Топ-100
Back

ⓘ పాత్రలు ..




                                               

కణ్ణగి

కణ్ణగి దక్షిణ భారత కావ్యం అయిన శిలప్పదికారం లోని ముఖ్య పాత్ర. మధురై రాజు పొరబాటుగా తన భర్త కోవలన్ పై మరణ దండనని విధించటంతో ఆ పట్టణాన్ని దౌర్భాగ్యం ఆవహించే విధంగా శపిస్తుంది.

                                               

పేరడీ

అనుకరణ లేదా పేరడీ ఒక నాటకం, సినిమా లేదా ఒక వ్యంగ్య అనుకరిస్తున్న రూపొందించిన ఒక సృజనాత్మక కృతి వ్యాఖ్యానించగలరో / లేదా తయారు సరదాగా ఉంటుంది దాని వ్యంగ్య లేదా వ్యంగ్య అనుకరణ ద్వారా విషయం. దాని విషయం అసలు రచన లేదా దానిలోని కొన్ని అంశాలు - బొమ్మలు / కధలు కానీ, రచయిత, శైలి మొదలైనవి. ఒక పేరడీ నిజ జీవిత వ్యక్తి, సంఘటన లేదా ఉద్యమం గురించి కూడా ఉంటుంది. సాహిత్య విద్వాంసుడు ప్రొఫెసర్ సైమన్ డెంటిత్ అనుకరణను "మరొక సాంస్కృతిక ఉత్పత్తి లేదా అభ్యాసం సాపేక్షంగా వివాదాస్పదమైన అనుకరణను అందించే ఏదైనా సాంస్కృతిక అభ్యాసం" అని నిర్వచించారు. సాహిత్య సిద్ధాంతకర్త లిండా హట్చోన్ "పేరడీ.ఒక అనుకరణ, అదీ పెద్ద సహా కళన ...

                                               

బుడుగు

బుడుగు, ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు, బాపు బొమ్మల ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును. ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం ముందుమాట తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది.

                                               

వీరబొబ్బిలి (పాత్ర)

వీరబొబ్బిలి ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కె.ఎన్.వై.పతంజలి రాసిన పలు నవలల్లోని కాల్పనిక పాత్ర. రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు నవలల్లో వీరబొబ్బిలి ఒక ముఖ్యమైన పాత్ర. వీరబొబ్బిలి పాత్ర ఒక మాట్లాడే కుక్క. భేషజాలకు పోయి బొబ్బిలి పాత్ర వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ పండిస్తుంది. వీరబొబ్బిలి కావడానికి కుక్కే అయినా మనుషుల్లో జమకట్టుకుంటుంది. పైగా తాను మేలైన కుక్కననీ, మహాజాతైన కుక్కననీ, తాండ్రపాపారాయుడి వారసులింట పుట్టినదాన్ననీ గొప్పగా చెప్పుకుంటుంది.

                                               

ధర్మారావు (పాత్ర)

ధర్మారావు విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలలోని ప్రధాన పాత్ర. ధర్మారావు పాత్రను విశ్వనాథ సత్యనారాయణ నవలలోని ప్రతీకాత్మకమైన పాత్రలకూ, వాస్తవికమైన పాత్రలకూ నడుమ లంకెగా రాశారు. విశ్వనాథ సత్యనారాయణ స్వయంగా తన వ్యక్తిత్వాన్ని, భావాలని తీసుకుని తనకు ప్రతిరూపంగానే ధర్మారావు పాత్రను తీర్చిదిద్దినట్టు సాహిత్యలోకంలో ప్రతీతి. పాత్రను అభిమానించినవారూ, ఖండించినవారూ, వ్యతిరేకించినవారూ కూడా కొల్లలుగానే ఉండడంతో ధర్మారావు పాత్ర చుట్టూ విస్తృతమైన చర్చ జరిగింది.