Топ-100
Back

ⓘ మాల్దీవులు. మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1.19 ..
                                               

అరేబియా సముద్రము

అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రములోని భాగము. దీనికి తూర్పున భారత దేశము, ఉత్తరాన బలూచిస్తాన్, దక్షిణ ఇరాన్ ప్రాంతము, పశ్చిమాన అరేబియన్ దీపకల్పము, దక్షిణాన సొమాలీలాండ్ యొక్క ఈశాన్యమున ఉన్న కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశము లోని కేప్ కొమొరిన్‌ను కలుపుతూ ఉన్న ఒక ఊహారేఖ దీని ఎల్లలుగా ఉన్నాయి. వేదకాలములో ఈ సముద్రమును భారతీయులు సింధూ సాగరము అని పిలిచేవారు. అరేబియా సముద్ర తీరమున ఉన్న దేశాలు: భారత దేశము, ఇరాన్, ఒమన్, పాకిస్తాన్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, సొమాలియా, మాల్దీవులు. ఈ సముద్రము యొక్క తీరమున ఉన్న ప్రధాన నగరములు ముంబై, భారత దేశము, కరాచీ, పాకిస్తాన్.

                                               

రూపీ

ద్రవ్య సంబంధమైన కొలమానానికి కొన్ని దేశాలలో వాడబడుతున్న సాధారణ నామం రూపీ. భారతదేశానికి సంబంధించిన రూపీని తెలుగులో రూపాయి అంటారు. భారతదేశం పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవులు, ఇండోనేషియా ద్రవ్య కొలమానానికి సాధారణ నామంగా రూపీని ఉపయోగిస్తున్నారు. పూర్వం బర్మా, ఆఫ్గనిస్తాన్లలో కూడా ద్రవ్య కొలమానానికి రూపీని సాధారణ నామంగా ఉపయోగించారు. చారిత్రాత్మకంగా రూపీని మొట్టమొదట సుర్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు షేర్ షా సూరి 16 వ శతాబ్దంలో పరిచయం చేశాడు. ఈ రూపీ పదం రుపయా అనే పదం నుండి వచ్చింది. వెండి నాణెం యొక్క సంస్కృత పదం రుపయా.

                                               

నర్గీస్ తుఫాను

నర్గీస్ తుఫాను, అని పేరు పెట్టబడిన ఈ తుఫాను మే నెల 2008 సంవత్సరములో వచ్చిన అతి భయంకరమైన తుఫాను. ఈ తుఫాను ముఖ్యముగా బర్మా దేశములో విధ్వంసం సృష్టించింది. 22.000 మంది మరణించారు. 41.000 మంది తుఫానులో చిక్కుబడి తప్పి పోయారు. ప్రపంచ వాతావరణ సంస్థ సూచనల ప్రకారం మన దగ్గర కూడా తుపాన్లకు పేర్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రజలు తేలిగ్గా సదరు ఉత్పాతాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఉత్తర హిందూ మహాసముద్ర దేశాలైన బంగ్లాదేశ్‌, భారత్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌,శ్రీలంక, థాయ్‌లాండ్‌లు వంతుల వారీగా పేర్లను పెడుతున్నాయి. 2010 మే తుపానుకు లైలా తుఫాను అని పాకిస్థాన్‌ పేరు పెట్టింది. 2009లో భారత్‌, బంగ్లా ...

                                               

దేశాల జాబితా – దీవుల దేశాలు

ప్రపంచంలో ద్వీప దేశాలు లేదా దీవులైన దేశాలు జాబితా ఇక్కడ ఇవ్వబడింది. ఈ జాబితాలో ఇచ్చిన దేశాలు ఒక దీవి గాని లేదా ద్వీపకల్పం కొన్ని దీవుల సమూహం కాని కావచ్చును. "ద్వీపదేశం" లేదా "సరిహద్దు లేని దేశం" అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం స్వాధిపత్యం కలిగి ఉండి, మరే దేశంతోనూ నేల భాగంలో సరిహద్దు లేనిది. ఉదాహరణకు ఐర్లాండ్ ద్వీపంలో కొంతభాగం ఐర్లాండ్ దేశం ఉంది గాని అదే దీవిలోని ఉత్తర ఐర్లాండ్ భాగం యునైటెడ్ కింగ్‌‌డమ్ దేశానికి చెందినది. కనుక ఈ దేశం "సరిహద్దు లేని దేశం కాదు. కాని మడగాస్కర్ అనే దేశం ఆ పూర్తి దీవిపైన స్వాధిపత్యం కలిగి ఉన్నది గనుక అది ద్వీపదేశంగా లెక్క. అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఒక పూర్తి ...

                                               

భారత ఉపఖండము

భారత ఉపఖండము ఆసియా ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో దక్షిణ ఆసియా లోని భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు కలిసివున్నాయి. కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక, రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "ఉపఖండం" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.

                                               

ద్రావిడ నిర్మాణం

దక్షిణ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన నిర్మాణ శైలి ద్రావిడ నిర్మాణం. ద్రావిడ భాషలు మాట్లాడే ద్రావిడ ప్రజలు ఈ నిర్మాణాలను నిర్మించడం వలన వీటిని ద్రావిడ నిర్మాణాలు అని పిలుస్తున్నారు. ఇవి ప్రధానంగా పిరమిడ్ ఆకారాన్ని కలిగి ఉన్న దేవాలయాలు, తమిళంలో వీటిని కోవెలలు అంటారు. కఠినమైన రాతి శిలలను చెక్కి దేవాలయ రూపాన్ని సృష్టించడానికి ఈ నిర్మాణాలలో అనేక దేవతల, యోధుల, రాజుల, నర్తకుల విగ్రహాలను పొందు పరిచారు. పురాతన పుస్తకం వాస్తు శాస్త్ర లో దేవాలయ నిర్మాణం యొక్క మూడు శైలులు ఒకటిగా చెప్పబడింది, ఇది ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో ప్రారంభమైంది. ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ...

మాల్దీవులు
                                     

ⓘ మాల్దీవులు

మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1.196 పగడపు దీవులు ఉన్నాయి.

                                     

1. చరిత్ర

మాల్దీవుల యొక్క ప్రాచీన చరిత్ర అస్పష్టముగా ఉంది. మాల్దీవుల కథల ప్రకారం, కోయిమాలే అనే ఒక సింహళ యువరాజు తన పెళ్ళికూతురైన శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో పాటు ఒక మాల్దీవుల లగూన్ లో చిక్కుకొని అక్కడే స్థిరపడి మాల్దీవుల మొదటి సుల్తాన్‌గా పరిపాలించాడని ప్రతీతి.

శతాబ్దాలుగా ఈ దీవుల అభివృద్ధిపై దగ్గరగా ఉన్నఅరేబియా సముద్ర, హిందూ మహాసముద్ర తీరాల నుండి వచ్చిన నావికుల ప్రభావము ఉంది. మలబార్ ఇప్పటి భారతదేశంలోని కేరళ తీరానికి చెందిన మోప్లా సముద్రపు దొంగలు ఈ దీవులను ఎంతో ఇబ్బందికి గురి చేసారు. 16వ శతాబ్దములో పోర్చుగీసు వాళ్ళు ఈ దీవులను తమ ఆధీనములోనికి తెచ్చుకుని 15 సంవత్సరాలు 1558-1573 వరకూ పాలించారు. వారిని మహమ్మద్ అల్ ఆజమ్ అనే దేశభక్తి గల వీరుడు తరిమివేశాడు.

చాలాకాలం స్వతంత్ర మహమ్మదీయ రాజ్యంగా ఉన్నా 1153-1968 మాల్దీవులు ఇంగ్లీషు వారి రక్షణగల దేశంగా ఉండేది 1887-జులై 25 1965. గణతంత్ర రాజ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగినా మహమ్మదీయ సామ్రాజ్యంగానే ఉండిపోయింది. ఇస్లామ్ మతానికి మారక ముందు మాల్దీవులలో బౌద్ధం విలసిల్లింది. ఈ మత మార్పిడికి కూడా రన్నమారి అనే సైతాను గురించిన ఊహాజనితమైన నమ్మశక్యము కాని కథ ప్రచారంలో ఉంది.

బ్రిటీషు వారి నుండి 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాతి 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. 1968 నవంబరు 11 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది. పర్యాటక రంగము, మత్స్య పరిశ్రమ ఈ దీవుల సమూహములో అభివృద్ధి చెందింది.

2004 డిసెంబరు 26లో హిందూ మహాసముద్రములో వచ్చిన భూకంపము వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. నిరోధించటానికి అవసరమైన భూమి లేకపోవటము వలన అలలు 1.2 -1.5 మీటర్ల ఎత్తు ఎగసి పడడంతో ఈ ఉపద్రవం సంభవించింది. ఇంతే కాకుండా ఈ దీవుల సమూహము సముద్ర మట్టానికి క్రిందుగా ఉండటము సముద్ర మట్టానికి క్రిందుగా ఉన్న దేశాలలో ప్రపంచంలో ఇదీ ఒకటి మూలంగా కూడా మొత్తము దేశమంతా ఛిత్తడి నేలగా మారిపోయింది. సుమారు 75 మంది, ఆరుగురు విదేశీయులతో సహా గల్లంతయ్యారు. ప్రజలు నివసించే 13 దీవులలో, 29 విహార దీవులలో మొత్తం వసతులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.

                                     

2.1. ఆర్ధిక వ్యవస్థ మత్స్య పరిశ్రమ

మాల్దీవుల ఆర్థికవ్యవస్థ అనేక శతాబ్దాలనుండి, మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. నేటికీ ఇవే ప్రజల ప్రధాన జీవనాధారాలు. అందువల్లే ప్రభుత్వము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.

దేశ ఆర్థిక వ్యవస్థలోనూ, ఇక్కడి మత్స్య పరిశ్రమ చరిత్రలోనూ 1974లో సాంప్రదాయ విధానమైన ధోనిలో చేపలు పట్టే పద్ధతిని యాంత్రికీకరించడము ఒక పెద్ద మైలురాయిగా భావిస్తారు. 1977లో ఒక జపానుకు చెందిన కంపెనీ యొక్క సహకారముతో చేపలను డబ్బాలలో నింపే పరిశ్రమను ఫెలివారూ దీవిలో స్థాపించారు. 1979లో మత్స్యరంగము యొక్క అభివృద్ధికి అవసరమైన పాలసీ మార్గదర్శకాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలూ చేసేందుకు ఒక మత్స్యపరిశ్రమ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మానవవనరుల అభివృద్ధి పథకాలు 80వ దశకపు తొలినాళ్లలో ప్రారంభమయ్యాయి. మత్స్య పరిశ్రమ విద్యను పాఠశాలలో పాఠ్యాంశముగా చేర్చారు. ఫిష్ అగ్రవేటింగ్ డివైజులను, నావిగేషనల్ సహాయకారక యంత్రాలను అనేక ప్రధాన ప్రాంతాలలో యేర్పాటు చేశారు. అంతేకాక, మాల్దీవుల మత్స్యరంగ ఎక్స్‌క్లూజివ్ ఆర్థిక జోను EEZ ప్రారంభము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మరింత దోహదము చేసింది. ప్రస్తుతం, మాల్దీవుల మత్స్య పరిశ్రమ జాతీయ స్థూల ఆదాయములో 15% పైగా చేకూర్చటమే కాక, దేశంలోని 30% పైగా జనాభాకు ఉపాధి కల్పిస్తుంది. మాల్దీవుల విదేశీ మారక ఆర్జనలో పర్యాటక రంగము తర్వాత స్థానము మత్స్యపరిశ్రమదే.

                                     

2.2. ఆర్ధిక వ్యవస్థ పర్యాటక పరిశ్రమ

పర్యటక రంగము యొక్క అభివృద్ధి మొత్తం మాల్దీవుల యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసింది. ఈ రంగము అనేకమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించడమే కాకుండా ఇతర సంబంధిత రంగాలలో ఆదాయమార్గాలను పెంపొందించింది. ప్రస్తుతం, పర్యాటకరంగము దేశం యొక్క అతిపెద్ద విదేశీమారక వనరు. జాతీయ స్థూల ఆదాయములో పర్యాటక రంగము యొక్క వాటా 20%. దేశం మొత్తం 86 పర్యాటక రెసార్టులు పనిచేస్తు ఉండగా, 2000 సంవత్సరములో 4.67.154 మంది పర్యాటకులు మాల్దీవులకు విచ్చేసినట్టు నమోదయ్యింది.

                                     

2.3. ఆర్ధిక వ్యవస్థ కుటీర పరిశ్రమలు

దేశములో పర్యాటక రంగము అభివృద్ధితో చాపల అల్లకం, లక్కపని, హస్తకళలు, కొబ్బరితాళ్ళ తయారీ వంటి అనేక సాంప్రదాయక కుటీర పరిశ్రములకు కూడా ఊతమిచ్చింది. కొత్తగా అభివృద్ధి చెందిన పరిశ్రమలలో ముద్రణ, పీవిసి పైపుల తయారీ, ఇటుకల తయారీ, సముద్రములో ఉపయోగించే ఇంజన్ల మరమ్మత్తు, షోడా నీళ్ళ బాట్లింగ్ పరిశ్రమ, దుస్తుల తయారీ మొదలైనవి ముఖ్యమైన పరిశ్రమలు.

                                     

3. రాజకీయాలు

మౌమూన్ అబ్దుల్ గయూమ్, 1978లో మొదటి ఎన్నుకోబడిన అధ్యక్షుడు. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్రనుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు. 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి.

మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలి నవంబరు 17న ప్రమాణస్వీకారం చేశారు.

                                     

4. భౌగోళికము

మాల్దీవులు ప్రపంచములోనే అతి చదునైన దేశముగా పేరుగాంచింది. దేశములోని అత్యున్నత స్థానము కేవలం 2.3 మీటర్లే. పెరుగుతున్న సముద్రమట్టము మాల్దీవుల ఉనికికి ప్రమాదకారిగా మారే అవకాశమున్నదని నివేదికలు వచ్చినప్పటికీ, వాస్తవానికి ఇటీవలి దశకాలలో సముద్రమట్టము కొంచెం తరిగినది.

2004లో హిందూ మహాసముద్రములో సంభవించిన సునామీ వల్ల మాల్దీవులలోని కొంతభాగము జలమయమై అనేకమంది ప్రజలను నిర్వాసితులను చేసింది. ఈ వినాశనము తర్వాత, కార్టోగ్రాఫర్లు సునామీ వల్ల రూపాంతరము చెందిన దీవుల యొక్క పటాలను తిరిగి గీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వము ఎప్పుడో ఒకప్పుడు మాల్దీవులు సముద్రపటమునుండి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.