Топ-100
Back

ⓘ మాన్సా జిల్లా. పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మాన్సా జిల్లా ఒకటి. జిల్లాలో బుధ్లడ, మాన్సా అనే 2 తాలూకాలు ఉన్నాయి. భిఖి, బుధ్లడ మన్సా ఝునిర్, సర్దుల్గర్ అనే 5 ..




మాన్సా జిల్లా
                                     

ⓘ మాన్సా జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మాన్సా జిల్లా ఒకటి. జిల్లాలో బుధ్లడ, మాన్సా అనే 2 తాలూకాలు ఉన్నాయి. భిఖి, బుధ్లడ మన్సా ఝునిర్, సర్దుల్గర్ అనే 5 డెవలెప్మెంటు బ్లాకులు 3 ఉపతాలూకాలు ఉన్నాయి. మాన్సా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం.

                                     

1. భౌగోళికం

భౌగోళికంగా జిల్లా త్రికోణాకారంగా ఉంటుంది. జిల్లా వాయవ్య సరిహద్దులో భటిండా, ఈశాన్య సరిహద్దులో సంగ్రూర్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రం ఉన్నాయి. ఇది భటిండా- జింద్ - ఢిల్లీ రైలు మార్గంలో ఉంది. అలాగే బర్నాలా- సర్దుల్గర్- సిర్సా హర్యానా రహదారి మార్గంలో ఉంది. జిల్లాలో 3 తాలూకాలున్నాయి: బుధ్లడా, మాన్సా, సత్దిల్గర్. జిల్లాలోని సర్దుల్గర్ తాలూకా గుండా ఘగ్గర్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో పంజాబీ అధికార భాషగా ఉంది.

                                     

2. చరిత్ర

మాన్సా జిల్లా మునుపు ఫుకియా సిఖ్ సామ్రాజ్యం 1722- 1948 లో భాగంగా ఉంటూ వచ్చింది తరువాత కైథల్ సిఖ్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. ఈ జిల్లా 1992 ఏప్రిల్ 13 న ఏర్పాటైంది. భటిండా జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. ఈ పట్టణాన్ని భాయి గురుదాస్ స్థాపించాడని భావిస్తున్నారు. భాయి గురుదాస్ ధింగర్‌లో నివసించే వాడు. ఆయన మాన్సాలో నివసిస్తున్న ధైల్వాల్ జాట్ సిఖ్ కన్యను వివాహం చేసుకున్నాడు. ఒకరోజు ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళడానికి ఈ ఊరికి వచ్చిన సమయంలో ఆయన అత్తమామలు భార్యను పంపడానికి నిరాకరించారు. తరువాత గురుదాస్ వారింటి ముందు తపసు చేయడం ఆరంభించాడు. తరువాత కొంతకాలానికి అత్తమామలు భార్యను పంపడానికి అంగీకరించినా గురుదాస్ భార్యను నిరాకరించి తన తపస్సు ఆపలేదు. ఈ సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ సమాధి నిర్మించి ప్రతిసంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లాడూలు, గురు సంప్రదాయానికి చెందిన ప్రజలు ఈ సమాధి దర్శించడానికి అధికంగా వస్తుంటారు. 1952 నుండి ఇక్కడ నగరపాలక వ్యవస్థ ఆరంభం అయింది.

  • ఒక రైల్వేస్టేషను ఉంది.
  • జిల్లా గ్రంథాలయం ఉంది.
  • 90 పాఠశాలలు ఉన్నాయి.
  • 1 మిడిల్ స్కూల్
  • 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.: పి.ఎస్ సిటీ, పి.ఎస్ సాదర్
  • 3 సీనియర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి.
  • 1 ప్రైమరీ స్కూల్ ఉంది.
  • నగరంలో రెండు కాలేజీలు ఉన్నాయి: నెహ్రూ మెమోరియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్, ఎస్.డి కన్య మహావిద్యాలయ కాలేజ్.
                                     

3. పురాతన కాలం

ఈ ప్రాతంలో ఒకప్పుడు సింధూనాగరికత ఉండేది. జిల్లాలోని పలు ప్రాంతాలలో పురాతన కాలంలో హరప్పా, మొహంజుదారో సంస్కృతి ఉన్నట్లు పురాతత్వ పరిశోధనలు ౠజువు చేస్తున్నాయి.

ఈ ప్రాంతం 3 సంస్కృతికి చెంది ఉంది: ప్రి హరప్పా, హరప్పా, లేట్ హరప్పా సంస్కృతులకు చెంది ఉంది.

పూర్వ హరప్పన్

  • హిర్కే
  • లక్ష్మీర్వాలా
  • బగ్లియన్ డీ థెన్
  • బారెన్
  • గుర్ని కలాన్
  • నైవాన్ తెహ్
  • అలిపూర్ మంద్రన్
  • హాసంపూర్
  • చోటి మానస
హరప్పా కాలం
  • లలియన్ వాలి
  • అలిపూర్ మంద్రన్
  • బగ్లియన్ డీ తెహ్
  • వాలా
  • చోటి మానస
  • హిర్కెబ్
  • నైవాలా తెహ్
  • కర్నపురా
  • హాసన్‌పూర్
  • డాలేవన్
  • అలి డా తెహ్
  • గుర్ని కలాన్
  • లక్ష్మీర్ వాలా
                                     

4. వ్యవసాయం, పరిశ్రమలు

మాన్సా జిల్లా పంజాబు కాటన్ బెల్టులో భాగంగా ఉంది. అందువలన ఈ ప్రాంతాన్ని ఏరియా ఆఫ్ వైట్ గోల్డ్ తెల్ల బంగారు ప్రాంతం అని అంటారు. జిల్లాకు వ్యవసాయభూములు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. జిల్లాలో రాష్ట్రంలోని అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషను ఉంది. ఈ థర్మల్ పవర్ స్టేషను సామర్థ్యం 1980 మె.వా. ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వాణిజ్యం అరుదుగా నగర ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి.

                                     

5. ప్రధాన నగరాలు, పట్టణాలు

బుధ్లడ

ఖత్లి కులానికి చెందిన బుధ, లఢ అనే అన్నదమ్ములు నివసించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి బిధ్లడ అనే పేరు వచ్చింది. ఇది ఢిల్లీ, భతిండా రైల్వే మార్గంలో ఉంది. ఇది మిలటరీ ఉద్యోగుల నియామక కేంద్రంగానూ, ముఖ్యమైన వ్యాపార కేంద్రంగానూ గుర్తించబడుతుంది.