Топ-100
Back

ⓘ కంప్యూటర్ నెట్వర్క్ లేదా డేటా నెట్వర్క్ అనేది ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, అది కంప్యూటర్లకు డేటా మార్పిడిని అనుమతిస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్ లలో, నెట్వర్క్ ..




                                               

నెట్‌వర్క్ లేయర్

కంప్యూటర్ నెట్వర్కింగ్ కి సంబంధించిన ఓ.ఎస్.ఐ నమూనాలో ఉన్న ఏడు లేయర్లలో నెట్‌వర్క్ లేయర్ మూడవది. పాకెట్లని రౌటింగ్ చేయడం నెట్వర్క్ లేయర్ యొక్క బాధ్యత. అంతేగాక మధ్యస్త రౌటర్ల ద్వారా కూడా ఇది రౌటింగ్ నిర్వహిస్తుంది. నెట్వర్క్ లేయర్ యొక్క విధులలో కొన్ని: మెస్సేజ్ ఫార్వర్డింగ్ Message forwarding సంబంధ నమూనాConnection model: సంబంధంలేని సంభాషణconnectionless communication హోస్ట్ అడ్రస్సింగ్ Host addressing

                                               

కెర్నలు (కంప్యూటరు)

కెర్నల్ కంప్యూటర్ ఆపరేటింగు సిస్టం యొక్క ముఖ్య అంతర్గత భాగము. ఇది కంప్యూటర్ యొక్క యంత్ర పరికరములను, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం యొక్క సాఫ్ట్వేర్ తో అనుసందానం చేయును. కెర్నలు రెండు రకాలు: మోనోలిథిక్ కెర్నల్, ఇందులో చాలా పరికరాలకు సంబంధించి డ్రైవర్లు కలవు. మైక్రో కెర్నల్, ఇది ప్రాథమిక కార్యాచరణను మాత్రమే కలిగి ఉంటుంది; కంప్యూటర్ వినియోగ కర్త, నేరుగా కెర్నల్ ను ఉపయోగించుట కుదరదు.

కంప్యూటర్ నెట్వర్క్
                                     

ⓘ కంప్యూటర్ నెట్వర్క్

కంప్యూటర్ నెట్వర్క్ లేదా డేటా నెట్వర్క్ అనేది ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, అది కంప్యూటర్లకు డేటా మార్పిడిని అనుమతిస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్ లలో, నెట్వర్క్ కంప్యూటింగ్ పరికరాల డేటా కనెక్షన్లతో ఒకరికొకరు డేటాను తరలించుకుంటారు. నోడ్స్ మధ్య కనెక్షన్లను కేబుల్ మీడియా లేదా వైర్ లెస్ మీడియాను గాని ఉపయోగించి ఏర్పరుస్తారు. అందరికి బాగా తెలిసిన కంప్యూటర్ నెట్వర్క్ ఇంటర్నెట్.

పర్సనల్ కంప్యూటర్లు వినియోగిస్తున్న పెద్ద పెద్ద సంస్థలలో వివిధ డిపార్టుమెంటులలో జరిగే ప్రక్రియలను ఒకరికొకరు తెలుసుకొనుటకు నెట్‌వర్క్ లు ఆభివృద్ధి చేయబడినాయి. వీటివలన వ్యక్తిగత కంప్యూటర్లను ఒకదానికొకటి అనుసంధానము చేయగలము. ఒక కంప్యూటరులో వున్న ఖరీదయిన, విలువయిన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాము భాషలను, ప్యాకేజీలను ఇతర కంప్యూటర్లు కూడా వినియోగించుకొనగలవు. ఒకేఫైలుని 2, 3 కంప్యూటర్లలో ఒకేసారి నిల్వచేయ వీలవుతుంది. ఒక కంప్యూటరు పాడయి పోయినను వేరొక దాని నుండి మనకు కావలసిన ఫైలును పొందగలము. దీనినే క్లయింట్ - సర్వర్ మోడల్ అంటారు. పెద్ద పెద్ద సంస్థలలో దూరముగా వున్న విభాగములలో పని చేయు ఉద్యోగస్థులు అనుసంధించబడిన కంప్యూటర్ల ద్వారా సంభాషించగలరు. 1970లలో ప్రారంభమయిన ఈ ప్రక్రియ మొదట పెద్ద కంపెనీల వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. 1990 దశకములో ఇళ్ళకు, వ్యక్తిగత అవసరములకు కూడా ఇంటర్నెట్ రూపములో లభ్యమగుచున్నది.