Топ-100
Back

ⓘ కోట వేంకటాచలం సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, చరిత్ర పరిశోధకులు, విమర్శకులు. వీరు నూజివీడు తాలూకాలోని మధునాపురంలో చల్లా సుబ్బారాయుడు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మిం ..




                                     

ⓘ కోట వేంకటాచలం

కోట వేంకటాచలం సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, చరిత్ర పరిశోధకులు, విమర్శకులు.

వీరు నూజివీడు తాలూకాలోని మధునాపురంలో చల్లా సుబ్బారాయుడు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. చల్లావారి ఇంటిలో పుట్టినా కోటవారికి దత్తత వెళ్ళారు. వీరిని దత్తత తీసుకొన్న దంపతులు: కోట నిత్యానందం, లక్ష్మీదేవమ్మ.

వీరు సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు; ఖగోళశాస్త్రంలో విశేషకృషి చేసారు. వాని ఆధారంగా భారతీయ చరిత్రను పునర్నిర్మించారు. సృష్టి ఆరంభం మొదలగు విషయాలలో పాశ్చాత్య విద్వాంసుల కాలగణనం, వారు వారు కూర్చిన భారతదేశ చరిత్ర సరైనవి కావని విమర్శించారు. మన పురాణాలలోనే భారతదేశ వాస్తవచరిత్ర దాగివుందని వీరి సిద్ధాంతం. ఆర్య విజ్ఞానం అనే పేరుతో ఒక బృహద్గ్రంథాన్ని వీరు 8 భాగాలుగా రాసి ప్రకటించాలని సంకల్పించారు. దానిలో మొదటి రెండు భాగాలుగా బ్రహ్మాండ సృష్టి విజ్ఞానము, మానవ సృష్టి విజ్ఞానము అనే గ్రంథాలను వీరు ప్రచురించారు. అవి పలువురి ప్రశంసలు పొందాయి.

                                     

1. ఇతర రచనలు

  • ధ్రువనివాస ఖండనము
  • అభాస క్రైస్తవం
  • ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు 1955
  • కలిశక విజ్ఞానం
  • కలియుగ రాజవంశములు 1950
  • అద్వైత బోధిని
  • అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు