Топ-100
Back

ⓘ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా ఒకటి. ఇది 1992 ఏప్రిల్ 1 వ తేదీన ముందు పశ్చిమ దీనాజ్‌పూర్ జిల్లాలో ..




                                               

దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో దక్షిణ దినాజ్‌పూర్ ఒకటి. 1992 ఏప్రిల్ 1 పశ్చిమ మదీనాపూర్ లోని విభాగంగా ఉన్న ఈ ప్రాంతానికి జిల్లాహోదా ఇవ్వబడింది. తరువాత ఈ జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది. 2011 గణాంకాలను అనుసరించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల్ 20 జిల్లాలలో ఈ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.

                                               

కటిహార్ జిల్లా

1973లో పూర్ణియా జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి కటిహార్ జిల్లాను రూపొందించారు. ఆరంభంలో కతియార్ చౌదరీల ఆధిక్యతలో ఉండేది. చౌదరీలు కోసీ ప్రాంతంలో పెద్ద భూస్వాములుగా ఉండేవారు. చౌదరీ కుటుబానికి ఆద్యుడు ఖాన్ బహద్దూర్ చౌదరి మొహమ్మద్ బక్ష్ ఆయన ఆధీనంలో 126 వ్యవసాయ కుటుంబాలు ఉండేవి. ఆయన 1936లో మరణించాడు. ఆయనకుటుంబానికి కటిహార్‌లో 15.000 ఎకరాల భూమి, పూర్ణియాలో 8.500 ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుతం ఆయన వారసులు చౌదరి తాజ్ మొహమ్మద్, చౌదరి మొహమ్మద్ అషరఫ్ ఇప్పటికీ భూస్వాములుగా ఉన్నారు. వారి హవేలీని తాజ్ దేహోరీ అంటారు. దేశవిభజనకు ముందు 1905లో కటిహార్ బెంగాల్ భూభాగంలో భాగంగా ఉండేది. విభజన తరువాత కటిహార్ బీహ ...

                                               

మల్దా జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో మల్దా. ఈ జిల్లా కొలకత్తాకు ఉత్తరంగా 347కి.మీ దూరంలో ఉంది. ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి, జనపనార, పట్టు ఉత్పత్తి అత్యధికంగా జరుగుతుంది. జిల్లా పేరుతో కొత్త తరహా మామిడి పండ్లు పండించబడుతున్నాయి. ఇవి విడేశాలకు ఎగుమతి చేయబడుతూ అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నాయి. జిల్లాకు చెందిన గోంబియా గ్రామీణ సంస్కృతి సాధారణ ప్రజల జీవితంలోని సుఖదుఃఖాలను ప్రతిబింబిస్తూ జాతీయ, అంతర్జాతీయంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుంది. జిల్లా కేంద్రమైన ఇంగ్లీష్ బజార్ దీనిని మల్దా అని కూడా అంటారు. ఇది ఒకప్పుడు బెంగాల్ రాజధానిగా ఉంది. జిల్లా పాత సంప్రదాయాన్ని, విద్యాసంప్రదాయాన ...

                                               

కిషన్‌గంజ్ జిల్లా

ఖగాడ నవాబ్ సమయంలో మొహమ్మద్ ఫక్రుద్దీన్ కాలంలో ఈ ప్రాంతానికి ఒక సన్యాసి వచ్చడు. ఆయన చాలా అలసి ఉన్నాడు కనుక ఈ ప్రాంతాన్నీ తాను విశ్రమించడానికి కావాలని అడిగాడు. ఆయన ఈ ప్రాంతం పేరు అలంగంజ్ అనీ ఇక్కడ ప్రవహిస్తున్న నది పేరు రంజాన్ అనీ జమీదర్ పేరు ఫకురుద్దీన్ అని తెలుసుకున్న తరువాత ఆయన అలంగజ్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించాడు. అది తెలుసుకున్న నవాబు రంజాన్ పూల్ గంధి ఘాట్ వద్ద ఉన్న కొంత ప్రాంతాన్ని కృష్ణ్ - కుంజ్ అని నామకరణం చేసాడు. కాలక్రమంలో అది కిషన్‌గంజ్‌గా మారింది.

                                               

రాయ్‌గంజ్

రాయ్‌గంజ్ అనేది భారత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోని ఒక నగరం, మునిసిపాలిటీ. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినజ్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇక్కడ 125 సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబడింది. రైల్వే సౌకర్యం 115 సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రదేశానికి అందుబాటులో ఉంది. ఈ నగరంలో 106 సంవత్సరాల పురాతన రాయ్‌గంజ్ కొరోనెషన్ ఉన్నత పాఠశాల ఉంది. రాయ్‌గంజ్‌కు 1896 లో రైల్వే కనెక్షన్ వచ్చింది. ఈ రైలు రాయ్‌గంజ్ నుంచి బంగ్లాదేశ్‌లోని పర్బాటిపూర్ జంక్షన్‌కు వెళ్లేది. ఇది 200 సంవత్సరాల పురాతన పట్టణం.

ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా
                                     

ⓘ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా ఒకటి. ఇది 1992 ఏప్రిల్ 1 వ తేదీన ముందు పశ్చిమ దీనాజ్‌పూర్ జిల్లాలో ఉపవిభాగంగా ఉన్న ఉత్తర దీనాజ్‌పూర్‌కు జిల్లా హోదా ఇవ్వబడింది. జిల్లా రాణిగంజ్, ఇస్లాంపూర్ ఉపవిభాగాలుగా విభజించబడింది.

                                     

1. భౌగోళికం

ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా 25°11 నుండి 26°49 ఉత్తర అక్షాంశం, 87°49 తూర్పు రేఖాంశంలో ఉపస్థితమై ఉంది. జిల్లావైశాల్యం 3.142 చ.కి.మీ. ఇది పంచఘర్, తాకూర్గోయాన్, దినాజ్‌పూర్ జిల్లాలకు సమీపంలో ఉంది. తూర్పు సరిహద్దులోబంగ్లాదేశ్, పశ్చిమ సరిహద్దులో కిషన్‌గంజ్, పూణియా, కతిహార్, ఉత్తర సరిహద్దులో డార్జిలింగ్, జల్పైగురి, దక్షిణసరిహద్దులో మల్దా, దక్షిణ దినాజ్‌పూర్లు ఉన్నాయి. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారి, రైల్వే మార్గాలతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. జాతీయరహదారి 31-34 జిల్లా మద్యభాగం నుండి పోతుంది.

                                     

1.1. భౌగోళికం భూమి వివరణ

జిల్లా భుభాగం చాలవరకు చదరంగా ఉంటుంది. కులిక్, నాగర్, మహానందా నదులు ప్రవహిస్తున్న దక్షిణ భూభాగం కొంచెం ఏటవాలుగా ఉంటుంది. తూర్పున ఉన్న రాజ్మహల్ కొండల వద్ద భూభాగం కొంత బేసిన్ రూపం సంతతించుకుంది. పాత ఒండ్రుమట్టి హిమయుగానికి చెందినదని భావిస్తున్నారు. జిల్లా భూభాగంలో సారవంతమైన భూమి అధికంగా ఉంది. సారవంతమైన భూమి వరి, జనపనార, ఆవాలు, చెరుకు పంటలకు అనుకూలంగా ఉంది. కులిక్ నదీతీరంలో ఉన్న జిల్లా కేంద్రం రాణిగంజ్‌లో రాణిగంజ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ ఉంది. ఇక్కడ ఉన్న బర్డ్ అభయారణ్యం వైశాల్యంలో ఆసియాలో 2 వ స్థానంలో ఉందని గుర్తింపు పొందిఉంది.

                                     

1.2. భౌగోళికం విభాగాలు

  • మొత్తం జనసంఖ్య దాదాపు 25 లక్షలు.
  • జిల్లాలో 4 పురపాలకాలు, 99 పంచాయితీలు, 1577 గ్రామాలు ఉన్నాయి.
  • ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా 2 ఉపవిభాగాలుగా రాణిగంజ్, ఇస్లాంపూర్ విభజించబడింది.
  • జిల్లాలో బెంగాలి ప్రధానభాషగా ఉంది. ఇస్లాంపూర్ ఉపవిభాగంలో ఉర్దూ, హిందీ, మైథిలి భాషలు వాడుకలో ఉన్నాయి.
                                     

2. ఆర్ధికం

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు 640 లో వెనుకబడిన 250 జిల్లాలలో ఉత్తరదీనాజ్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. అయినప్పటికీ ప్రస్తుతం డాల్ఖోలా చక్కని వాణిజ్యకేద్రంగా అభివృద్ధిచెంది డాల్ఖోలా, ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా ఆర్థిక ఎదుగుదలకు సహకరిస్తుంది.

                                     

3.1. విభాగాలు ఉప విభాగాలు

ఉత్తర్ దీనాజ్పూర్ జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి:

  • రైగని ఉపవిభాగం, సలాంపూర్ ఉపవిభాగం.
                                     

3.2. విభాగాలు అసెంబ్లీ నియోజకవర్గాలు

జిల్లా 7 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది:

  • గోల్పొఖర్ విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 30,
  • ఇస్లాంపూర్, ఉత్తర దినాజ్పూర్ విధాన సభ నియోజకవర్గం ఇస్లాంపూర్. శాసనసభ నియోజకవర్గం ఏ 29,
  • ఇతహార్ విధాన సభ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం నెం.34.
  • రాజ్గంజ్ విధాన సభ నియోజకవర్గం ఎస్సీ. శాసనసభ నియోజకవర్గం ఏ 32,
  • చోప్రా విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 28,
  • కరందిగి విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 31,
  • కలియగంజ్ విధాన సభ నియోజకవర్గం ఎస్సీ శాసనసభ నియోజకవర్గం ఏ 33.
                                     

3.3. విభాగాలు పునర్విభజన తరువాత నియోజకవర్గాలు

"డిలిమిటేషన్ ఆఫ్ కాంస్టిస్టెంసీస్" ఆదేశానుసారం దిలిమిటేషన్ కమిషన్ బెంగాల్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత ఈ జిల్లా 9 శాసనసభనియోజకవర్గాలుగా విభజించబడింది:

  • రాయ్గంజ్ విధాన సభ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం 35.,
  • కలియగంజ్ విధాన సభ నియోజకవర్గం ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నెం.34.,
  • గోల్పొఖర్ Goalpokhar విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 30,
  • హెంతబాద్ విధాన సభ నియోజకవర్గం ఎస్సీ. శాసనసభ నియోజకవర్గం ఏ 33,
  • చోప్రా విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 28,
  • కరందిఘి విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 32,
  • చకులియా విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 31,
  • ఇస్లాంపూర్, ఉత్తర దినాజ్పూర్ విధాన సభ నియోజకవర్గం. శాసనసభ నియోజకవర్గం ఏ 29,
  • ఇతహార్ విధాన సభ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం 36.
                                     

3.4. విభాగాలు షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు:- డార్జిలింగ్ జిల్లా నుండి 6 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి హెంతాబాదు, కలియగంజ్ శాసనసభ నియోజక వర్గాలు.
  • డార్జిలింగ్ పార్లమెంటరీ నియోజకవర్గం:- చోప్రా శాసనసభ నియోజకవర్గం.
  • బాలూర్ఘాట్ పార్లమెంటరీ నియోజకవర్గం:- ఇతహార్ శాసనసభ నియోజకవర్గం.
  • రాణిగంజ్ పార్లమెంటరీ నియోజకవర్గం:- దక్షిణదినాజ్‌పూర్ జిల్లా నుండి 6 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి ఇస్లాంపూర్, గోల్పొఖర్, చకులియా, కరందగి, హెమతాబాదు, కలియగంజ్, రాణిగంజ్ శాసనసభ నియోజక వర్గాలు.
  • పార్లమెంటరీ నియోజకవర్గం:-. జిల్లా నుండి. శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. శాసనసభ నియోజక వర్గాలు.