Топ-100
Back

ⓘ గూడు అనగా జంతువులచే నిర్మించబడిన నిర్మాణం, ఈ గూడులలో జంతువులు సందర్భోచితంగా తనకుతాను ఉంటూ గుడ్లు పెట్టి, వాటిని పొదిగి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. గూళ్ళు ..
                                               

గిజిగాడి గూడు

వీటి గూళ్ళు చెరువులోకి వంగిన తుమ్మ చెట్టు కొమ్మలకో, తాటి చెట్లకో ఈత చెట్లకో వేలాడుతూ కనబడతాయి. ఈ గూళ్ళను గిజిగాడి గూళ్లు అంటారు. ఓ రకం పిచ్చుకలే అయిన గిజిగాళ్ళు పాములూ, ఇతర శత్రువుల బారినుండి గుడ్లనూ, పిల్లల్నీ కాపాడుకోడానికి గూళ్ళను ఇలా కట్టుకుంటాయట. కొన్నిచోట్ల ఈ గిజిగాళ్ళు కరెంటు తీగలకు కూడా వ్రేలాడే గూడును కట్టుకుంటాయి. ఈ గూళ్ళు అద్భుతంగా కట్టుకుంటాయి. కొమ్మలకు వ్రేలాడుతూ ఉండే ఈ గూళ్ళ నిర్మాణంలో, ఈ పక్షులు చూపించే సాంకేతిక నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవి గూళ్ళు అల్లడమూ, పిల్లలకి ఆహారం నోటికందించడమూ, శత్రువులను ఎదుర్కోవడమూ, ఆటలూ పాటలూ చాలా చూడ ముచ్చటగా ఉంటాయి. ఈ గూళ్ళలో గోల గోలగా కూ ...

                                               

గూడు వదిలిన గువ్వలు

గూడు వదిలిన గువ్వలు పుస్తకం నానీలు అనే కవితా ప్రక్రియలో రాసిన కవితల సంకలనం. 18-20 అక్షరాల్లో, ఐదారు పాదాల్లో, నాల్గు చిన్న పాదాల్లో రాసే ప్రక్రియను నానీలు అంటారు. ఈ ప్రక్రియ ప్రారంభమై ప్రాచుర్యం పొందుతున్న తొలినాళ్లలో కవి ఎస్.ఆర్.భల్లం ఈ నానీల సంకలనాన్ని రాశారు. క్రీసెంట్ పబ్లికేషన్స్ వారు డిసెంబరు 2000లో గూడు వదిలిన గువ్వలు పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి, నానీ ప్రక్రియకు ఆద్యుడు డా.ఎన్.గోపికి అంకితమిచ్చారు.

                                               

కందిరీగ

కందిరీగలు హైమెనోప్టెరా క్రమంలో ఎపోక్రిటా ఉపక్రమానికి చెందిన ఎగిరే కీటకాలు జాతికి చెందుతాయి. కందిరీగ గూడును ఆంగ్లంలో Wasp nest అంటారు.కందిరీగలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రకాల కందిరీగలు, తేనెటీగలు నిర్మించనట్లుగా కలిసికట్టుగా తేనెటీగలగూడు ఆకారంలోనే షడ్భుజి ఆకారంలోనే గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు ఒంటరిగా మట్టితో గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు కర్రను లేదా చెక్కను తొలచి గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడులలో కందిరీగలు నివసిస్తూ తమ సంతానాన్ని అభివృద్ధి పరచుకుంటాయి. కందిరీగలు ఈ గూడులలో గ్రుడ్లను పెట్టి ఆ గూడులను మూసివేస్తాయి. ఆ గుడ్లు కాల క్రమంలో పెరిగి లార్వాలుగా మారి చ ...

                                               

సాలెగూడు

సాలెగూడు అనగా సాలెపురుగు గూడు, దీనిని ఆంగ్లంలో "స్పైడర్ వెబ్" అంటారు. ఇది జిగురుగా ఉండే ఒక వల వంటిది, సాలెపురుగులు తనకు కావలసిన ఆహారాన్ని బంధించేందుకు వాటి ఉదరము నుంచి స్రవించే పట్టు వంటి దారంతో దీనిని తయారు చేస్తాయి. కీటకాలు ఎగురుతూ వచ్చి, లేదా ప్రాకుతూ వచ్చి ఈ వెబ్ లో చిక్కుకున్నపుడు అవి తప్పించుకోలేవు, అప్పుడు సాలీడు ఆ కీటకాలను తినేస్తుంది. అత్యధిక సాలెగూడులు చాలా సన్నగా ఉంటాయి, కానీ చాలా బలంగా కూడా ఉంటాయి. వివిధ రకాల సాలీడులు వివిధ రకాల సాలెగూడులను తయారు చేస్తాయి. సాలెపురుగులు ఆహారాన్ని బంధించేందుకు వివిధ ప్రదేశాల్లో అనేక రకాలుగా ఈ వెబ్స్ ను తయారు చేస్తాయి.

                                               

పక్షిగూడు

పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరి వాటి ఆహారాన్ని అవే సమకూర్చుకునేలా తయారేంతవరకు తల్లిపక్షి వీటికి ఈ పొదిగిన గూడులోనే ఆహారాన్ని అందిస్తూ పెంచుతుంది. సాధారణంగా పక్షిగూడును గూడు అనే వ్యవహరిస్తారు. ఈ పక్షిగూళ్ళు పుల్లలు, గడ్డి, ఆకులు వంటి సేంద్రీయ పదార్థాల మిళితమై ఉండవచ్చు, ఇవి రకరకాల పరిమాణాలలోను, వివిధ ఆకారాలలోను ఉంటాయి. ఇంకా రాయి, చెట్టు, లేక భవనాలలోని రంధ్రాలు కూడా గూడులుగా ఉండవచ్చు. మానవ నిర్మిత పదార్థాలైన దారం, ప్లాస్టిక్, వస్త్రం, కాగితం వంటివి కూడా ఈ గూళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తుండవచ్చు. గూళ్ళలో నివాసాల అన్ని రకాలు చూడవచ్చు. కొన్ని గూళ్ళు గుండ్రంగా ఉండగా, కొన్ని గూళ్ళు పైకప్పు లేకుండా ఉంటాయి. ...

                                               

రూఫస్ ఆర్నెరో

దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే మట్టితో చక్కని గూడు కట్టే పక్షి రూఫస్ ఆర్నెరో. మామూలుగా పక్షులు గడ్డిపరకలూ, ఎండు పుల్లలూ, ఆకులూ ఏరుకొచ్చి వివిధ ఆకృతులలో గూళ్లు కట్టుకుంటాయి. కాని ఈ పక్షి మాత్రం మట్టితో పటిష్ఠంగా గూడు నిర్మిస్తుంది. ఈ పక్షి అర్జెంటీనా జాతీయ పక్షిగా పేరు పొందింది. ఈ పక్షి కట్టే గూడు మట్టిపొయ్యిని పోలి ఉండటం వలన ఈ పక్షిని "రెడ్ ఓవెన్ బర్డ్" అంటారు. సాధారణంగా చెట్టు కొమ్మలపై గూడు నిర్మించుకునేందుకు ఇవి ముందుగా ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఆపై మెత్తని మట్టి తెచ్చి అంచెలంచెలుగా గూడును నిర్మిస్తాయి. ఇవి తమ గూడును వాతావరణం నుంచి రక్షింపబడేలా పకడ్బందీగా నిర్మించుకుంటాయి. ఇవి గూడున ...

                                               

కుందేళ్ళ పోషణలో పద్ధతులు

మన పెరడులో తక్కువ పెట్టుబడితో నిర్మించిన చిన్న గూడు లో కుందేళ్ళను పెంచవచ్చు. వేసవి కాలం, వర్షాకాలం లాంటి వాతావరణ పరిస్థితుల నుండి, కుక్కలు, పిల్లుల నుండి రక్షించుటకు గూడులను నిర్మించుట అవసరం.

                                               

ఎస్.ఆర్.భల్లం

వేకువపిట్ట భట్ట రాజుల చరిత్ర శ్రీ దేవి మహంకాళమ్మవారి పుణ్యచరిత్ర స్థల చరిత్ర నానీల సమాలోచనం చిగురుకేక నీటి భూమి జ్ఞానదర్శిని గూడు వదిలిన గువ్వలు ర్యాగింగ్ భూతం కొల్లేరు

                                               

సవారి బండి

సవారి బండి గతంలో. పల్లెల్లో బాగా జరుగు బాటున్న రైతుల వద్ద సవారి బండి వుండేది. ఇది ఒక ఎద్దుతో గాని, రెండెద్దులతో గాని నడిచేది. బండి పైన గూడు లాగ వుండి లోన కూర్చున్న వారికి నీడ నిచ్చే విధంగా వుండేది. వెదురు బద్దలతో తయారు చేసిన ఒక తడిక లాంటిది బండి పైన కప్పబడి వుంటుంది. అది బండిలో కూర్చున్న వారుకి ఎండ నుండి వర్షం నుండి రక్షణ నిచ్చేది. బండిలో చాపలు వేసి వుండేవి. మనుషుల ప్రయాణానికే ఉపయోగించే వారు. బండి తయారి కూడా అందంగా చెక్కబడి వుండేది. దానికి రంగులు వేసి వుంటుంది. దానికి కట్టే ఎద్దులకు కూడా అలంకరణ చాల బాగా వుండేది. ఎద్దుల మూతికి మూజంబరం, నడుముకు వెంట్రుకల దారం, కొమ్ములకు కుప్పెలు, కొన కొమ్ముక ...

                                               

విదితా వైద్యా

విదితా వైద్యా తల్లితండ్రులు డాక్టర్లు. ఆమె తండ్రి డాక్టర్ అశోక్ వైద్యా క్లినికల్ ఫార్మాసిస్ట్. ఆమె తల్లి రమా వైద్యా ప్రొడక్టివ్ ఎండోక్రినాలజిస్ట్. అమే తల్లితండ్రులు 70 సంవత్సరాల వయసులో కూడా వృత్తి మీద ఉన్న ఆరాధనతో అవిశ్రాంతంగా పనిచేసారు. ఆమె తాత ఆయన సోదరుడు ప్రఖ్యాతి కలిగిన గుజరాతీ నవలా రచయితలు, కవులు. కుటుంబ పరిస్థితులు విదితా వైద్యాను ప్రభావితం చేసాయి.

గూడు
                                     

ⓘ గూడు

గూడు అనగా జంతువులచే నిర్మించబడిన నిర్మాణం, ఈ గూడులలో జంతువులు సందర్భోచితంగా తనకుతాను ఉంటూ గుడ్లు పెట్టి, వాటిని పొదిగి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. గూళ్ళు అనేవి అత్యంత సన్నిహితంగా పక్షులకు సంబంధించినవిగా ఉన్నా, సకశేరుకాలలోని అన్ని తరగతుల జీవులు, కొన్ని అకశేరుకాలు గూళ్ళు నిర్మించుకుంటాయి. గూళ్ళు పుల్లలు, గడ్డి, ఆకులు వంటి సేంద్రీయ పదార్థంల యొక్క మిళితమై ఉండవచ్చు, లేదా నేలలో సాధారణ వ్యాకులత, లేదా రాయి, చెట్టు, లేక భవనాలలోని రంధ్రాలు కూడా గూడులుగా ఉండవచ్చు. మానవ నిర్మిత పదార్థాలైన దారం, ప్లాస్టిక్, వస్త్రం, కాగితం వంటివి కూడా ఈ గూళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తుండవచ్చు. గూళ్ళలో నివాసాల యొక్క అన్ని రకాలు చూడవచ్చు.

పొద
                                               

పొద

పొద ఒక చిన్నరకమైన మొక్క. ఇవి వృక్షాల కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇంచుమించు 5-6 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. సాధారణంగా వీటికి సమాన పరిమాణంలో ఉన్న చాలా కాండాలు ఉంటాయి. ఉద్యానవనాలలో విశ్రాంతి కొరకు పొదలతో కట్టబడిన చిన్న గూడు వంటి నిర్మాణాల్ని పొదరిల్లు అంటారు.విటికి మంచి ఉదాహరణ మల్లె మొక్క Jasmin

గోరింక
                                               

గోరింక

గోరింఒక రకమైన పక్షులు. ఇవి చిన్న చిన్న పురుగులని, పండ్లని, గింజలు ఆరగిస్తాయి. ఇవి కూడా కాకుల వలె మానవ సహిత జీవనాన్ని అవలంభిస్తాయి. ఇవి ఎక్కువగా కొబ్బరి, తాటి చెట్ల పై గూడు కట్టుకుంటాయి.