Топ-100
Back

ⓘ పర్యాటక రంగం ..
                                               

అయోధ్య

అయోద్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్యపట్టణం. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆ విస్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా లోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది. అయోధ్య సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసలరాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.

                                               

అలహాబాదు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగరమే ప్రయగ్ రాజ్.ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్. ప్రయగ్ రాజ్ జిల్లాకు ఇది ప్రధానకేంద్రం. ఉత్తరప్రదేశ్ నగరాలలో జనసాంద్రతలో అలహాబాద్ 7వ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి అలహాబాద్ నగరం, జిల్లా ప్రాంతంలో జనసంఖ్య 17.4 లక్షలు. ప్రపంచంలో అత్యంతవేగంగా అభివృద్ధిచెందుతున్న నగరాలలో అలహాబాద్ 130వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబద్ అతిపెద్ద వాణిజ్యం కేంద్రం, తలసరి ఆదాయంలో 2వ స్థానం, జి.డి.పిలో మూడవస్థానంలో ఉంది అని భావిస్తున్నారు. అలహాబాదు నగరానికి ప్రధానమంత్రుల నగరమన్న ఖ్యాతి ఉంది. భారతదేశ 13 మంది ప్రధానమంత్రులలో 7 మంది ప్రధానమంత్రులు అలహాబాదు వాసులే. వీర ...

                                               

ఉజ్జయిని

ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖ పట్టణం. నేటికీ ఇది ప్రముఖ పట్టణమే. దీనికి ఇతర పేర్లు: ఉజ్జైన్, ఉజైన్, అవంతీ, అవంతిక. మధ్య భారత మాళ్వా ప్రాంతంలో మధ్య ప్రదేశ్లో గలదు. ఉజ్జయిని ఒక జిల్లా, డివిజన్ కూడానూ. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట 12 ఏండ్లకు ఒక సారి కుంభమేళా జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు. రుద్ర సాగర్ అని సరస్సు వైపు, ఒక మూడు అంతస్తుల ఆలయం ఉంది.

                                               

ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం

ఓంకారేశ్వరం భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో Mortakka నుండి సుమారు 12 మైళ్లు దూరం లో వుంటుంది. ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఒకటి ఇక్కడ ఉంది. రెండుకొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది మరియు ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడికి అంకితం హిందూ మతం ఆలయం. ఇది శివున్ని గౌరవించే జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. ఇది నర్మదా ...

                                               

కాశీ

కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి వారణాసి అని అంటుంటారు అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులక ...

                                               

గురువాయూరు

గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం, పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్, ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయూరు గా నిర్ణయించారు. పాతాళశిల! ఐదువేల సంవత్సరా ...