Топ-100
Back

ⓘ శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి తూర్పు కనుమల్లో ఒక అంతర్భాగం. తిరుపతి పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను అంజనాద్రి, గరు ..




                                               

తూర్పు కనుమలు

తూర్పు కనుమలు భారత ద్వీపకల్పపు తూర్పు సముద్ర తీరం వెంట ఉండే కొండల వరుస. ఉత్తర ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాన తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల గుండా కూడా పోతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులు - గోదావరి, మహానది, కృష్ణ, కావేరి - తూర్పు కనుమలను ఒరుసుకుంటూ, కోసుకుంటూ, ఖండిస్తూ ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ పర్వత శ్రేణులు బంగాళాఖాతపు తీరరేఖకు సమాంతరంగా నడుస్తాయి. తూర్పు కనుమలకు పశ్చిమాన, పశ్చిమ కనుమల వరకూ విస్తరించి ఉన్న ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటారు. కోరమాండల్ తీర ప్రాంతంతో సహా తీర మైదానాలు తూర్పు కనుమలకు, ...

                                               

సప్తగిరులు

తిరుమలలో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.

                                               

దక్షిణ మధ్య రైల్వే రైళ్ళు

దక్షిణ మధ్య రైల్వే తూర్పు, పడమర, భారతదేశం యొక్క ఉత్తరం నుండి బయలు దేరే రైళ్లు అనుసంధానం, ఇంటర్ కనెక్టడ్ రైల్వే మార్గం, దక్షిణ భారతదేశంకు గమ్యస్థానం, వీటి దిక్కుల మధ్య వివిధ రైళ్లు నడుపుతూ, వివిధ స్టేషన్లు బాగా అభివృద్ధి పరచడం వలన ఇది ఒక కీలకమైన జోన్‌గా భావిస్తారు. సికింద్రాబాద్ దీని ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రములలో అత్యధిక ప్రాంతము దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండగా, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతం మాత్రము తూర్పు తీర రైల్వే, విశాఖపట్నం డివిజను పరిధిలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొద్ది ప్రాంతములలో కూడా విస్తరించ ...

                                     

ⓘ శేషాచలం కొండలు

శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి తూర్పు కనుమల్లో ఒక అంతర్భాగం. తిరుపతి పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషబాధ్రి అనే పేర్లతో పిలవబడుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు ఆదిశేషుని ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, తిరుమల కొండలు ఈ పర్వత శ్రేణిలో భాగమే. ఈ పర్వతాలను 2010 వ సంవత్సరంలో జీవవైవిధ్య నెలవుగా గుర్తించారు