షి

గోతమ మహర్షి ఋగ్వేదం కాలంలో 21 సూక్తాలను, అక్కడక్కడ కొన్ని మంత్రాలను కూడా దర్శించిన మహా మహర్షి. గోతమ అనే పదము రెండు సంస్కృత పదాలు," gŐ” "ప్రకాశవంతమైన కాంతి", "tama "చీకటి" అనే అర్థం నుండి ఉద్భవించింది. ఈ రెండు పదాల కలయిక, తన తెలివితేటలతో ద్వారా చీకటి తత్వాన్ని తొలగించు ఒక వ్యక్తి అని సూచిస్తున్నది,

  • ఎవరు తన తెలివితేటల ద్వారా, చీకటి తత్వాన్ని, వారి యొక్క జ్ఞానం ఉపయోగించి అజ్ఞానం యొక్క చీకటి నుండి కాంతిని వెదజల్లువారు అని మరో అర్థం. ఇవి సూచించవచ్చు
                                     

1. వంశాలు - శాఖలు

  • గౌతమ రాజపుత్రులు, ఉత్తర భారతదేశం లోని క్షత్రియ కుల రాజపుత్రులు యొక్ఒక ఉప-వంశం.
  • గౌతమ బ్రాహ్మణులు, భారతదేశం లోని హిందూమతం బ్రాహ్మణ తెగ లోని ఒక ఉప-వర్గం.
                                     

2. ప్రాముఖ్యము

  • గోతమ మహర్షి అథర్వణ వేదం లోని 7 సూక్తాలను ఒక సూక్తానికి అనేక శ్లోకాలు ఉంటాయి దర్శించిన ఋషి.
  • ఒకనాడు ఇతనికి దాహాం వేసి మంచినీళ్ళు ఇవ్వమని మరుత్తులను అడగగా, వాళ్ళు అతని కోసం ఒక పెద్ద బావిని తవ్వించారు. ఆ బావిని తవ్విన వారు అశ్వనీదేవతలు.
  • గోతమ మహర్షి గురించి ఋగ్వేదంలో అనేక చోట్ల ప్రస్తావించ బడింది. ఉదా:-
సనాయతే గోతమ ఇన్ద్ర నవ్యమ్ అతక్షద్ బ్రహ్మ హరియోజనాయ | సునీథాయ నః శవసాన నోధాః ప్రాతర్ మక్షూ ధియావసుర్ జగమ్యాత్ || 1-062-13.