Топ-100
Back

ⓘ మాండవ్య మహర్షి. మాండవ్యుడు మహర్షి, అతడు ఒక ముని కుమారుడు. తపశ్శాలి,బ్రహ్మ విద్యాపరుడు బ్రహ్మర్షి,స్ధిరచిత్తుడు. మౌన వ్రతుడు,పుణ్యపురుషుడు,సత్యవ్రతుడు.అటువంటి మా ..                                               

శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం

శ్రీ మాండవ్య నారాయణస్వామి వారి దివ్యక్షేత్రము పావన గోదావరి నది సప్త పాయలలో ఒకటైన తుల్యభాగనదీ తీరాన సామర్లకోటలో వెలసిన శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం దక్షిణ బదరీ గా అత్యంత ప్రాశస్త్యం పొందింది. కోరిక లీడేర్చే కొంగు బంగారంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన సంస్కృతీ వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది. త్రేతాయుగంలో దండకారణ్య ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో తపమాచరించిన మాండవ్య మహర్షిచే ప్రతిష్ఠించబడినందున స్వామికి మాండవ్య నారాయణ స్వామి అనే పేరు ప్రసిద్ధమైంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో విగ్రహం పాదా ...

                                               

తిరుమల పుష్కరిణి

శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడ ...

                                               

మండీ జిల్లా

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం 12 జిల్లాలో మండీ జిల్లా ఒకటి. మొదట ఈ జిల్లాను మాండవ్య జిల్లా అని అనేవారు. జిల్లా కేంద్రగా మండీ పట్టణం ఉంది. ఈ జిల్లాకు పురాణ, చారిత్రక ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ జిల్లాలో పురాణ ప్రాశస్త్రం కలిగిన పలు ఆలయాలు ఉన్నాయి. దీనిని భక్తులు చిన్నకాశి అని అంటారు. బియాస్ నదీతీరంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. బియాస్ నది ఈ జిల్లాలోని కొండలు, నగరప్రాంతంలో ప్రవహిస్తూ అత్యంత సుందరంగా ఉంటుంది. ఈ ప్రశాంత వాతావరణానికి అభివృద్ధి పనులలో నిర్మించిన రహదారులు ఆధునిక హంగులను సమకూర్చాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇది వాణిజ్యకేంద్రంగా ఉంది. కుల్లు, మనాలి నగరాలకు, ఇతర సమీప ప్రాంతాలకు ఇది ప్రధ ...

                                               

వశిష్ఠ మహర్షి

వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకఁడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి మహర్షి జేష్టుడు. ఈతని భార్య అదృశ్యంతి. శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు. ఇంకను వ ...

                                               

గృత్సమద మహర్షి

గృత్సమద, ఋషి, ఋగ్వేదంలోని రెండవ మండలం 43 శ్లోకాలలో 36 శ్లోకాలు దర్శించినవాడు అత్యంత ఘనుడు. వీటిలో 27-29 శ్లోకాలు తనకుమారుడైన కూర్ముడు, 4-7 శ్లోకాలను సోమహుతి దర్శించారు. గృత్సమద మహర్షి మహా తపస్వి.

                                               

దేవల మహర్షి

దేవలుడు శరీరము నలుపు వర్ణము కలిగి ఉండుటచే అతనికి అసితుడు అని పేరు కూడా తదుపరి వచ్చింది. ప్రజాపతి, ప్రభాత లకు కలిగిన పుత్రుడు ప్రత్యూషుడు. ప్రత్యూషునకు వివాహము చేసుకొనిన తదుపరి ఇరువురు కుమారులను పొందెను. అందులో పెద్దవాడు దేవలుడు, రెండవ సంతానము విభువు. ఋక్సంహితను దర్శించాడు. దేవ మనువు నకు ప్రజాపతి అను కుమారుడు కలిగెను. ఈ ప్రజా పతికి ధూమ్ర, బ్రహ్మవిద్య, మనస్విని, రతి, శ్వాస, శాండిలి, ప్రభాత అను ఏడుగురు భార్యల వలన ధరుడు, ధృవుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూషుడు, ప్రభానుడు అను ఎనమండుగురు కుమారులు కలిగారు. ఈ ఎనమండుగురు పుత్రులు తదుపరి అష్టవసువులుగా ప్రసిద్ధి చెందినారు.

                                     

ⓘ మాండవ్య మహర్షి

మాండవ్యుడు మహర్షి, అతడు ఒక ముని కుమారుడు. తపశ్శాలి,బ్రహ్మ విద్యాపరుడు బ్రహ్మర్షి,స్ధిరచిత్తుడు. మౌన వ్రతుడు,పుణ్యపురుషుడు,సత్యవ్రతుడు.అటువంటి మాండవ్యునిపై ఒక అపనింద పడింది.ఏమిటా అపనింద? దొంగలు కొందరు రాజభవనంలో ఖజాన దోచుకొని మాండవ్యుని ఆశ్రమాన పాతిపెట్టి పొదలమాటున పొంచి ఉన్నారు.రాజభటులు దొంగలను వెతుకుతూ వచ్చి వారు కనపడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుని అడిగారు.మౌనవ్రత మందున్న మాండవ్యుడు సమాధానం చెప్పలేదు.భటులు ఆశ్రమమంతా వెతకి దొంగలు పాతిపెట్టిన ఖజాన బయటకు తీశారు.దొంగలను బంధించారు.ముక్కు మూసికొని తపస్సు చేసికొనే మాండవ్యుని కూడా దొంగేనని భావించి దొంగలతో పాటు బంధించి తీసికొని పోయారు.రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి శూలం గుచ్చి పాతి వెళ్ళిమాయారు.మాండవ్యుడు దేహబాధను లక్ష్యపెట్టక తపస్సాధనలో ఉండిపోయాడు.

                                     

1. కూశికుని వృతాతం

ఒకనాటి రాత్రి జరిగిన విషయము ప్రతిష్ఠాన మను ఒక పురమున కౌశికుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.అతడు కుష్ఠురోగి.అతని భార్య పతివ్రత.భర్తయే సర్వస్వమనిభావించి శుశ్రూష చేయుచుండెను.అనాటి రాత్రి రాజమార్గమున ఒక వేశ్య పోవుచుండెను.అమెను చూచి కౌశికుడు ముగ్ధుడై భార్యను పిలిచి ఆమెవద్దకు తీసికొని పొమ్మనిప్రాధేయపడెను.అంత ఆమె భర్తను వీపుపై నెక్కించుకుని చీకటిలో వేశ్యాగృహమునకు తీసికొనపోవసాగినది.దారిలో శూలమునకు గుచ్చబడిన మాండవ్యునకు కౌశికుని శరీరము తగిలినది.అంత మాండవ్యుడు బాధపడుచూ ఇతడు సూర్యోదయమగుసరికి చనిపోవుగాక అని శపించెను.కాని కౌశికుని భార్యపతివ్రత అగుటచే అతనిని బ్రతికించుకొన గలిగినది.

                                     

2. మణ్డవ్యుని తపసు కొనసాగింపు

మాండవ్యుడు శూలముపైనే ఉండి తపస్సును యథావిధిగా చేయుచుండెను.అతడు తపస్సునకు మెచ్చి మునులు పక్షులై రాత్రివేళ వచ్చి మాండవ్య మునీంద్రా మహాతపస్వినివైన నీకీ శిక్ష ఎవరూ విధించారు అని అడగగా మాండవ్యుడు మునులారా నేను అపరాధము చేయలేదు.నాకీ శిక్ష ఎందువలన సంభవించినదో తెలియదు అని మౌనము వహించెను.విని మునులు తమ ఆశ్రమములకు వెళ్ళిపోయిరి.కొంతకాలమునకు రాజు,మాండవ్యుడు మహాబుషుని గ్రహించి క్షమించమని ప్రాధేయపడ్డాడు. అంత మాండవ్య మహర్షి రాజా ఇది నా పురాకృత ఖర్మము.నీ దోషమేమియు లేదు అని పలకగా రాజు సంతసించి శూలము నుండి అతనిని బయటకు తీయ ప్రయత్నించెను. ఆ శాలపీషము మేకువలె ముని కంఠమున నిలిచి పోయినది.ఎంత ప్రయత్నించినను అది రాలేదు.అనాటి నుండి మాండవ్యుడు అని మాండవ్యుడని పిలవబడెడివాడు.

                                     

3. యమధర్మరాజును శపించుట

తెలిసిఏ పాపము చేయని తనకు ఇట్టి శిక్ష విధించిన యముడిని చేరి యమధర్మరాజా ఏ పాపము చేయని నాకు ఇంత శిక్ష ఎందుకు విధించితివి అనగావిని యముడు మునీంద్రా ఒక్క విషయం. నీకు బాల్యమున తూనీగలను బాధించావు.ఆ పాపమునకు ఈ శిక్ష అనుభవించావు అని పలుకగా మాండవ్యుడు యమధర్మరాజా అజ్ఞాన దశలో పన్నెండేళ్ళ లోపునే చేసిన పాపము ధర్మశాస్త్రరీత్యా నాకంటదు.ఈ వయసున ఏమియూ తెలియదు.తెలియని వయసున చేసిన పాపం నా కంటకట్టినన్నీ విధంగా శిక్షించావు.దీనికి ప్రతిఫలం అనుభవించు.నీకు భూలోకమున శూద్రుడవై జన్మింతువు గాక అని శపించాడు. మాండవ్యుని శాపంతో యముడు విదురుడై జన్మించాడు.

                                     

4. ధర్మరాజును కలుసుకొనుట

మహర్షులు జనకమహారాజును దర్శించుచూ పోవుచుండెడివారు.ఒకనాడు మాండవ్యుడు జనకుని దర్శనార్ధం వెళ్ళాడు జనకుడు మహాజ్ఞాని.ఆకారణంచే జ్ఞానులను సత్కరించే వాడు.వారి వల్ల ధర్మసూక్ష్మములు గ్రహించేవాడు.మాండవ్యుడు రాగా ఈ మహర్షి వల్ల అనేక ధర్మ విషయాలు తెలిసికొన్నాడు.జనకుని వల్ల మాండవ్యుడు కూడ అనేక విషయాలు గ్రహించాడు. మరి కొన్నాళ్ళకు మాండవ్యుడు ధర్మరాజును దర్శించాడు.ధర్మరాజు మాండవ్యుని ఆదరించి గౌరవించి సత్కరించి పూజించాడు అంత మాండవ్యుడు సంతోషించి ధర్మరాజును అనేక విషయాలు తెలిపి శివమహిమ గురించి వివరించిచెప్పాడు. శివస్మరణ వల్ల దు:ఖములు నశించునని నిత్య శివస్మరణ చేయుమని ఉపదేశించాడు మాండవ్యుడు మునిగా జీవితం గడిపి కౌశికుడను వానిని శపించి,యమునకు శాపమిచ్చి,జనక,ధర్మరాజాదులను జ్ఞానోపదేశం చేసి తన శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తపశ్శాలి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →