Топ-100
Back

ⓘ భాషాశాస్త్రం ..




                                               

భాషా కుటుంబము

భాషా కుటుంబము అంటే ఒక ప్రాచీన భాష కాలంతోటి మారిపోయి కొత్త భాషలకు సృష్టిస్తుంది. ఈ భాషలు ఒకే భాష నుంచి వచ్చాయి కాబట్టి వీటిటిని భాషా కుటుంబము అని భాషావేత్తలు పిలుస్తారు. ఆ కుటుంబానికి మూలమైన భాషను ఆది భాష అని ప్రోటో లాంగ్వేజ్ అనీ పిలుస్తారు. ఎథ్నోలోగ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 142 భాషా కుటుంబాల్లో 7.117 జీవిస్తున్న భాషలున్నాయని అంచనా వేసారు. ఒక మానవ సమూహం తమ దైనందిన జీవితంలో సంభాషించేందుకు వాడే భాషను జీవిస్తున్న భాష అంటారు. అనేక మృత భాషలు కూడా ఉన్నాయి. వీటిని మాతృభాషగా కలిగిన మానవ సమూహాలేమీ లేవని అర్థం. అలాగే కొన్ని లుప్త భాషలు కూడా ఉన్నాయి. మాట్లాడే ప్రజలూ లేనివి, వారసత్వ భాషలు కూడా లేనివి ...

                                               

మణిప్రవాళము

దక్షిణదేశ భాషలలో మలయాళ భాష యందు మణిప్రవాళ భాష ఒక కావ్యశైలి. ఇందు అనేక ఉద్గ్రంధములు రచించబడినవి.మలయాళ సాహిత్య చరిత్రమునందు మణిప్రవాళయుగము ఒక స్వర్ణయుగముగా భావించబడుచున్నది. మణిప్రవాళము మలయాళమునకు విలక్షణమైన ఒక కావ్యభాషాభేదము.ఇది నిలువ ద్రొక్కుకొనుటకు కొన్ని చారిత్రక సాంఘిక పరిస్థితులు కారణములుగా పేర్కొనబడుచున్నవి. ఇది సంస్కృతము, మలయాళముల మిశ్రభాష. 1972 భారతి మాస పత్రిక. వ్యాసము: మణిప్రవాళ భాష. వ్యాసకర్త: తిమ్మావజ్జల కోదండ రామయ్య.