Топ-100
Back

ⓘ ఔరవ మహర్షి. భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్రవానుడు.అప్రవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. బుచి యూరువు మరుగున పుట్టిన బిడ్డడగుటచే ..
                                               

భృగు వంశము

భృగులు జాతి వారిని, భార్గవులు అని కూడా పిలుస్తారు, హిందూ పురాణాలలో, ఒక పురాతన అగ్ని-పూజారి అయిన భృగువు నకు చెందినవారు. వీరు బ్రహ్మ నుండి జన్మించినట్లు చెబుతారు. మహర్షి భృగు సంస్కృతం: Bhṛgu ఏడు గొప్ప ఋషులు ఒకరు, సప్తఋషులలో ఒకరు, అనేక ప్రజాపతులలో సృష్టి యొక్క దూతలు ఒకరు, బ్రహ్మ సృష్టి యొక్క దేవుడు రూపొందించినవారు, ఊహాత్మక జ్యోతిషశాస్త్రం మొదటి కంపైలర్, జ్యోతిషశాస్త్ర జ్యోతిషం క్లాసిక్. భృగు సంహిత రచయిత కూడా, భృగు బ్రహ్మ మొక్ఒక మానస మనస్సు-జన్మించిన కుమారుడు పుత్రుడుగా భావిస్తారు. భార్గవ పేరు యొక్క విశేషణ రూపం, వారి వారసులు సూచించడానికి ఉపయోగిస్తారు, భృగు పాఠశాల కూడా ఉంది. భృగులు సోమ మొక్కల ర ...

                                               

అనసూయ

అనసూయ అత్రి మహర్షి భార్య, మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. దాని ఉపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. కౌశిక పత్ని సుమతి తన పతి శాపాన్ని పునస్కరించుకొని సూర్యోదయాన్ని అపేసింది. అనసూయ పదిరోజులను ఒకరోజుగా చేసి సూర్యుడుదయించేటట్లు చేసింది. మరణించిన సుమతి భర్తను మరల బ్రతికించింది. నారదుని కోరికపై గులకరాళ్ళను గుగ్గిళ్ళుగా మార్చి ఆయన ఆకలి ...

                                               

భక్తి యోగము

భక్తి యొగమును గురించి భగవద్ గీతలో చక్కగ వివరించబడింది. భక్తి యోగము పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైతన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత ...

                                               

ముండకోపనిషత్తు

ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. "ముక్తిత" సూత్రాలననుసరించి ఇది 108 ఉపనిషత్తులలో 5 వ ది. శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.

                                               

కామధేనువు

హిందూ పురాణాలలో, కామధేనువు, అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు. గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. ప‌శువుల‌న్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్ష‌సులు ఆదిశేషువు తాడుగా మంధ‌ర పర్వ‌తాన్ని క‌ర్ర‌గా చేసుకుని క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. అయితే ఆ క్షీర సాగ‌ర మ‌థ‌నంలో కామ‌ధేనువు కూడా మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తుంది. ఈ ఆవునే సుర‌భి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. మరికొన్ని పురాణగాథల్లో వశిష్ఠుడి ఇంటిలో, కొన్ని పురాణగ ...

                                               

ఐతరేయోపనిషత్తు

ఐతరేయ బ్రాహ్మణం మూస:Lang-SA బ్రాహ్మణుల యొక్క శాఖల శాఖ నెంబరు యొక్క ఋగ్వేదం యొక్క శాఖ శాఖ నెంబరు, ఒక పురాతన భారత సేకరణ లోని పవిత్రంగా ఉన్న స్తుతి. ఈ కృతి, మహీదాస సంప్రదాయం ప్రకారం సంభవించినదనుట ఉంది. ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఈ బ్రాహ్మణంలో 285 ఖండాలు ఉన్నాయి. శునస్సేఫోపాఖ్యానం ఉపాఖ్యానాలన్నీంటిలోపెద్ద్ది, ప్రసిద్దమైనది. దీనిని బహ్వృచబ్రాహ్మణము అని కూడా కొందరందురు. మొదటి వ్రాసిన ఆంగ్ల అనువాదం హెన్రీ థామస్ కోలెబ్రూక్ ద్వారా 1805 లో ప్రచురించబడింది. ఈ వేద భాగము లేదా అనువాకములో మొదటి అధ్యాయంలో ఆత్మ, లోపలి స్వీయ, గురించి ఒక దివ్య సృష్టికర్తగా చిత్రీకరించారు, ...

                                     

ⓘ ఔరవ మహర్షి

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్రవానుడు.అప్రవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. బుచి యూరువు మరుగున పుట్టిన బిడ్డడగుటచే అతడు ఔర్వువయాడు. ఔర్వుడు బాల్యము నుండియు తపస్సులో మునిగి యుండెడివాడు. అతని తపశ్శక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పితృదేవతలు ఔర్వుని చేరి కుమారా?నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచిపెట్టు.అది సముద్రమును దహించును.లేకున్న ఉపద్రవములు కలుగును అని పలకగా ఔర్వుడు దానిని సముద్రమున విడిచిపెట్టాడు. అది ఔర్వానలమై గుర్రం ముఖంతో సముద్ర జలమును త్రాగనారంభించెను. అదే బడబానలం. అనంతరం ఔర్వుడు బ్రహ్మచర్యవ్రత పరిపాలనము చేయసాగాడు. అంత దేవతు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి పెండ్లి చేసికొని పిల్లలను కనుమని పలికారు. అతడు అందుకు అంగీకరింపలేదు. అతని బ్రహ్మచర్య దీక్షకు అచెచరువంది హిరణ్యకశిపుడు శ్రద్ధాభక్తులతో ఆ మహర్షి నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరాడు. ఔర్వుడు సంతసించి హిరణ్యకశిపునకు కోరిన వరాలిచ్చి సంతుష్టిపరచి శత్రుభీతి ఉందదని అభయమిచ్చి పంపాడు.

                                     

1. కుమార్తె జీవితం

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు కందని కందశి అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ.ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు.తనే కోపి.తనకన్తన భార్య మరీ కోపి. కలహప్రియ.కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామయగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.

                                     

2. సగరుని జన్మ వృత్తాంతం

ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భనియగు పట్టమహిసితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు. తన సవతి గర్భవతి అయినదని తనకా అదృష్టం లేదని భాషుని మరియొక భార్యపట్టమహిషికి విషం పెట్టింది. ఇది ఎవరకీ తెలియదు. దాంతో గర్భం స్తంభనమైంది. ఏడు సంవత్సరములైననూ ఆమెకు పురుడు రాలేదు. ఇంతలో రాజు ముసలివాడై మరణించాడు.పట్టమహిషి సహగమనానికి పాల్పడినది. కాని ఔర్వుడు నిండు గర్భణి అయినా ఆమెను అగ్ని ప్రవేశము చేయవద్దని వారించాడు. ఆమె గురువు వచనాల ప్రకారం ఆ ప్రయత్నం మాని ఆశ్రమమందే కాలక్షేపం చేస్తోంది.కొంతకాలమునకు ఆమె ఒక మగ బిడ్డను ప్రసవించింది.ఆ బిడ్డ విషంతో సహా జన్మించాడు.ఆ విషయము తెలిసికొని ఔర్వమహర్షి ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. గరమునగా విషయు.విషముతో పుట్టుటచే ఆతనికి సగరుడు అని నామకరణం చేశాడు ఆ మహర్షి. సగురుడు, తల్లి ఆశ్రమ మందే ఉంటున్నారు.సగరుడు పెద్ద వాడయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకొన్నాడు. తల్లి వల్ల విషయాలు తెలిసికొని శత్రువులపై దండెత్తి వారినందరను జయించాడు.అతడు రాజ్యాభిషిక్తుడై సప్తద్వీపసమేతముగా భూమండలాన్ని పాలించసాగాడు. సుమతి, సుకేళి యను కన్యలను వివాహం చేసుకున్నాడు.వారివల్ల సంతానం కలుగలేదు.భార్యలను వెంటబెట్టుకుని అతడు ఔర్వమహర్షి ఆశ్రమానికి వచ్చి సంతానం కావాలని అర్థించాడు.గురువు కరుణతో సుకేళికి ఒక్క కుమారుడు.సుమతికి అరువది వేవురు కుమారులు జన్మించారు. సగరుడు గురువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు.

సగరుడు చాలాకాలం రాజ్యం చేసి చివరకు ఔర్వుని చేరి తత్త్వముపదేసించమని అర్థించాడు. అంత ఆ మహర్షి అనేక విషయాలు తెలిపాడు.ఔర్వునికి తెలియని విషయాలు వేవు.అతడు మేధావి అస్థలిత బ్రహ్మచారి.తపోనిధి.ఉపకారి.అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది.