Топ-100
Back

ⓘ పర్యాటక రంగం ..




                                               

భీమా శంకరం

భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. ముంబాయికి 200 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు ” భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపానది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొ ...

                                               

మథుర

మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాత కాలంలోఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం. ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణిని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని. మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ...

                                               

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు.

                                               

రామనాథ స్వామి దేవాలయం

రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు మరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్, ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచే పునరుద్ధరింపబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవ ...

                                               

రామేశ్వరము

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణం రామనాథ స్వామి దేవాలయం ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరములో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.

                                               

శిల్పారామం (విశాఖపట్నం)

శిల్పరామం జాతర, ఒక కళలు, చేతిపనులు తయారుచేసిన వస్తువులు లేదా సరుకుకు నిలయం ఉన్న గ్రామం.ఇది భారతదేశం, విశాఖపట్నం నగరంలోని మధురవాడలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఇది విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి అర కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది అన్ని రకాల శిల్పనిర్మాణకళల ఉద్యానవనం. సాంప్రదాయ చేతిపనుల పరిరక్షణకు వాతావరణాన్ని సృష్టించే ఆలోచనతో ఈ గ్రామం ఉద్భవించింది. ఏడాది పొడవునా వేరువేరు తెగలకుచెందిన వారి జాతి ఉత్సవాలు ఉన్నాయి. శిల్పారామం 2009 సంవత్సరంలో హస్తకళల గ్రామంగా ప్రారంభమైంది. ఇది విశాఖపట్నం నగరంలోని మధురవాడలో ఉంది. ఇది 28 ఎకరాల 11.0000 చ.మీలో విస్తరించి ఉంది.సామాన్య ప్రజలకు సాంప్రదాయ సంస్కృతిని చూపి ...

                                               

శృంగేరి

శృంగేరి, కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి పాలిస్తున్న అంగ రాజ్యంలో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ వృత్తాంతము రామాయణము బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తిచేయుటకై స్థాపించిన శంకర మఠమును దఖ్షిణామ్నాయ మఠం అని అంటారు.

                                               

శ్రీరంగం

శ్రీరంగం, శ్రీరంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులొని తిరుచినాపల్లి కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం. కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చినమౌలానా ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు. శ్రీంరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి one of the largest temple complexes in India. దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం ...

                                               

శ్రీశైల క్షేత్రం

శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

                                               

హరిద్వార్

హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ. క్రీ.శ.1888 డిసెంబర్ 28 హరిద్వార్‌కు జిల్లా స్థాయి ఇవ్వబడింది. క్రీ.శ.2000 సెప్టెంబరు 9 హరిద్వార్ ఉత్తరఖాండ్ లో ఒక భాగమైంది. ఉత్తరాఖండ్ ఇండియన్ రిపబ్లిక్‌లో 27వ రాష్ట్రం. ఆధ్యాత్మిక క్షేత్రం నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి పథంలో ఉంది. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహా ...

...
...