Топ-100
Back

ⓘ ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. గ్రామపంచాయితీ మండలం ..
ధర్మస్థల
                                     

ⓘ ధర్మస్థల

ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. గ్రామపంచాయితీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయితీ ధర్మస్థల. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది.

                                     

1. ఆలయ ప్రత్యేకతలు

ఈ ఆలయంలోశివుడు, మంజునాథుడు, అమ్మనవరు, చంద్రనాథ, కళారాలు అనే ధర్మదైవాలు ధర్మరక్షణ దైవాలు, కుమారస్వామి, కన్యాకుమారి మొదలైన దైవాల సన్నిధులు ఉన్నాయి. అసాధారణంగా ఈ ఆలయనిర్వహణ జైన్ మతస్థుల ఆధ్వర్యంలో పూజాదికాలు హిందూ పూజారులచేత నిర్వహించబడుతూ ఉన్నాయి. నవంబరు, డిసెంబరు మాసాల మద్య నిర్వహించబడే లక్షదీపాల ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయయం సందర్శించే భక్తులసంఖ్య ఒకరోజుకు దాదాపు 10.000. ఆలయంలోని యాంత్రికమైన ఆధునిక వంటశాలలో ఆలయసందర్శనానికి వచ్చే భక్తులందరికీ వంటలు తయారుచేసి భక్తులకు రోజూ ఉచితంగా అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆలయదర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆధునిక సౌకర్యాలున్న అతిథిగృహ సౌకర్యం కూడా లభిస్తుంది. ధర్మస్థల మతసహనానికి ప్రతీక. ఈ ఆలయంలో జైనతీర్థంకరుల సేవలను ధర్మదేవతలతో మంజునాథుడు కూడా అందుకుంటున్నాడు. ఇక్కడ పూజారులు వైష్ణవబ్రాహ్మణులు. ఆలయ ధర్మకర్త హెగ్డే. ఆలయానికి చెందిన ఆశ్రమాలలో నివసిస్తున్న వారికి ఉచితభోజనం, ఉచిత బస లభిస్తుంది.

                                     

2. పురాణ ప్రశస్తి

ధర్మస్థలలోని శివలింగం గ్రామదేవత అయిన అణ్ణప్ప దైవం చేత ప్రతిష్ఠించబడిందని విశ్వసిస్తున్నారు. హెగడే కుటుంబాలకు అణ్ణప్ప దైవం అనుగ్రహమున్నదని విశ్వసించబడుతుంది.

ఒకప్పుడు హెగడే కుటుంబ సభ్యుడు శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు అణ్ణప్ప దైవం శివలింగం తీసుకువస్తానని చెప్పి అక్కడి నుండి అంతర్ధానం అయ్యాడు. మరునాడి ఉదయం నిద్రలేచి చూసే వేళకు హెగడే గృహానికి వెలుపల శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. తరువాత ఆ లింగం మంగళూరు ఆలయం లోనిదని తెలిసింది. ఆ తరువాత అణ్ణప్ప దైవం ఎవరికి కనిపించలేదు. ప్రస్తుతం ధర్మస్థల ప్రజలు అణ్ణప్ప దైవాన్ని గ్రామదేవత పంజుర్లిగా ఆరాధిస్తున్నారు. ధర్మస్థల భక్తులకు మాత్రమే కేంద్రం కాదు. ఇది పరిసర ప్రాంతాలలో విస్తారంగా ధర్మసంస్థాపన చేయడానికి కృషిచేస్తున్నది. ఇది సంఘంలో ధర్మాచరణ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషిచేస్తుంది కనుక ప్రజలు తమకు తాము చేసుకున్నట్లే ఇతరులకు సహాయం చేస్తున్నారు.

800 సంవత్సరాలకు ముందు ధర్మస్థలను మల్లర్మడిలోని కుడుమాగా గుర్తిస్తూ ఉండేవారు. తరువాత ఇది బెళ్తంగడిలో ఒక గ్రామంగా మారింది. ఇక్కడ జైన్ సైనికాధికారి బిర్మన్నా అతని భార్య అయిన అమ్ము బల్లాథితో నివసిస్తూ వచ్చాడు. వారు నిరాడంబరత, ఆరాధనీయత, ప్రేమస్పదులుగా గ్రామప్రజచే గౌరవించబడ్డారు. వారు గ్రామస్తుల పట్ల ఔదార్యం, సేవాభావం చూపిస్తూ వచ్చారు. పురాణకథనం అనుసరించి ధర్మదేవతలు ధర్మరక్షణ, ధరస్థాపన, ధర్మప్రచారం కొరకు తగిన వారిని అ న్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆరోజురాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారిజీవితాలను అ దైవాలసేవకు సమర్పించాలని ఆదేశించారు. పర్గాడే కుటుంబం వేరు ప్రశ్నవేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలు ఇచ్చి వారు వారి కొరకు వేరు గృహాన్ని నిర్మించుకున్నారు. అది ఇప్పటికీ అలాగే పాటించబడుతుంది. వారు వారి ఆరాధన, ప్రజాసేవను కొనసాగిస్తున్నారు. ధర్మదేవతలు తిరిగి పర్గాడే కుటుంబానికి కలలో కనిపించి ధర్మదేవతలు కళారహు, కళార్కయీ, కుమారస్వామి, కన్యాకుమారి అనే నలుగురు దైవాలకు విడివిడిగా ఆలయాలు నిర్మించమని ఆదేశించారు. ధర్మదేవతలు హెగడే కుటుంబానికి కలలో కనిపించి దైవవాక్కు పలకడానికి ఇద్దరు ఉన్నతవ్యక్తులను తీసుకురమ్మని అలాగే నలుగురు వ్యక్తులను హెగడేకు సహాయకులుగా నియమించమని ఆదేజించారు. దైవవాక్కు పలికే వారిని డెలాపాదిత్య, మనవొలిత్యాయ అంటారు. ప్రత్యుపకారంగా పర్గాడే కుటుంబానికి రక్షణ, విస్తారమైన ధర్మం, క్షేత్రానికి గుర్తింపు ఇస్తామని మాటిచ్చారు. పర్గాడే ఆలయాల నిర్మాణానికి నిశ్చయించారు. బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం పక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు పర్గాడే కుటుంబాన్ని కోరారు. దైవవాక్కు పలికే వారు అణ్ణప్ప స్వామిని పంపి శివలింగ ప్రతిష్ఠ జరిపించారు. అణ్ణప్ప స్వామి మంగళూరు సమీపంలోని కద్రి నుండి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించాడు. ఫలితంగా శివలింగం చుట్టూ మంజునాథుని ఆలయనిర్మాణం జరిగింది.

16వ శతాబ్దంలో దేవరాజ హెగడే ఉడుపిలోని శ్రీవాదిరాజస్వామిని ఈ ప్రదేశానికి పిలిపించాడు. అక్కడికి సంతోషంగా వచ్చిన శ్రీవాదిరాజస్వామి భిక్షస్వీకరించడానికి నిరాకరించాడు. మంజునాథుని విగ్రహం వేదవిధితో ప్రతిష్ఠించక పోవడమే అందుకు కారణం. స్వయంగా శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమని హెగడే శ్రీవాదిరాజస్వామిని కోరాడు. తరువాత శ్రీవాదిరాజస్వామి మధ్వాచార విధితో పునఃప్రతిష్ఠ చేయాడానికి అవసరమైన పూజాకార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత శ్రీవాదిరాజస్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేసాడు. ధర్మస్థల అంటే మతం, ధర్మము ఉండే ప్రదేశమని అర్థం. 600 సంవత్సరాలకు ముందు ధర్మానికి, మతానికి పడిన పునాది హెగడే కుటుంబం చేత పోషించబడి బలపరచబడింది. పర్గాడే నుండి హెగడే పదం ఆవిర్భవించింది. ప్రస్తుతం ధర్మస్థల నిస్వార్ధసేవకు చిహ్నంగా నిలిచింది.

                                     

3. అన్నదానం

ధర్మస్థలకు ఒకరోజుకు సుమారుగా 10.000 భక్తులు వస్తుంటారు. అలయదర్శనానికి వచ్చే ప్రతివెయ్యిమందిలో ఒకరిని ఆలయ ప్రధాన అతిథిగా భావించి గౌరవిస్తారు. ఈ అతిథి మర్యాదలో కులము, మతము, సంస్కృతి, అంతస్తులను వ్యత్యాసం ఎంచక గౌరవిస్తారు. పవిత్రమైన ఆలయంలో చేసే అన్నదానం భక్తుల మీద విశేషప్రభావం చూపిస్తుంది. ఆలయదర్శనానికి వచ్చే వేలకొలది భక్తులకు ప్రతి రోజూ అన్నదానం చేయబడుతుంది. ఆలయంలో ఉన్న ఆధునిక పరికరాలతో కూడిన వంటశాలలో రుచుకరమైన భోజనం పరిశుద్ధంగా తయారుచేయబడుతుంది. అన్నదానం చేసేసమయంలలో ఆలయనిర్వాహకులు పేదధనిక భేదాలు చూడరు. భూజనశాల పేరు అన్నపూర్ణ ".

                                     

4. విద్యా దానం

ధర్మస్థల క్షేత్రం ఎస్.డి.ఎం.సి.ఇ.టి సొసైటీ ద్వారా ప్రాథమిక పాఠశాల, యోగాను బోధించే గురుకులం, సంస్కృతం బోధించడం, ఇంజనీరింగ్, వైద్యం, దంతవైద్యం వంటి వృత్తి విద్యలు మొదలైన 25 విద్యాసంస్థలను నిర్వహిస్తున్నది. మంగళూరు, ఉడుపి, ధారవాడ, హాసన, మైసూరు, కర్ణాటకరాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో విద్యాసంస్థలు ఉన్నాయి. సిద్ధవన గురుకుల స్వర్గస్థులైన మంజయ్య హెగడే చేత స్థాపించబడింది. ఇది మార్గదర్శక విద్యాసంస్థగా మారింది. ఈ పాఠశాలలో 250 మంది విద్యార్థులు ఉచిత భోజన, విద్యా వసతులను సమకూర్చి యోగాను కూడా నేర్పుతున్నారు.పాఠశాల విద్యావిధానంలో సంస్కృతం బోధన అదనంగా చేర్చబడింది. ఈ పాఠశాల పాఠాలతో విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువలు బోధించబడుతుంది.

                                     

4.1. విద్యా దానం విద్యాసంస్థలు

 • నేచురోపతి ఎస్.డి.ఎం కాలేజ్, యోగా సైన్సెస్, ఉజిరే
 • ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఉజిరే యొక్క ఎస్.డి.ఎం కాలేజ్
 • మేనేజ్మెంట్ డెవలప్మెంట్, మైసూరు కోసం ఎస్.డి.ఎం ఎస్.డి.ఎం ఇన్స్టిట్యూట్
 • ఎస్.డి.ఎం పారిశ్రామిక శిక్షణ కేంద్రం, వెణూరు
 • మెడికల్ సైన్సెస్, ధారవాడ ఎస్.డి.ఎం కాలేజ్
 • ఎస్.డి.ఎం సెకండరీ స్కూల్, ఉజిరే
 • డెంటల్ సైన్సెస్, ధారవాడ ఎస్.డి.ఎం కాలేజ్
 • ఎస్.డి.ఎం లా కళాశాల, మంగళూరు
 • ఎం.ఎం.కె, ఎస్.డి.ఎం ఎస్.డి.ఎం ఉమెన్స్ కాలేజీ, మైసూరు
 • ఎస్.డి.ఎం ఆయుర్వేద హాస్పిటల్, హసన
 • ఎస్.డి.ఎం ఆయుర్వేదిక్ కళాశాల, ఉడుపి
 • రత్నమానసా విద్యార్థినిలయ, ఉజిరే
 • ఎస్.డి.ఎం కాలేజ్, ఉజిరే
 • ఎస్.డి.ఎం బి.బి.ఎం కళాశాల, మంగళూరు
 • ఇంజనీరింగ్, టెక్నాలజీ, ధారవాడ ఎస్.డి.ఎం కాలేజ్
 • ఆయుర్వేదం, హసన ఎస్.డి.ఎం కాలేజ్
 • ఎస్.డి.ఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఉజిరే
                                     

5. పురాతనవస్తు సందర్శనశాల

ధర్మస్థలకు వచ్చే యాత్రీకులు ఇక్కడ ఉన్న రెండు పురాతనవస్తు సందర్శనశాలలను తప్పక చూస్తారు. సాంస్కృతిక వారసత్వ వస్తువులను, కళాఖండాలు ఉన్నాయి. ఈ పురాతనవస్తు సందర్శనశాల రాత్రి 9 గంటలవరకు తెరిచే ఉంటుంది. రెండవది కార్ల సందర్శనశాల. ఈ ప్రదర్శనశాల ఉదయం 8.30 నుండి మద్యాహ్నం 1 గంట వరకు, మద్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరవి ఉంటుంది.

                                     

6. ఆయుష దాన

ఆరోగ్యసంరక్షణ రంగంలో వైద్యసేవాసంస్థ సేవలు అందిస్తున్నది. పరిసరగ్రామాలలో వ్యాధినివారణకు అవసరమైన వ్యాధినిర్మూలనకు అవసరమైన సేవలను కొనసాగిస్తున్నది. మలెనాడు ప్రాంతంలోని గ్రామాలకు, దూరప్రాంతాలకు అత్యవసరమైన వైద్యసేవలు అందించడానికి ఆధునిక సౌకర్యాలున్న మొబైల్ హాస్పిటలును పూజ్య శ్రీ హెగాడే చేత స్థాపించబడింది. ధర్మశాల మంజునాథేశ్వర మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్షయవ్యాధ బాధితులకు సేవలందించడానికి ఒక క్షయవ్యాధి శానిటోరియం స్థాపించబడింది. ఈ ఆసుపత్రి ఇప్పుడు జనరల్ హాస్పిటల్‌గా మారింది. ఉడుపి, హాసనలలో ఉన్న ఆరుర్వేద ఆసుపత్రులు ప్రజలకు పురాతన శైలిలో ఆయుర్వేద వైద్యసేవలు అందిస్తున్నది.మంగళూరు నేత్రావతి తీరంలో పంచభూతాల ఆధారంగా వైద్యం చేసే నేచుర్ క్యూర్ హాస్పిటల్ స్థాపించబడింది.

మంగళూరులో ఉన్న ఎస్.సి.ఎం ఆసుపత్రి ఆత్యాధునిక నేత్రచికిత్సాలయం. ఎస్.డి.ఎం పంటి ఆసుపత్రి పంటిసమస్యలకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో పెదవి చీలిక వంటి సమస్యలకు, ఎముకల సమస్యలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. శ్రీహెగాడే యోగాభ్యాసం ప్రాధాన్యతను ప్రజలవద్దకు తీసుకువెళ్ళడానికి చురుకుగా కృషిచేస్తున్నాడు. యోగాతరగతులు నిర్వహిస్తున్న ప్రదేశాలలో సూర్యనమస్కారాలు కుడా అభ్యసించబడుతున్నాయి. యోగాకేంద్రాలలో ఒక సంవత్సరానికి దాదాపు 250 మంది ఉపాద్యాయులు శిక్షణపొందుతున్నారు. ఒక్కో ఉపాద్యాయుని వద్ద సుమారు 100 విద్యార్థులు శిక్షణ పొదుతున్నారు.                                     

7. అభయదాన

1972 నుండి ఉచిత సామూహిక వివాహాలు ప్రారంభించబడి ప్రజాదరణ పొందాయి. ప్రతి సంవత్సరం వందలకొద్దీ జంటలు సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొని వివాహం చేసుకుంటారు. అన్ని మతాలు, కులాల వారు తమ ఆచారాలు, సాంప్రదాయలననుసరించి ఇచ్చట వివాహం చేసుకుంటరు. వివాహం నకు విచ్చేసిన దంపతులకు దుస్తులు, మంగళసూత్రం, విందుభోజనం పరిమిత బంధువులకు కూడా ఈ క్షేత్రంలో యిచ్చుటకు యేర్పాట్లు ఉన్నాయి.

                                     

8. హెగ్గాడే కుటుంబం

ప్రస్తుతం ధర్మస్థల క్షేత్ర పాలకులుగా 21 వ ధర్మాధికారి పీఠాన్ని పద్మభూషణ్ డా.డి వేరేంద్ర హెగ్గడే అధిష్టించారు. ఈయన 1973 నుండి ప్రారంభించబడిన సామాజిక ఆర్థిక కార్యక్రమాలైన ఉచిత సామూహిక వివాహ విధానమును వంటి వాటిని ప్రారంభించినవ్యక్తి.

1973 లో బాహుబలి విగ్రహాన్ని ఏక శిలపై చెక్కి శిల్పాన్ని తయారుచేశారు. దీనిని ధర్మస్థల దేవాలయానికి దగ్గరగా నున్న మంజునాథ ఆలయం వద్ద గల తక్కువ ఎత్తుగల కొండపై నెలకొల్పారు. దీని ఎత్తు 39 అడుగులు అనగా 12 మీటర్లు, దీని బరువు సుమారు 175 టన్నులు ఉంటుంది. ధర్మస్థల చుట్టు ప్రక్కల 25 ప్రాథమిక పాఠశాలల స్థాయి నుండి ప్రొఫెషనల్ కాలేజీలవరకు వివిధ విద్యా సంస్థలు ఉన్నాయి.పాత, బలహీనత దేవాలయాలు సంప్రదాయ నిర్మాణం సంరక్షించేందుకు, పునర్మించిన చేశారు.పురాతన లిఖిత ప్రతులు, చిత్రాలు శ్రమించి పునరుద్ధరించారు, భావితరములకు కోసం భద్రపరిచారు.పురాతన వస్తువుల కొరకు ఒక మ్యూజియం ఉంది. దీనిని "మంజూష మ్యూజియం" అని పిలుస్తారు. ఒక కారు మ్యూజియం అరుదైన వింటేజ్ కార్లను సేకరించినది ఉంది.ప్రతి సంవత్సరం సర్వ ధర్మ సమ్మేళనమును ధర్మ స్థళ వద్ద జరుపుతారు. దీనికి అనేక మంది అధ్యాత్మిక గురువులు వివిధ పీఠాల నుండి వస్తారు. కళల, సాహిత్య పోషకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ధర్మస్థల భారతదేసాంలో కొన్ని పుణ్యక్షేత్రాలలో సందర్శించే భక్తులకు ఉచిత భోజన, వసతి అందించే పుణ్యక్షేత్రము.