Топ-100
Back

ⓘ రాంగఢ్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాల్లో ఒకటి. రాంగఢ్, ఈ జిల్లాకు కేంద్రం. ఉత్తరాన, పశ్చిమాన హజారీబాగ్ జిల్లా, ఉత్తరాన తూర్పున బొకారో జిల్లా, తూర్పున ..




                                               

మండ్లా

మండ్లా మధ్యప్రదేశ్ లోని పట్టణం. ఇది మండ్లా జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం నర్మదా నది వంపు‌లో ఉంది. నది పట్టణానికి మూడు వైపులా ఉంది. మండ్లా రామ్‌నగర్‌ల మధ్య 15 మైళ్ల దూరం పాటు నది లోతుగా ప్రవహిస్తుంది. నర్మదానదిని ఇక్కడ పూజిస్తారు. నది ఒడ్డున అనేక ఘాట్లు నిర్మించబడ్డాయి. ఇది గోండ్వానా రాజ్యానికి రాజధాని. ఆ పాలకులు ఇక్కడ ఒక ప్యాలెస్‌ను, కోటనూ నిర్మించారు. సరైన సంరక్షణ లేక ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. గోండ్వానా రాణి, రాణి దుర్గావతి మండ్లా రాజ్యాన్ని పరిపాలించింది. తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి చేసిన సాహసోపేతమైన ప్రయత్నంలో ఆమె అక్బర్‌కు వ్యతిరేకంగా పోరాడింది. ఇది ఇప్పటికీ జానపద కథలుగా చెప్పుకు ...

రాంగఢ్ జిల్లా
                                     

ⓘ రాంగఢ్ జిల్లా

రాంగఢ్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాల్లో ఒకటి. రాంగఢ్, ఈ జిల్లాకు కేంద్రం. ఉత్తరాన, పశ్చిమాన హజారీబాగ్ జిల్లా, ఉత్తరాన తూర్పున బొకారో జిల్లా, తూర్పున పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా, దక్షిణాన రాంచీ జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి

బ్రిటిషు వారి కాలంలో రాంగఢ్ ఒక మిలిటరీ జిల్లాగా ఉండేది.

                                     

1. చరిత్ర, భౌగోళికం

2007 సెప్టెంబరు 12 న రాంగఢ్ జిల్లా ఏర్పడింది. హజారీబాగ్ జిల్లా నుండి కొంత ప్రాంతాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచారు. ఈ జిల్లా గనులకు, పరిశ్రమలకూ కేంద్రం. మాతా ఛిన్నమస్త దేవాలయం ఇక్కడ ప్రసిద్ధిమైనది. జిల్లా విస్తీర్ణం 1.36.008 చ.కి.మీ. ఈ జిల్లా హజారీబాగ్ లోక్‌సభ నియీజకవర్గంలోకి వస్తుంది. జిల్లాలో రాంగఢ్, మండూ శాసనసభ నియోజకవర్గాలున్నాయి.

ఈ జిల్లా ఛోటానాగపూర్ పీఠభూమిపై ఉంది. జిల్లా లోని అధిక భాగం దామోదర్ లోయలో భాగంగా ఉంటుంది. 1.049 మీ. ఎత్తున్న బర్కా పహాడ్ జిల్లా లోని ఎత్తైన పర్వతం. ఇది రాంగఢ్, రాంచీ జిల్లాల సరిహద్దుపై ఉంది

నదులు

దామోదర్, జిల్లాలోని ప్రధానమైన నది. ఇతర చిన్ననదుల్లో హుర్‌హురి, గోమతి, బర్కి, కోచీ, షేర్‌బుకి, ధోబ్‌ధాబ్ లు ఉన్నాయి.

జిల్లా ఆగ్నేయ భాగంలో సువర్ణరేఖ నది ప్రవహిస్తోంది. జిల్లా లోని పత్రాటు వద్ద నజ్‌కరీ నదిపై ఆనకట్ట నిర్మించారు. దీని నుండి రాంగఢ్ కంటోన్మెంటుకు, పత్రాటు తాప విద్యుత్కేంద్రానికీ నీరు సరఫరా అవుతుంది.

జలపాతాలు

భైరవి, దామోదర్ నదుల సంగమ స్థలంలో రాజరప్ప జలపాతం ఉంది.