Топ-100
Back

ⓘ అనువాదం ..




                                               

విపుల

విపుల తెలుగు మాసపత్రిక. దీని నినాదం విశ్వ కథా వేదిక. దీనిని 1978లో ఈనాడు రామోజీరావు ప్రారంభించాడు. ఈ పత్రిక కథలు మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషల, భారతీయ భాషల కథలకు తెలుగు అనువాదాలుతో పాటు నేరు తెలుగు కథలు ఉంటాయి. జూన్ 2020 నుండి రామోజీ ఫౌండేషన్ నిర్వహించే పత్రికలలో చేర్చబడి అంతర్జాలంలో ఉచితంగా అందజేయబడుతున్నది. 2021 మార్చి సంచికతో పత్రిక మూతపడింది.

                                               

షాహ్ నామా

షానామా లేక షాహ్ నామా లేక షాహ్‌నామెహ్ పర్షియన్ కవి ఫిరదౌసి క్రీ.శ. 977 నుండి 1010 వరకు రాసిన సుదీర్ఘ ఇతిహాసం. ఇది గ్రేటర్ ఇరాన్ అని పిలిచే విస్తారమైన సాంస్కృతిక ప్రదేశానికి జాతీయ ఇతిహాసం. డిస్టిచ్‌లు అని పిలిచే ద్విపదల్లో ఈ ఇతిహాసం కూర్చబడింది. దాదాపు 50 వేల డిస్టిచ్‌లు కలిగివున్న ఈ షాహ్‌నామా సుమారు 50.000 డిస్టిచ్లు లేదా ద్విపదలు కలిగి ప్రపంచంలో. అత్యంత సుదీర్ఘమైన ఇతిహాస కావ్యాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ప్రధానంగా మిథికల్ లేక పౌరాణిక సాహిత్యం, ఐతే దీనిలో కొంతవరకూ ప్రపంచం ఏర్పడినప్పటి నుంచి ఇస్లామీయ దండయాత్ర, విజయం వరకూ పర్షియన్ సామ్రాజ్యపు చరిత్ర పొందుపరిచాడు కవి. పర్షియన్ సంస్కృతి ప్రభావం ...