Топ-100
Back

ⓘ ఈమాన్ లేదా ఇమాణ్ ఇస్లామీయ ధార్మిక శాస్త్రము ప్రకారం, ఇస్లామీయ తాత్విక, ఆధ్యాత్మిక రంగంలో విశ్వాసుని విశ్వాసమే ఈ ఈమాన్. ఈమాన్ యొక్క సీదా సాదా విశదీకరణ; ఇస్లామీయ ..
ఈమాన్
                                     

ⓘ ఈమాన్

ఈమాన్ లేదా ఇమాణ్ ఇస్లామీయ ధార్మిక శాస్త్రము ప్రకారం, ఇస్లామీయ తాత్విక, ఆధ్యాత్మిక రంగంలో విశ్వాసుని విశ్వాసమే ఈ ఈమాన్. ఈమాన్ యొక్క సీదా సాదా విశదీకరణ; ఇస్లామీయ మూల ఆరు విశ్వాసాలపై విశ్వాసం ఉంచడం, వీటినే "అర్కాన్-అల్-ఈమాన్" అనీ అంటారు. వీటిని విశ్వసించని యెడల ముస్లిం సంపూర్ణ ముస్లిం కాలేడు.

ఈమాన్ అనే పదము ఖురాన్, హదీసులలో క్షుణ్ణంగానూ, విపులంగానూ విశదీకరింపబడినది. మరీముఖ్యంగా ప్రఖ్యాత జిబ్రయీల్ హదీసు లో వివరించబడినది. ఖురాన్ ప్రకారము, ఈమాన్ అనునది సత్ప్రవర్తన, సద్గుణాలు, మంచి నడవడికలు కలిగి వుండవలెను. అపుడే మోమిన్ విశ్వాసి జన్నత్ స్వర్గం లో ప్రవేశింపబడతాడు. హదీస్ ఎ జిబ్రయీల్ లో, ఈమాన్ ఇస్లాం, ఇహ్సాన్ ఈ మూడు అంశాలూ ముఖ్యమైనవే, ఇవి త్రిముఖ విశ్వాసాలూ అవసరమే.

ప్రపంచంలో శాంతి సౌభ్రాతత్వాలు వెలసిల్లాలంటే, ఇస్లాము అంతరములోనూ బాహ్యములోనూ విశ్వాసము అనెడిది చాలా ప్రాముఖ్యము గల విషయమని అనేక తత్వవేత్తలు, విద్యావేత్తలు, తర్కవేత్తలు అభిప్రాయపడుతున్నారు. విశ్వాసము, తర్కము రెండూ సమతౌల్యము పాటింపబడాలనీ అభిప్రాయపడుతున్నారు.

                                     

1. అర్థం

ఈమాన్ అనగా పరమేశ్వరునిపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం, హృదయపూర్వకంగా స్వీకరించడం, పరమేశ్వరుడి విశేష నామాలను అంగీకరించడం. ఫరాహి, ఈమాన్ గురించి ఈ విధంగా వర్ణిస్తాడు:

"ఈమాన్ యొక్క మూలం "అమ్‌న్". ఇది అనేన అర్థాలను కలిగి వున్నది. అందులో ఒకటి మూమిన్ లేదా మోమిన్, ఇది అల్లాహ్ యొక్క ఘనమైన నామాలలో ఒకటి, ఇది విశ్వాసులకు, విధేయులకు ప్రశాంతతను కల్పిస్తుంది. ఈ పదం, సనాతనమైన ధార్మిక పదజాలం. అల్లాహ్ యందు విశ్వాసం, విధేయత ప్రకటించు ప్రతి విశ్వాసికి, శ్రద్ధా బుద్ధులు ప్రదర్శించు విశ్వాసులకి ధర్మ సైద్ధాంతిక, ఆధ్యాత్మిక ఉచ్చస్థితిని కలుగజేస్తుంది. అల్లాహ్ యందు విశ్వసించి, మంచిచెడులన్నీ, కష్టసుఖాలన్నీ అల్లాహ్ తరపునుండే నని విశ్వసించడమే ఈ ఈమాన్, విశ్వాసముంచువాడే మూమిన్ లేదా మోమిన్."

                                     

2. ఇస్లామీయ ఆరు విశ్వాస ప్రకటనలు

ఆరు విశ్వాస సూత్రాలపై ఆధారపడిన మూలవిశ్వాసమే ఈ "ఈమాన్":

 • ప్రవక్తలపై విశ్వాసం
 • అవతరింపబడిన గ్రంధాలపట్ల విశ్వాసం
 • ప్రళయాంతక దినం పై విశ్వాసం
 • కదర్ విధి
 • పరమేశ్వరుడు అలాహ్ పై విశ్వాసం
 • దేవదూతలపై విశ్వాసం

పైన పేర్కొనబడిన ఆరు విశ్వాస సూత్రాలలో ఐదు ఖురాన్ లో పేర్కొనబడ్డాయి., ముహమ్మద్ ప్రవక్త "అల్లాహ్ పై విశ్వాసం, అల్లాహ్ తరపున / చే ప్రకటింపబడిన లేదా వ్రాయబడిన విధి వ్రాత పై కూడా విశ్వాసం" వుంచడము కూడా ముస్లింల విధి. ఈ విషయము హదీస్ ఎ జిబ్రయీల్ యందు ఆరు విశ్వాస సూత్రాల యందు కలదు:

"ఈమాన్ అనగా విశ్వాసం ఉంచడము; అల్లాహ్ పై, అతడి దూతలపై మలాయిక, గ్రంధాలపై, ప్రవక్తలపై, పరలోకంపై, విధివ్రాత పై.

ఇలాంటిదే ఇంకొక హదీసు;

ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ ప్రవక్తకు జిబ్రీల్ అడిగారు; సెలవివ్వండి ఈమాన్ అనగానేమి? ప్రవక్త జవాబిచ్చారు; ఈమాన్ అనగా అల్లాహ్ పై, ప్రళయదినంపై, దేవదూతలపై, గ్రంధాలపై, ప్రవక్తలపై, పరలోకంపై, స్వర్గంపై, నరకాగ్నిపై, ప్రళయదినాన లెక్కించేందుకు పాపపుణ్యాలను ఏర్పాటుచేయబడ్డ త్రాసుపై, అల్లాహ్ చే వ్రాయబడ్డ విధివ్రాతపై, మంచిదైననూ కానిదైనాననూ, వీటినన్నిటిపై విశ్వాసం వుంచడం. ఈ జవాబు విని జిబ్రీల్ "వీటినన్నిటినీ విశ్వసిస్తే ఈమాన్ వున్నట్టేనా?". ప్రవక్తగారు జవాబిచ్చారు; అవును వీటినన్నిటినీ శ్రద్ధగా విశ్వసిస్తే ఈమాన్ వున్నట్టే."

ఇవియే గాక ఈమాన్ యొక్క ముఖ్య లక్షణాలు మూడు; అల్లాహ్ పై, ప్రవక్తలపై, పరలోక వాసంపై విశ్వాసం వుంచడం.

                                     

3. ఖురాన్, హదీసులలో వర్ణన

ఖురాన్ ప్రకారం అల్లాహ్ కృప, కరుణకు నొసంగాలంటే 10 విశేష లక్షణాలుండాలి, అందులో "ఈమాన్" ఒకటి. ఖురాన్ ఈ విధంగా ప్రకటిస్తుంది: అల్లాహ్ స్మరణం ద్వారా ఈమాన్ వృద్ధి పొందుతుంది. ఖురాన్ ఇంకనూ ఇలా బోధిస్తుంది: ఒక నిజమైన విశ్వాసికి "విశ్వాసం" కన్నా ప్రియం ప్రపంచంలో మరొకటి వుండదు.

ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా హితబోధ చేశారు "ఎవరైతే మనసారా హర్షోల్లాసంతో, అల్లాహ్ ను పరమాత్మగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ ను ప్రవక్తగా స్వీకరించారో వారు ఈమాన్ విశ్వాసం యొక్క సుగంధాన్ని ఆస్వాదించారు". ముహమ్మద్ ఈ విధంగానూ బోధించారు; ఎవరైతే ముహమ్మద్ ను తన కుటుంబముకన్నా తల్లిదండ్రులకన్నా, తమ బిడ్డలకన్నా ఎక్కువగా ప్రేమిస్తారో వారే పరిపూర్ణ విశ్వాసులు". ఇంకొక సందర్భంలో అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ ల పట్ల ప్రేమాభిమానాలు గలవారికే ఈమాన్ యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించే గుణముంటుంది.

అమీన్ అహ్‌సన్ ఇస్లాహి, ఓ ప్రముఖ ఖురాన్ వ్యాఖ్యాన కర్త, ఈమాన్ యొక్క ప్రేమామృతాన్ని ఈ విధంగా వర్ణిస్తాడు:

… ప్రకృతిసిద్ధమైన ప్రేమ కేవలం తన భార్యా పిల్లల కొరకు గాని, బంధుమిత్రపరివారానికి చెందినది కాదు, మేధోపరంగాను, సిద్ధాంతాలపరంగానూ ప్రేమను వ్యక్తపరచే ఒక భావన కూడా కావచ్చు. ఇలా వ్యక్తమయ్యే ప్రేమ జీవన పరిధిలో కొన్ని వాస్తవిక విషయాలపట్లనూ కావచ్చు.

ఇస్లాహీ, మౌదూదీ లు ఇద్దరూ, ఖురాన్ యొక్క అధ్యాయం 14 నందు గల మంచి చెడుల గూర్చిన విషయాలపై విశ్లేషించారు. వీటిని విశ్వాసం, అవిశ్వాసాలుగా విశ్లేషించారు. ఈ విధంగా ఖురాన్ "ఈమాన్" యొక్క మూలాలు భూమ్యాకాశాలలో ఏవిధంగా విస్తరించి వున్నాయో విశదీకరించడానికి ప్రయత్నించారు.

ఈమాన్ అనునది, ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ ముందు మోకరిల్లి ప్రార్థించిన విధానము కూడా:

ఓ ప్రభూ! నేను నీకొరకే అంకితమౌతున్నాను, నా ప్రతివిషయాన్నీ నీకొరకే అర్పిస్తున్నాను, నీ నుండే సహాయాన్ని పొందుతున్నాను, నీ యెడలే భయభక్తులు కలిగివున్నాను, నీ దరికే చేరుటకు నామార్గాన్ని చేర్చుతున్నాను. నీనుండి వేరయి ఎక్కడనూ సహాయముగానీ, ఆసరా గానీ, నీడగానీ పొందలేను. కేవలం నీవే నాకు దరిచేర్చేవాడవు. ప్రభూ! నీ గ్రంథము ఖురాన్ యందే సంపూర్ణ విశ్వాసముంచుతున్నాను, ఏ గ్రంధమైతే నీప్రవక్త్రపై ప్రవచించి పంపావో, అందు సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తున్నాను.                                     

3.1. ఖురాన్, హదీసులలో వర్ణన ఈమాన్ కు కావలసిన అర్హతలు

జావేద్ గామిది ప్రకారం, ఖురాన్లో ఒక విశ్వాసికి కావలసిన కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఈమాన్ కు కావలసిన మూల లక్షణాలు:

 • పరిశుద్ధమైన పనులు ఆమాల్ - ఎ - సాలిహ్
 • సత్యమార్గముపై వుండడం, దానిపై సహనంతోనూ, నిష్టతోనూ వుండడం. తవాసి బిల్-హఖ్ ; వ తవాసి బిస్-సబ్ర్

అదేవిధంగా, ఈమాన్ కొరకు కావలసిన కనీసార్హతలు:

 • న్యాయసూత్రాలకు కట్టుబడి వుండడం. ఖియాం బి అల్-కిస్త్.
 • ధర్మమార్గంలో వలసలు వెళ్ళడం హిజ్రత్
 • ధర్మమార్గంలో సహాయ సహకారాలు నుస్రహ్
                                     

3.2. ఖురాన్, హదీసులలో వర్ణన ఈమాన్ యొక్క 77 శాఖలు

ఇమాం బేహకి తాను వ్రాసిన షు ఆబ్ అల్ ఈమాణ్ లో ఖురాన్, ముహమ్మద్ ప్రవక్త గారి ఉపదేశాలను దృష్టిలో వుంచుకుని ఈమాన్ కు కావలసిన ముఖ్యమైన గుణగణాలను వర్ణించాడు. ఇందులో ఈమాన్ యొక్క 77 శాఖల గూర్చి వర్ణించాడు.

ముహమ్మద్ ప్రవక్త యొక్క హదీసు ఆధారం:

అబూ హురైరా ప్రకారం ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా ఉపదేశించారు: ఈమాన్ 70 కంటే ఎక్కువ శాఖలు కలిగి వున్నది. ఈ శాఖలలో అత్యున్నతమైనది "లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ ఒక్కడే దేవుడు, అతి చిన్న శాఖ "దారిలోని ముళ్ళను తీసి పక్కకు వేసేది "., సిగ్గు బిడియం హయా అనునది ఈమాన్ యొక్క శాఖలలో ముఖ్యమైనది.

                                     

4. విశ్వాసం, కర్తవ్యాచరణలు

ఇస్లాంలో, విశ్వాసానికి, ఆచరణలకీ మధ్య సమతుల్య బంధం వుండాలి. ఫరాహి తన తఫ్సీర్ ఈ విధంగా సెలవిస్తాడు:

శీలవంతమైన ఆచరణలు ఖురాన్ లో విశ్వాసం తరువాత ప్రముఖంగా ప్రస్తావింపబడ్డాయి. విశ్వాసం మనస్సుకు సంబంధించినది. కేవలం మనస్సులో ఊహించుకన్న మాత్రాన విశ్వాసి విశ్వాసి గాలేడు. తాను ఆచరణలోనూ ఆచరించి చూపాలి. తన ఆచరణలే తన విశ్వాస పత్రాలు. కేవలం కొన్ని విశ్వాస పదాలు వల్లించిన మూలాన విశ్వాసం ప్రకటింపబడదు. ఇది కేవలం ఘోషణాపత్రం లాంటిదే. శీలవంతమైన ఆచరణలు మాత్రమే విశ్వాసిని విశ్వాసిగా ప్రకటిస్తాయి. కావున నోటితో పలకడం కాదు, ఆచరించి చూపాలి. అందుకే ఖురాన్ లో అల్లాహ్ ఈ విధంగా బోధిస్తాడు "ఓ విశ్వాసీ నీవు కేవలం నాలుకతో విశ్వాసం పలుకడం గాదు! నీ ఆచరణలతో విశ్వాసం పలుకు ".

                                     

5. ఇస్లాంలో విశ్వాసం, హేతువు

ఇస్లాంలో విశ్వాసానికి, హేతువాదానికి మధ్య సంబంధం గూర్చి అనేక వాదోపవాదాలున్నాయి. ఇదో క్లిష్టమైన విషయమే, శతాబ్దాల కాలంగా చర్చనీయాంశమే.

కాని ఇస్మాయిల్ రాజి అల్-ఫారూఖి వాదన క్రింది విధంగా వున్నది:

ముస్లిమేతరులు ఇస్లామీయ సూత్రాలపట్ల వాదించవచ్చు, కాని వారు ఈ విషయాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, ఇస్లాం కేవలం విశ్వాస హేతువులను స్థూలంగా విశ్వాసిపై రుద్దడం లేదు. ఇస్లాంలో సహేతుక, విమర్శాత్మక, సార్వజనీయ మూలాలున్నాయి. వ్యక్తిగత అభిరుచులకన్నా విషయపర అనుభవాల దృష్ట్యా ఇస్లామీయ విశ్వాసం సంపూర్ణమే.

                                     

6. కలిమాలు

ఇస్లామీయ కలిమాలు ఐదు

అవియే గాక ఈ రెండు కలిమాలూ ముస్లింల విశ్వాస ప్రకటనలుగా పరిగణింపబడుతాయి.

ఈమాన్ ఎ ముఫస్సిల్

ఈమాన్ ఎ ముఫస్సిల్, లేదా విశాల-విశ్వాస-ప్రకటన.

నేను విశ్వాసం ప్రకటిస్తున్నాను, అల్లాహ్ పై, అతడి దూతలపై, అతడి గ్రంధాలపై, అతడి ప్రవక్తలపై, ప్రళయదినంపై, అల్లాహ్ చే రచించబడ్డ విధిపై, మంచియైననూ చెడు ఐననూ అది అల్లాహ్ తరఫునేనని, మరణం తరువాత పరలోక జీవనం పై.

ఈమాన్ ఎ ముజ్మల్

ఈమాన్ ఎ ముజ్మల్ లేదా విశ్వాస ప్రకటనా వాక్కు

నాకు అల్లాహ్ పై విశ్వాసం గలదు, అతడి నామములతో, విశేషనామములతో పరిచయాన్ని, అతడి ఆదేశాలను స్వీకరిస్తున్నాను.

                                     
 • వ శ వ స స న న ష య ల అఖ ద హ ఈమ న ప ఈమ న సదర వ శ వ స గ లప ఆధ రపడ య న నద ఇస ల మ య ఐద కల మ ల త హ ద ఈమ న Meaning of Akida Map and guide
 • మ మ న అరబ బ مؤمن ల ద మ మ న ఒక అరబ బ పద ద న క మ ల ఈమ న ఇస ల మ య ధ ర మ కగ ర థ ఖ ర న ల పల మ ర ల ఉపయ గ చబడ ద ద నర థ ఆస త క డ వ శ వ స
 • ప త ర ష ర ఖ న సత యన ర యణక మ చ ప ర త చ చ ద మన న డ ప ట య ర హ ఈమ న మ ర త ల గ ల స న హమ న జ వ త గ వచ చ హ ట ప టగ న ల చ ద ఈ చ త ర హ ట
 • అనగ వ శ వ సప వ క క ప రప చమ తట గల మ స ల ల దర ఏక భవ స త కల గ వ న న ఈమ న అఖ ద హ ఇస ల ధర మ న న ఆచర చడ న క క వలస న ప రథమ వ శ వ స ఈ కల మ. క ర ద
 • అన నద ప రవక తల స ప రద య మహమ మద ప రవక త ఇల అ ట ర అన - న క హ న స ఫ ఈమ న అనగ న క హ వలన సగ వ శ వ సమ స ప ర ణమగ న వ వ హ క జ వ త క ట బ వ యవస థక
 • కవ తల గ డ వ ర శ డ ఇ ద ల ప రమ ఖమ నవ క న న ఇక కడ ఇవ వబడ డ య కన జల ల ఈమ న ఫ తర జ మ త ల ఖ ర న ఇద ఇతన ఖ ర న య క క ఉర ద తర జ మ Ĥadāyiq

Users also searched:

...