Топ-100
Back

ⓘ రైలు రవాణా వ్యవస్థ ..
                                               

గౌహతి- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

గౌహతి- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, భారతదేశంలోని గౌహతి, సికింద్రాబాద్ మధ్య నడిచే ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్‌కు చెందిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు ప్రస్తుతం 12513/12514 నంబర్లతో వారానికొకసారి నడుస్తోంది.

                                               

చాముండి ఎక్స్‌ప్రెస్

చాముండి ఎక్స్‌ప్రెస్ మైసూర్, బెంగుళూరు మధ్య నడిచే ఒక రోజువారీ ప్రయాణికుల రైలు. ఈ రైలు ఉదయం 6:45 గంటలకు మైసూర్ నుండి బయలుదేరి ఉదయం 9:40 గంటలకు వద్ద బెంగుళూర్ సిటీకి చేరుతుంది.దీనికి రెండవ తరగతి పెట్టెలు, ఒక ఎయిర్ కండిషన్డ్ పెట్టె ఉంటాయి. ముందుగానే బుకింగ్ కోసం ఏర్పాటు సదుపాయం ఉంది.ఇది ప్రయాణించే మైసూరు, బెంగుళూరు రెండు నగరాలు కర్నాటక రాష్ట్రంలోనే ఉన్నాయి.రెండు నగరాలు మధ్య దూరం 139 కిలోమీటర్ల ఉంటుంది. ఇది మైసూరు నుండి ప్రతిరోజు ఉదయం గం. 06:45 ని.లకు బయలుదేరి అదే రోజు ఉదయం గం 09:30 ని.లకు బెంగుళూరు చేరుకుంటుంది.అది మైసూరు నుండి గమ్యస్థానానికి చేరుకోవడానికి 2 గం. 45 ని.లు సమయం పడుతుంది.రైలు చి ...

                                               

ట్రామ్

ట్రామ్ లేదా ట్రామ్‌కార్ అనేది ప్రజా పట్టణ వీధులలో రైలు మార్గంపై పరుగులు తీసే ఒక రైలు వాహనం. ఇది ఉత్తర అమెరికాలో స్ట్రీట్ కార్ లేదా ట్రాలీ లేదా ట్రాలీ కారుగా పిలవబడుతుంది. ట్రామ్‌కార్‌ల చే నిర్వహించబడుతున్న ఈ లైన్లను లేదా నెట్వర్కులను ట్రాంవేస్ అంటారు. ట్రామ్ మార్గాలు విద్యుచ్ఛక్తి ద్వారా శక్తి పొందుతాయి, అత్యంత సాధారణ రకం చారిత్రాత్మకం, ఒకప్పుడు విద్యుత్ వీధి రైల్వేలు అని పిలవబడ్డాయి. అయితే ట్రామ్‌లను విద్యుదీకరణ యొక్క విశ్వవ్యాప్త అవలంబనకు ముందే పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించారు. విద్యుత్ ట్రామ్‌ల యొక్క ఇతర పద్ధతులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ట్రామ్ లైన్లు నగరాలు, /లేదా పట్టణాల మధ్య కూడ ...

                                               

తిరుపతి - కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

తిరుపతి - కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నందు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది తిరుపతి రైల్వే స్టేషను, కరీంనగర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం 12761/12762 రైలు నంబర్లతో రెండు వారాల ప్రాతిపదికన నడుస్తోంది.

                                               

నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే

నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే భారతదేశంలోని ఒక రైల్వే సంస్థ. ఇది 1879 - 1950 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రం లోని నిజాం ప్రభుత్వం చేత నిర్వహించబడింది.

                                               

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు (ఇండియా)

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ టు ముంబాయి- అహ్మదాబాద్‌ నగరాల మధ్య 508 కిలోమీటర్ల బుల్లెట్‌ రైలు మార్గం నిర్మాణానికి సెప్టెంబరు 14, 2017 భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేశారు. దేశంలో బుల్లెట్‌ రైళ్ల యుగానికి ఇది పునాది కాబోతోంది. జపాన్‌ సహయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు. ఈ నిర్మాణం 2023 నాటికి పూర్తవుతుందని అంచనా.

                                               

మెట్రోరైలు

మహానగరాల్లో ఉన్న వివిధ రకాల రవాణా వ్యవస్థలలో మెట్రో రైలు వ్యవస్థ ఒకటి. రోడ్డు రవాణా వ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడంలో మెట్రో రైలు వ్యవస్థ ప్రధాన పాత్ర వహిస్తుంది.

                                               

రైలు

రైలు అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటుకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో ధూమశకటం అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అంటారు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ "గ్లాస్ గో" విశ్వవిద్యాలయంలో 1776లో కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయో ...

                                               

రైలు మార్గం

రైలు నడిచే మార్గమును రైలు మార్గం అంటారు. రైలుమార్గం రోడ్డు మార్గమునకు భిన్నముగా ఉంటుంది. ఈ మార్గం రైలు నడిచేందుకు ప్రత్యేకంగా నిర్మించబడివుంటుంది. ఈ మార్గంలో రైలు చక్రాల వంటి చక్రాలు కలిగిన వాహనములు మాత్రమే ప్రయాణించగలవు. ఈ మార్గంపై పట్టాలు ఉంటాయి. వీటిని రైలు పట్టాలు అంటారు. ఈ పట్టాలపైనే రైలు చక్రాలు నడిపించబడతాయి. రైలు పట్టాలు ఒక పట్టాకు మరొక పట్టా ప్రక్కప్రక్కనే ఉంటాయి. వీటి మధ్య దూరం దారి పొడవునా సమంగా ఉంటుంది. పట్టాలు వంగకుండా, కుంగకుండా, పక్కకు జరిగిపోకుండా ఉండేందుకు పట్టాల కింద కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేస్తారు. దిమ్మెలు దిగ్గబడకుండా, రైలు స్వల్ప కదలికలకు అనుగుణంగా పట్టాల స్వల్ప ...

                                               

లెవెల్ క్రాసింగ్

లెవెల్ క్రాసింగ్ లేక రైల్వే రోడ్ క్రాసింగ్ అనగా రైలుమార్గం దాటే ఒక కూడలి. ఇక్కడ ఒకే స్థాయిలో రైల్వే లైన్‌కు అడ్డంగా రహదారి లేదా కాలిబాట ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా రైల్వే లైన్ ను దాటేందుకు ఓవర్ బ్రిడ్జి లేదా అండర్ బ్రిడ్జి లేదా సొరంగ మార్గాన్ని ఉపయోగిస్తారు. లెవెల్ క్రాసింగ్ కు ఇతర పేర్లు రైల్వే క్రాసింగ్, గ్రేడ్ క్రాసింగ్, రోడ్ త్రో రైల్‌రోడ్, రైల్‌రోడ్ క్రాసింగ్, ట్రైన్ క్రాసింగ్.