Топ-100
Back

ⓘ పర్యాటక రంగం ..
                                               

జబల్ అక్దర్

జబల్ అక్దర్ కొండలు ఆల్ హజర్ పర్వత శ్రేణులలో ఉంది. ఇవి ఒమన్ లో నిజ్వా ప్రాంతంలో ఉన్నాయి. ఇవి 3000 మీటర్లు ఎత్తు కలవి. ఇవి తూర్పు అరేబియా లోనే అతి పెద్దవి. ఇక్కడ ఒమన్ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ 1957-1959 ప్రాంతంలో ఒమన్ ఆర్మీకి మరియి సౌదీ అరేబియా ప్రోద్బలంతో పోరాడిన తిరుగుబాటు దారులకు యుద్ధం జరిగింది. దీనిని జబల్ అక్దర్ యుద్ధం అంటారు.

                                               

ద్వారక

ద్వారక శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది. జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.

                                               

ద్వారకాధీశుడి ఆలయం

ద్వారకాధీశ్, ద్వారక రాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఆలయమే ద్వారకాధీశ్ అనే హిందూ దేవాలయం. గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయనిర్మాణం చారిత్మాతకమైన ద్వారకా నగరనిర్మాణం తరువాత నిర్మించబడినదని విశ్వసించబడుతున్నది. మహాభారత యుద్ధానంతరం, శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత శ్రీకృష్ణుని రాజ్యం సముద్రంలో మునిగి పోయింది. ప్రధాన ఆలయమైన జగత్ మందిర్ లేక నిజ మందిర్ ఆలయం 17 మూలస్తంభాల ఆధారంగా 5 అంతస్తులతో నిర్మించబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణం జరిగి 2.500 ఏళ్లు అయిందని అంచనా. వల్లభాచార్యుడు, విఠల్‌నాథ్‌జీ ల మార్గనిర్దేశకత్వంలో పూజాదికాలు నిర్వహించబడుతున్న ఈ ఆలయం పుష్టిమార్గ ఆలయాలలో ఒకట ...

                                               

ధర్మస్థల

ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. గ్రామపంచాయితీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయితీ ధర్మస్థల. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది.

                                               

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం విహార యాత్ర

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ విహార యాత్ర కృష్ణానది లో నీటి మార్గంలో ప్రకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను మైమర్పిస్తుంది. 8 గంటల బోటు యాత్ర చేసి శ్రీశైలం లోని మల్లిఖార్జునుడుని దర్శించుకోవటం భక్తులకు మరిచిపోలేని అనుభూతిని కల్లిస్తుంది. ప్రతి సంవత్సరం నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం 560 అడుగులకు చేరుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ లాంచీ విహార యాత్రకు ఏర్పాట్లు చేస్తారు.

                                               

నాధ్ ద్వారా

పడమటి భారతదేశంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఊరు నాధ్‌ద్వరా. ఇది అరావళి కొండలలో బనాస్ నది తీరంలో రాజసమండ్ జిల్లాలోఉన్నది. ఉదయపూరుకు ఈశాన్యంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీనాధ్‌జీ విగ్రహ ప్రతిష్ఠితమైన కృష్ణాలయము కారణంగా ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయములోని అవతార పురుషుడైన కృష్ణుడు 7 సంవత్సరాల బాలుడి విగ్రహంగా దర్శనమిస్తాడు. మథురలో పూజింపబడుతున్న ఈ విగ్రహము 1672లో మథుర సమీపంలో యమునాతటంలో ఉన్న గోవర్ధనగిరి నుండి తరలించబడి 6 మాసాల కాలం ఆగ్రాలో ఉంది. మొగలు సామ్రాజ్యాధినేత హిందూధర్మ వ్యతిరేకతా విధానాల నుండి రక్షించడానికి తరలించబడింది. నాధ్‌ద్వారా అంటే శ్రీనాధ్‌జీ ద్వారం అన ...

                                               

నాసిక్

నాసిక్ భారతదేశంలోని మహారాష్ట్రలో ఒక పట్టణం, జిల్లా కేంద్రం. ఇది బొంబాయి, పూణే లకు 180, 220 కి.మీ. దూరంలో పడమటి కనుమలలో దక్కను పీఠభూమికి పడమటి అంచున ఉంది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాసిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం. త్వరగా అభివృద్ధి చెందుతున్న నాసిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు 2006 అంచనా.

                                               

నైమిశారణ్యం

నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం. నైమిశారణ్యం Naimisha Forest వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి నైమిశారణ్యానికి దాద ...

                                               

బద్రీనాథ్

బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న పంచాయితీ. చార్ ధామ్ లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ (6.560 మీటర్లు8 శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

బాహుబలి

ఇదే పేరుతో ఉన్న చలనచిత్రం గురించి బాహుబలి:ద బిగినింగ్ చూడండి మూస:Jainism జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ పోదనపురం రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్‌ ధర్మం అనీ, మౌర్యుల కాలంన ...