Топ-100
Back

ⓘ శిక్ష, వేదాంగం. శిక్ష ప్రధాన లక్ష్యం వేద శ్లోకాలు, మంత్రము ల లోని అక్షరములను, స్వరములను ఉచ్చారణ సరైన రీతిగా బోధించునది. ఇందులో అతి పురాతన శబ్ద పాఠ్యపుస్తకాలు ప్ ..




                                     

ⓘ శిక్ష (వేదాంగం)

శిక్ష ప్రధాన లక్ష్యం వేద శ్లోకాలు, మంత్రము ల లోని అక్షరములను, స్వరములను ఉచ్చారణ సరైన రీతిగా బోధించునది. ఇందులో అతి పురాతన శబ్ద పాఠ్యపుస్తకాలు ప్రాతిశాఖ్యములు గా చెప్పవచ్చును.

                                     

1. ప్రాతిశాఖ్యములు

  • వేదరక్షణ కొరకు ఏర్పడినవే ప్రాతిశాఖ్యములు. వేదములలో ప్రతిశాఖకు దానికి సంబంధించిన వర్ణసమామ్నాయం, సంధులు, పదవిభాగ నియమములు, స్వర వ్యంజన సంఖ్యలు, స్వర ఉచ్చారణ పద్ధతి, ప్రగృహ్యసంజ్ఞలు, నిర్వచనములు, శబ్దవ్యుత్పత్తులు లాంటివి సంస్కృత నియమాల ననుసరించి వర్ణించ బడతాయి. అందుకే ఇవి ప్రాతిశాఖ్యములు అంటారు. సనాతన భారతీయుల యొక్క సంస్కృత భాష ఉచ్చారణ పద్ధతులను వీటి ద్వారా యథాతథంగా తెలుసుకోవచ్చును. ప్రాచీన భాషల యొక్క ధ్వని సిద్ధాంతములను తెలుసుకొనుటకు భాషాశాస్త్రజ్ఞులకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.
  • ప్రతి వేదశాఖకు ప్రత్యేకమైన అనేకమైన ప్రాతిశాఖ్యములు ఉండేవని, వేదాల శాఖలే అంతరించినపుడు వాటి ప్రాతిశాఖ్యములు కూడా కాలగర్భంలో కలసిపోగా, ప్రస్తుతము అయిదు ప్రాతిశాఖ్యములు మాత్రము లభ్యమవుతున్నాయి.
  • అథర్వ ప్రాతిశాఖ్యమ్
  • ఋక్ప్రాతిశాఖ్యమ్
  • సామ ప్రాతిశాఖ్యమ్
  • శుక్లయజుః ప్రాతిశాఖ్యమ్
  • తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్
  • అథర్వవేదానికి 1 శౌనకీయ 2 శౌనకీయ చతురధ్యాయి అని రెండు ప్రాతిశాఖ్యములు ఉన్నాయి. శౌనకీయ చతురధ్యాయి చాలా ముఖ్యమైనది.
                                     

1.1. ప్రాతిశాఖ్యములు హల్లులు భావప్రకటన

హల్లులు ఉచ్చారణ అనేది ఒక తార్కిక భాగాల కలయిక మిశ్రమంగా రెండు ప్రయత్నములలో ఉంటుంది. ఈ క్రింద పట్టిక హల్లులు ఉచ్చారణ మీద ఒక అభిప్రాయాన్ని అందిస్తుంది.