Топ-100
Back

ⓘ ఢిల్లీ తెలుగు అకాడమీ. 1990 లో స్థాపించబడిన ఢిల్లీ తెలుగు అకాడమీ తెలుగు భాషా సంరక్షణ, తెలుగు సంస్కృతి వ్యాప్తికి కృషి చేసే ఒక జాతీయ సాంస్కృతిక సంస్థ. ఢిల్లీ, ఆ చ ..
                                               

సాహిత్య అకాడమీ

సాహిత్య అకాడమీ భారతదేశానికి చెందిన ఒక సంస్థ. సాహిత్య పోషణకు, సహకారానికి, ప్రోత్సాహం కొరకు స్థాపించబడింది. భారతీయ భాషలలో ప్రముఖంగా సేవచేసిన వారికి ఇది సన్మానిస్తుంది. దీనిని మార్చి 12 1954, న స్థాపించారు. దీని నిర్వహణ భారత ప్రభుత్వం చేపడుతున్నది. సాహిత్య అకాడెమీ, సెమినార్లు, వర్క్‌షాపులు, సమావేశాలు, సదస్సులు చేపడుతుంది. పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. రచనలకు, ముద్రణలకునూ ప్రోత్సాహకాలనిస్తుంది. పురస్కార గ్రహీతలకు రూ. 50.000 లు బహుమానం ప్రకటిస్తుంది. దీని గ్రంథాలయం, భారత్ లోనే అతిపెద్ద బహుభాషా గ్రంథాలయం. రెండు, ద్విమాస పత్రికలు ప్రచురిస్తూవున్నది, అవి -- భారతీయ సాహిత్ ...

                                               

ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు

ఎన్. టి. ఆర్. జాతీయ అవార్డు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానటుడు, మహానాయకుడు అయిన ఎన్.టి.రామారావు పేరిట 1996లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అవార్డును నెలకొల్పింది. దేశంలోనే అత్యధికంగా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ఈ జాతీయ అవార్డును యావద్భారత చలన చిత్ర రంగంలో మేరునగసమానాధీశులైన వారికి ప్రదానం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ అవార్డును అందుకున్న ప్రముఖులలు 1998 - శివాజీగణేశన్ 2002 - రాజ్‌కుమార్ 2005 2003 1999 - లతా మంగేష్కర్ 2000 - హృషికేశ్‌ ముఖర్జీ 1997 - దిలీప్ కుమార్ 2004 1996 - అక్కినేని నాగేశ్వరరావు 2001 - భానుమతీ రామకృష్ణ 2006 - వహీదా రెహ్మాన్

                                               

ఎస్. వి. రామారావు

ఎస్.వి.రామారావు ఫిబ్రవరి 2 1940 న కామేశ్వరమ్మ, చంద్రమౌళి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగి, రంగస్థల నటుడు.తండ్రి ద్వారా నాటకరంగం పట్ల ఆసక్తిని అందుపుచ్చుకున్న ఆయన ఉన్నత పాఠశాలలో ఉండగానే "తారుమారు" అనే నాటకాన్ని రచించి, స్కూల్ మేట్స్ తో కలసి ప్రదర్శించారు.అప్పటి నుండి నాటకం ఆయన జీవితంలో ఒక భాగంగా మారింది.చిన్నతనంలో తన తల్లి కామేశ్వరమ్మతోపాటు సినిమాలు చూసేవారు. ఊహ వచ్చినప్పటి నుండి ఆ సినిమా కథ, కథనం పాత్రల చిత్రీకరణ పై చర్చించేవారు. ఆ విధంగా ఆయనకు నాటకం, సినిమా రెండు కళ్ళులా మారాయి. 1960 సంవత్సరంలో ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల నుండి పట్టా పొందారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, మురళీ మోహన ...

                                               

నిఖిలేశ్వర్

అసలు పేరు కుంభం యాదవరెడ్డి. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్‌ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.

                                               

ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ

ఇతడు 1929 సెప్టెంబరు 17వ తేదీన రాజమండ్రిలో మామిళ్ళపల్లి సోదెమ్మ, కొండయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. ఇతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించగా అన్నగారి పోషణలో పెరిగాడు. చాలా చిన్నవయసులోనే నాదస్వర విద్వాంసుడు జి.పైడిస్వామి వద్ద గాత్రాన్ని అభ్యసించాడు. అతి స్వల్ప కాలంలోనే సంగీతవిద్యను సాధించి స్వశక్తితో స్వయంగా సాధన చేసి కీర్తి గడించాడు. కచేరీలు చేసే ప్రథమ దశలోనే ఇతడు తిరుపతి వెంకట కవులచే "ఆంధ్రబాల గాయకరత్న" అనే బిరుదును, క్రోవి సత్యనారాయణచే "మధుర గాయక" అనే బిరుదును సంపాదించాడు. ఇతడు తిరుచునాపల్లి, మద్రాసు, విజయవాడ, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రాలనుండి కొన్ని దశాబ్దాలపాటు సంగీత కార్యక్రమాలలో ...

                                               

సత్యమూర్తి

సత్యమూర్తి గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని "సత్యమూర్తి"ని కలంపేరుగా ధరించి, తెలుగు పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యాడు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర చదువుల్రావు ఇతడి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నాడు.

                                     

ⓘ ఢిల్లీ తెలుగు అకాడమీ

1990 లో స్థాపించబడిన ఢిల్లీ తెలుగు అకాడమీ తెలుగు భాషా సంరక్షణ, తెలుగు సంస్కృతి వ్యాప్తికి కృషి చేసే ఒక జాతీయ సాంస్కృతిక సంస్థ. ఢిల్లీ, ఆ చుట్టుప్రక్కల నగరాలలో నిత్యం పెరుగుతున్న తెలుగు ప్రజలకి ఈ సంస్థ వినోద కార్యక్రమాలను అంద జేస్తుంది. తెలుగు భాషను, విభిన్నమైన తెలుగు సంస్కృతిని, తెలుగు ప్రజల గుర్తింపును ఈ సంస్థ వృద్ధి చేస్తుంది. దేశ రాజధానికి, రాష్ట్ర రాజధానికి సాంస్కృతిక వారధి లా పనిచేయటానికి హైదరాబాదు లో కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ముఖ్యమైన పండుగలను జరుపుతుంది. సంగీత/నృత్య/రంగస్థల రంగాలలో గుర్తించిన ప్రాంతీయ ప్రతిభను వెలికితీయటంతో బాటు ఇతర ప్రదేశాల నుండి అనుభవము కలవారిని పిలిపిస్తుంది. భారతీయ, విదేశ సాంస్కృతిక సంస్థలతో సత్సంబంధాలను పెంపొందించుకొంటుంది. విద్య, శాస్త్రీయ, సాంకేతిక, వ్యాపార, అర్థ శాస్త్ర రంగాలపై ఇష్టాగోష్టులు నిర్వహిస్తుంది. పేద విద్యార్థులకు ధన సహాయాన్ని అందిస్తుంది. ఉచిత వైద్య పర్యవేక్షణ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది. విధార్థులకు సంగీత, వ్యాస రచన, చిత్ర లేఖన పోటీలను నిర్వహిస్తుంది. నెలకు రెండు సార్లు తెలుగు చలన చిత్రాలను ప్రదర్శించటమే కాక వార్షిక చలనచిత్రోత్సవాలు, విహార యాత్రలు, సమావేశాలను నిర్వహిస్తూ, రాష్ట్రావతరణ దినోత్సవాలకు తన వంతు చందాలను అంద జేస్తుంది.

సంఘ సేవ, కళలు, సాంస్కృతిక రంగాలలో సృజనాత్మకత కనబరచిన వారికి జాతీయ బహుమతులను అందజేస్తుంది. ఈ సంస్థ అందజేసే విశాల భారతి బహుమానాలు విదేశీ భారతీయులలో విశేషాదరణ చూరగొన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్థను రాష్ట్రం వెలుపల నుండి ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించే ఉత్తమ సంస్థ గా గుర్తించినది.

                                               

రఘుపతి వెంకయ్య అవార్డు

తెలుగు చలనచిత్రజగతికి పితామహుడు అయిన రఘుపతి వెంకయ్య పేరిట ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 1980లో ఓ అవార్డును నెల కొల్పి, తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన వారికి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌గా ప్రదానం చేస్తోంది. గ్రహీతలు