Топ-100
Back

ⓘ జీవితం ..
                                               

టి.ఎన్.కృష్ణన్

త్రిపునితుర నారాయణయ్యర్ కృష్ణన్ ఒక భారతీయ కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, ఇతడిని కలిపి కర్ణాటక సంగీతపు వాయులీన త్రయం గా పరిగణిస్తారు. 1992లో ఇతడికి భారత ప్రభుత్వపు మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్ లభించింది.

                                               

నోముల భగత్ కుమార్

నోముల భగత్ కుమార్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త. నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ, పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. నోముల నర్సింహయ్య వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన భగత్ కు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు జరిగే ఉపఎన్నికలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

                                               

మైలాపూర్ గౌరి అమ్మ

ఈమె 1892వ సంవత్సరంలో మద్రాసు నగరంలో ఒక దేవదాసి కుటుంబంలో జన్మించింది. ఈమె తన తల్లి దొరైకన్నామ్మాళ్ వద్ద, నల్లూర్ మునిస్వామి పిళ్ళై వద్ద తంజావూరు శైలిలో భరతనాట్యాన్ని, చిన్నయ్య నాయుడు వద్ద అభినయాన్ని, అరియకుడి రామానుజ అయ్యంగార్ వద్ద సంగీతాన్ని అభ్యసించింది. ఈమె మైలాపూర్‌లోని కపాలీశ్వర దేవస్థానంలో చివరి దేవదాసిగా సేవించింది. ఈమె భరతనాట్యాన్ని అభినయించేటప్పుడు స్వయంగా పాడేది. ఈమె తరువాత "కళాక్షేత్ర"లో చేరి నృత్యం, అభినయం నేర్పిస్తూ అనేక మంది శిష్యులను భరతనాట్య కళాకారులుగా తీర్చిదిద్దింది. ఈమె వద్ద నాట్యం నేర్చినవారిలో రుక్మిణీదేవి అరండేల్, టి.బాలసర్వతి,స్వర్ణ సరస్వతి, ఎస్.రాజం, సుధారాణి రఘుపత ...

                                               

కుమ్మ‌నం రాజ‌శేఖ‌ర‌న్

కుమ్మ‌నం రాజ‌శేఖ‌ర‌న్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మిజోరం రాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్. ఆయన తన రాజకీయ జీవితాన్ని 1970లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో సేవక్ గా మరియు సంఘ్ పరివార్ కార్యకర్తగా ప్రారంభించాడు. ఆయన 2015 నుండి 2018 వరకు భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్ష్యుడిగా భాద్యతలు నిర్వహించాడు. కేరళ రాష్ట్రం నుండి గవర్నర్ అయిన తొలి వ్యక్తి కుమ్మ‌నం రాజ‌శేఖ‌ర‌న్. ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో పాలకవర్గ సభ్యుడిగా ఉన్నాడు.

                                               

టి.కె.స్వామినాథ పిళ్ళై

ఇతడు పేరుమోసిన భరతనాట్య కళాకారిణి తిరువలపుత్తూర్ కళ్యాణి అమ్మాళ్ మొదటి కుమారుడు. ఇతని కుటుంబం తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరువలపుత్తూరు గ్రామానికి చెందిన ఇసై వెల్లాల కులానికి చెందినది. ఇతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరు కూడా భరతనాట్య కళాకారులే. ఇతని తమ్ముడు తిరువలపుత్తూర్ కృష్ణమూర్తి పిళ్ళై వయోలిన్ విద్వాంసుడు, కళైమామణి పురస్కార గ్రహీత. అతడు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎన్.సి.వసంతకోకిలం, మదురై సోము మొదలైన కళాకారులకు వాద్య సహకారం అందించాడు.

                                               

అనిల్ రాచమళ్ళ

అనిల్ రాచమళ్ళ టెక్ గురు. కరమవీర్ చక్ర పురస్కార గ్రహీత. మహిళలు, యువత, పిల్లలలో నెట్ వాడకంలో భాధ్యతాయుతమైన అవగాహనా సరళిని ప్రేరేపించడానికి ఇంటర్నెట్ ఎథిక్స్ మరియు డిజిటల్ శ్రేయస్సును ప్రోత్సహించే దిశగా ఎండ్ నౌ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి నడుపుతున్నారు.ఇది ఆసియాలోని మొదటి లాభాపేక్షలేని సంస్థ ఈయన స్పీకర్, కాలమ్ రైటర్, రేడియో జాకీ, ఇంటర్నెట్ ఎథిక్స్ & డిజిటల్ ఎక్స్‌పర్ట్, వ్యక్తిగతంగా 250 + చర్చలు, 29 వర్క్‌షాప్‌లు, 11 ఎగ్జిబిట్‌లు, 24 ప్యానెల్ చర్చలు 65 ఎఫ్‌ఎం. రేడియో టాక్ షోలు చేసారు. న్యూస్ పేపర్లలో 55 కాలమ్స్ మరియు 04 రీసెర్చ్ పేపర్లు సమర్పించబడ్డాయి.

                                               

వివేక్ (నటుడు)

వివేక్ 1961, నవంబరు 19న తమిళనాడు రాష్ట్రం, తూత్తుకుడి జిల్లా, కోవిల్‌పట్టి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి పేరు మణియమ్మాళ్. వివేక్‌కు భార్య అరుళ్‌ సెల్వి, ఒక కుమారుడు ప్రసన్నకుమార్‌, ఇద్దరు కుమార్తెలు – అమృతనందిని, తేజస్వి. 2016లో ఆయన కుమారుడు ప్రసన్నకుమార్ 13 సంవత్సరాలు మెదడు వాపు వ్యాధితో మరణించాడు.