Топ-100
Back

ⓘ మానవ శాస్త్రము లేదా మానుష శాస్త్రము మానవజాతి పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం. మానవ శాస్త్రము ఒక జీవ శాస్త్రం మాత్రమే కాక ప్రపంచంలో వేర్వే ..
                                               

జీవావరణ శాస్త్రము

జీవులకు పరిసరాలకు మధ్యన ఉండే సంపూర్ణ సంబంధ వ్యూహనము- జీవావరణ శాస్త్రము. గ్రీకు భాషలో oikos అనగా ఇల్లు లేదా ఆవాసం logy అనగా శాస్త్రం లేదా అధ్యయనం అని అర్ధం. వృక్షజాతి, జంతుజాతి, మానవులు, సూక్ష్మజీవుల గురించి, అవి నివసించే ఆవాసాలు - భూమి, గాలి, మంచినీటి, సాగర జీవావరణ వ్యవస్థలు - వాటిలో శక్తి ప్రసరణ, పదార్థ వలయాలు, సజీవ, నిర్జీవ పదార్థాల మధ్య ఉండే పరస్పర చర్య మొదలైనవన్నీ ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. కొంతకాలం క్రితం వరకు దీనిని పరిసర జీవశాస్త్రం గా పరిగణించేవారు. భూగోళాన్ని ఆవరించుకొని జీవానికి ఆధారం కల్పించే పలుచని మండలాన్ని జీవగోళం Biosphere అంటారు.

                                               

నాడి (యోగా)

సుషుమ్న నాడి: మానవ శరీరమునందు 72.000 నాడులు కలవని అనేక శాస్త్రములు స్వరశాస్త్రమంజరి వివరిస్తున్నవి.ఉపనిషత్త్ లలో కుండలిని ఉపనిషద్, యోగోపనిషద్,దర్శనొపనిషద్ వంటి అనేక యొగ గ్రంథములలో కూడా వివరణ ఉంది. యోగ సాధనలోని ఆసనముల-ప్రాణాయామ పద్ధతుల ద్వారాను- ధారణ ధ్యానాదుల సాధనచేతను శరీరమందలి నాడులను శుభ్రపరచి,మూలాధారమునందు నిదురించుచున్న శక్తిని ఉత్తేజపరచ వచ్చును. ఇడ ఎడమ నాసగ్రము నందునాడి-పింగళ నాడి కుడి నాసాగ్రమునసుషుమ్న నాసాగ్రము మధ్యనకలదు. ఇడా నాడిని చంద్ర నాడి అని, పింగళనాడిని సూర్య నాడి అని కూడా చెప్పెదరు. ఈ నాడుల ఉద్దీపనను కుండలిని ఉద్దీపనము అని కూడా అనవచ్చును. ప్రాశ్ఛాత్యుల శాస్త్రము ప్రకారము మె ...

                                               

రూపనగుడి నారాయణరావు

రూపనగుడి నారాయణరావు 1881, అక్టోబర్ 28న రూపనగుడి నరసింగరావు, సీతమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడిది హరితస గోత్రము. ఇతని తండ్రి ప్రొద్దుటూరులో మెజిస్ట్రేట్‌గా పనిచేశాడు. ఇతని తండ్రి ఉద్యోగ విరమణ తరువాత బళ్లారిలో స్థిరపడి పోయినందు వల్ల ఇతని బాల్యం బళ్లారిలో గడిచింది. బళ్లారిలోని వార్డ్‌లా హైస్కూలులో విద్యాభ్యాసం జరిగింది. ఇతనికి క్రికెట్, చదరంగం అంటే ఎక్కువ ఇష్టం. ఇతడు ఎఫ్.ఎ. చదువుకొనే సమయంలో ఇతని తండ్రి చనిపోయాడు. దానితో కాలేజీ మానివేసి ఇంటి నుండి ప్రైవేటుగా ఎఫ్.ఎ.పూర్తి చేశాడు. కొన్ని రోజులు బళ్లారిలో తాలూకాఫీసులో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొంది అనంతపురం గ ...

                                               

జమ్మి కోనేటిరావు

ఇతడు 1929, మార్చి 1వ తేదీన జన్మించాడు. ఇతడు విశాఖపట్టణంకు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. తెలుగు సైన్సు రచయితల సంఘంను స్థాపించాడు. తరువాత ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ ISWA కు అనుబంధంగా మారింది. అతని భార్య పేరుమీద జమ్మి శకుంతల అవార్డును నెలకొల్పి ప్రతియేటా ఒక సైన్సు రచయితకు జాతీయ సైన్స్ దినం రోజు ఆ అవార్డును ప్రదానం చేశాడు. ఈ అవార్డును పొందిన వారిలో కె.ఆర్.కె.మోహన్, మహీధర నళినీమోహన్, ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి, బి.జి.వి.నరసింహారావు, సి.వి.సర్వేశ్వరశర్మ మొదలైనవారు ఉన్నారు. ఇతడు 80కి పైగా తెలుగులో శాస్త్ర సంబంధమైన గ్రంథాలు రచించాడు. 1954నుండి ఇతని రచనావ్ ...

                                               

మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము (పుస్తకం)

మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము అనేది సామాన్య ప్రజానీకంలో శాస్త్రవిజ్ఞానాన్ని పెంపొందించే ఒక మంచి పుస్తకం. దీనిని ఆచార్య నేమాని కృష్ణమూర్తి, ఆచార్య నేమాని రుక్మిణి సంయుక్తంగా 2001 సంవత్సరంలో రచించి ముద్రించారు.

                                               

అమర్త్య సేన్

అమర్త్య కుమార్ సేన్ భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు, పొలిటికల్ లిబరలిజం లలో చేసిన విశేష కృషికి 1999 లో నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందులకు అతనికి 1998లో ఈ బహుమతి లభించింది.

మానవ శాస్త్రము
                                     

ⓘ మానవ శాస్త్రము

మానవ శాస్త్రము లేదా మానుష శాస్త్రము మానవజాతి పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం.

మానవ శాస్త్రము ఒక జీవ శాస్త్రం మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య చారిత్రాత్మకంగా ఏర్పడిన భేదాలను కూడ తెలిపే సాంఘిక శాస్త్రం కూడా. మానవ శాస్త్రజ్ఞులు అనేక ప్రాంతాలలో పరిశోధనలు చేసి ప్రజలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారో, పూర్వం ఎలా జీవించేవారో పురావస్తు శాస్త్రము Archealogy ప్రకారంగా అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనాలు ఆధునిక నగరాల నుంచి పల్లెటూర్లు, అడవిలో నివసించే తెగల దాక విస్తరిస్తూంతాయి. వివిధ సమూహాల్లో జనం సమయాన్ని, స్థలాన్ని, జీవన శైలిని ఎలా అవగాహన చేసుకున్నారో, ఈ అధ్యయనాలు పరిశీలిస్తాయి.

అనువర్తిత మానవ శాస్త్రం Applied Anthrology అనే విభాగం సైన్సు ద్వారా తెలుసుకున్న విజ్ఞానాన్ని ప్రజలకు ఎలా ఉపయోగించాలో తెలుపుతుంది. దక్షిణ అమెరికా లో ఉత్తమమైన పురాతన వ్యవసాయ ప్రక్రియలను అధ్యయనం చేసరుద్ధానం చేయదం ఈ మధ్య ఈ శాస్త్రం సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరుగున పడిపోతున్న ప్రాచీన భాషలను నేర్చుకునే విధానాలను ఆ యా భావి తరాల వారికి అంద జేయడం కూడ ఈ విభాగం కిందికే వస్తుంది.

                                     

1. మానవ శాస్త్రంలో ఇతర విభాగాలు

  • పురావస్తు శాస్త్రం - పూర్వ కాలం లో ప్రజలు ఎలా బ్రతికారో అధ్యయనం చేసే విభాగం. ఇది ఆ యా నాగరికతల పనిముట్లు, పాత్రలు ఇతర వస్తువుల ఆధారంగా ఈ పరిశోధన చేస్తుంది.
  • వివిధ ప్రాంతాలలోని పరిసరాలకు అనుగుణంగా మానవాళి మనుగడ, శరీర భౌతిక లక్షణాలు కాలక్రమేణా లో ఎలా మార్పు చెందాయో పరిశీలించే శాస్త్రమే భౌతిక మానవ శాస్త్రం Physical Anthropology. మానవాళితో పాటుగా భౌతిక మానవ శాస్త్రజ్ఞులు జీవ పరిణామం లో పూర్వీకులైన వానర జాతులను కూడ పరిశోధిస్తారు.
  • భాషాపర మానవశాస్త్రం Linguistic Anthropology - నాగరికత పరిణామాన్ని భాష కోణంలోంచి పరిశీలిస్తుంది. పదాలు, వాటి అర్థాల కాలానుగత మార్పులు, పరిసర భాషల ప్రభావము వంటి విషయాలే కాక భాష, పదాల ఆధారంగా ప్రజల ఆలోచనాసరళి లో పరిణామాన్ని కూడ ఈ శాస్త్ర పరిధిలో అధ్యయనం చేస్తారు.
  • జనుల ప్రస్తుత జీవన విధానం, కాలానుగుణంగా కలిగిన మార్పులు, దేశకాల పరిస్థితులననుసరించి వారు వాడిన పనిముట్లు, వారి ఆహారపుటలవాట్లు ఇతరత్రా విషయాలను అర్థంచేసుకునేందుకు సాంస్కృతిక మానవ శాస్త్రం Cultural Anthropology ప్రయత్నిస్తుంది. ఈ విభాగం సామాజిక శాస్త్రం Sociology, సాంఘిక మనస్తత్వ శాస్త్రముSocial Psychology లకు దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది.

చాలామట్టుకు మానవ శాస్త్రజ్ఞులు మొదట అన్ని విభాగాలలోనూ ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించి, పోను పోను ఒకటి రెండు విభాగాలలో నైపుణ్యం సాఢిస్తారు.