Топ-100
Back

ⓘ వైద్యులు ..




                                               

ఇందిరా హిందుజా

పద్మశ్రీ డాక్టర్ ఇందిరా హిందూజా ఎం.డి, పిహెచ్‍డి భారతదేశానికి చెందిన పేరొందిన స్త్రీ వ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్యురాలు, సంతాన సాఫల్య నిపుణురాలు. ఈవిడ బొంబాయి లోని హిందుజా ఆసుపత్రి లో వైద్య సేవలు అందిస్తున్నారు. 1986, ఆగస్టు 6న బొంబాయి లోని కె. ఇ. ఎం. ఆసుపత్రిలో భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ఈవిడ ఆధ్వర్యంలోనే జన్మించింది.గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ అనే ప్రక్రియలో సిద్దహస్తులు. ఈ విధానం ద్వారా మనదేశంలో 1988, జనవరి 4 న భారతదేశపు మొట్టమొదటి GIFT శిశువుని జన్మింపజేశారు. అదే విధంగా సంతాన భాగ్యం లేని లక్షదాది మహిళలకు అండ దానము ప్రక్రియ ద్వారా సంతానభాగ్యం కలిగించారు. ఇదే విధానం ...

                                               

కరోలస్ లిన్నేయస్

కరోలస్ లిన్నేయస్ లేదా కార్ల్ లిన్నేయస్ స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. ఇతడు ఆధునిక ద్వినామ నామకరణానికి నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు. లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735, 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో పేరొందిన సిస్టమా నాచురే మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబ ...

గాబ్రియల్ ఫెలోపియో
                                               

గాబ్రియల్ ఫెలోపియో

ఫెలోపియస్ గా ప్రసిద్ధిచెందిన గాబ్రియల్ ఫెలోపియో, ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు. ఇతడు 16వ శతాబ్దపు ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. మానవులలో ఫలదీకరణం జరిగే ఫెలోపియన్ నాళాలు Fallopian tubes ఇతని పేరు మీదనే పిలవబడుతున్నాయి.