Топ-100
Back

ⓘ ఆర్యభట్ట II భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త, మహా సిద్ధాంతం రచయిత. ఇతని కంటే పూర్వుడు, మరింత ప్రసిద్ధుడూ ఐన ఆర్యభట్ట I నుండి వేరు చేయడానికి ఇతనిని ర ..
                                               

భాస్కర – I ఉపగ్రహం

భాస్కర-1 ఉపగ్రహం భారతదేశం నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త గుర్తింపుగా పెట్టారు.

                                               

కార్టోశాట్-1 ఉపగ్రహం

కార్టోశాట్-1 అను ఉపగ్రహం ఇండియా యొక్క త్రిమితియ చిత్రాలను తీయు సామర్ధ్యంకలిగిన మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.ఈ ఉపగ్రహం పట /మానచిత్రాలను చిత్రాలను తియ్యగలదు. ఉపగ్రహంలో అమర్చిన కెమరాల విభాజకత 2.5 మీటర్లు.ఈ ఉపగ్రహాన్ని ఇండియన్ స్పేస్ రిసెర్చి అర్గనైజెసన్ వారు రూపకల్పన చేసి, ప్రయోగించారు. కార్టోశాట్ -1 అను ఉపగ్రహం డిజిటల్ ఎలేవేసన్ మాదిరిలను/నమూనాలను సృజించ గలిగిన కెపాసిటి కలిగిఉన్నది.స్పష్ట నిజరూప చిత్రాలను రూపొందించగలదు.భౌగోళిక, భూగోళ సంబంధిత సమాచారాన్ని సేకరించుటకు అవసరమైన పరికరాలను ఈ ఉపగ్రహంలో అమర్చారు.

                                               

జీశాట్-6 ఉపగ్రహం

భారతదేశానికి గర్వకారణమైన ఇస్రోవారు 2015 సంవత్సరం, అగస్టు27 వతేది సాయంత్రం 4:52గంటలకు, ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా లోని, శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి, జీఎస్‌ఎల్‌వి-డీ6 అను భూస్థిరకక్ష అంతరిక్ష వాహననౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి జీఎస్‌ఎల్‌వీ-డీ6 వాహక నౌక బయలు దేరిన 17:04నిమిషాల్లో కచ్చితంగా జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సమాచార రంగంలో కొత్త శకానికి తెరలేపింది. ఎస్‌ బ్యాండ్‌ ద్వారా సమాచార రంగంలో ఆధునిక సేవలు అందించే లక్ష్యంతోరూపొందించిన జీశాట్‌-6 ఉప ...

                                               

ఉడుపి రామచంద్రరావు

ఉడుపి రామచంద్రరావు, అంతరిక్ష శాస్త్రవేత్త, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సంస్థకు మాజీ చైర్మన్. ఆయన అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో చైర్మన్ గానూ పని చేసారు. ఆయన 1976 లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషన్ పురస్కారాన్ని భారత ప్రభుత్వంచే అందుకున్నారు. ఆయన వాషింగ్టన్ లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫ్రేంలో 2013 మార్చి 19 న జరిగిన సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనితో ఆయన అందులో ప్రవేశించిన మొదటి భారతీయుడుగా చరిత్రపుటల్లోకెక్కాడు.

                                     

ⓘ ఆర్యభట్ట II

ఆర్యభట్ట II భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త, మహా సిద్ధాంతం రచయిత. ఇతని కంటే పూర్వుడు, మరింత ప్రసిద్ధుడూ ఐన ఆర్యభట్ట I నుండి వేరు చేయడానికి ఇతనిని రెండవ ఆర్యభట్టు అంటారు.

                                     

1. మహా సిద్ధాంతం

ఆర్యభట్ట II రచించిన ప్రసిద్ధ గ్రంథం మహా సిద్ధాంతం. ఇది పద్దెనిమిది అధ్యాయాలు కలిగిన సంస్కృతం శ్లోకాల గ్రంథం. మొదటి పన్నెండు అధ్యాయాలలో గణిత, ఖగోళ సంబంధిత విషయాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ కాలపు భారతీయ గణిత శాస్త్రజ్ఞులు అప్పటివరకు చేసిన విషయాలను వివరిస్తుంది. ఈ పన్నెండు అధ్యాయాలలో చేర్చబడిన వివిధ విషయాలు: గ్రహాల రేఖాంశాలు, సూర్య, చంద్ర గ్రహణాల అంచనాలు, చంద్రవంక పెరుగుదల, గ్రహాల అమరిక, ప్రతి గ్రహాంతర సంబంధాలు, గ్రహాల నక్షత్రాల సంబంధాలు.

తరువాతి ఆరు అధ్యాయాల్లో గ్రహాల రేఖాంశాలను లెక్కించేందుకు అవసరమైన జ్యామితి, భౌగోళిక, బీజగణితం వంటి విషయాలు ఉన్నాయి. గ్రంథంలో ఇరవై శ్లోకాలు అనిర్దిష్ట సమీకరణం పరిష్కరించడానికి విస్తృతమైన నియమాలను ఇస్తాయి. ఈ నియమాలు వివిధ స్థితులలో వర్తించబడ్డాయి. ఉదాహరణకి, భాగహారలబ్ధము సంఖ్య సరి సంఖ్య ఉన్నప్పుడు, భాగహారలబ్ధము సంఖ్య బేసి సంఖ్య ఉన్నప్పుడు, వగైరా.

                                               

ఆర్యభట్ట (అయోమయ నివృత్తి)

వికీపీడియాలో ఆర్యభట్ట, ఆర్యభట, ఆర్యభట్టు వగైరా పేర్లతో ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలున్నాయి. వాటి వివరాలు: ఆర్యభట ఉపగ్రహం: మొదటి ఆర్యభట్టు పేరు మీదుగా భారత దేశం కక్ష్యలో ప్రవేశపెట్టిన తొట్టతొలి కృత్రిమ ఉపగ్రహం. ఆర్యభట్టు: ప్రాచీన గణిత, ఖగోళ శాస్త్రవేత్త. మొదటి అర్యభట్టు. ఆర్యభట్ట II: ఆర్యభట్ట అనే పేరు కలిగిన మరొక ప్రాచీన భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త