Топ-100
Back

ⓘ విజ్ఞానం. అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరిగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉ ..
                                               

శాస్త్రవేత్త

ఒక క్రమ విధానంలో విజ్ఞానాన్ని అర్జించే కృషి చేసే వ్యక్తిని శాస్త్రవేత్త లేదా శాస్త్రజ్ఞుడు అని విస్తారమైన అర్ధంలో అనవచ్చును. లేదా వివిధ తాత్వికతలలో ఏదో ఒక విధానంతో గట్టి అనుబంధం ఉన్న వ్యక్తి కూడా శాస్త్రవేత్త అవుతాడు. కాని, సాధారణ పరిమిత వినియోగంలో శాస్త్రీయ విధానం అనుసరించి ఒక విషయాన్ని అధ్యయనం చేసే వ్యక్తి శాస్త్రవేత్త. అలాంటి వ్యక్తి ఏదో ఒక శాస్త్రంలో నిష్ణాతుడు అయి ఉండే అవకాశం ఉంది. ఇది వరకు పాశ్చాత్య దేశాలలో "natural philosophers", "men of science" అనే పదాలను సుమారు ఒకే అర్ధంలో వాడేవారు.; వీరు విజ్ఞానం knowledgeతో అనుబంధం కలిగిన వ్యక్తులు. 1833లో William Whewell అనే వ్యక్తి "సైంటిస్ట్ ...

                                               

ధర్మపాలుడు

క్రీ.శ. 6 వ శతాబ్దానికి చెందిన ధర్మపాలుడు యోగాచార సంప్రదాయానికి చెందిన గొప్ప బౌద్ధ పండితుడు. తత్వవేత్త. నలందా విశ్వవిద్యాలయానికి మొదటి కులపతి. ప్రసిద్ధ బౌద్ధ న్యాయపండితుడు అయిన భావవివేకుని సమకాలికుడు. ధర్మపాలుని శిష్యులలో శీలభద్రుడు, చంద్రకీర్తి ప్రసిద్ధులు.

                                               

స్వాతి మాసపత్రిక

స్వాతి సచిత్ర మాసపత్రిఒక తెలుగు మాసపత్రిక. దీని ప్రధాన సంపాదకుడు వేమూరి బలరామ్. ఇది విజయవాడ నుండి ప్రచురించబడుతుంది. 2009 సంవత్సరంలో దీని 39వ సంపుటి నడుస్తుంది. ప్రతి నెల ఒక నవలను అనుబంధంగా పాఠకులకు అందిస్తారు.

                                               

కోట వేంకటాచలం

కోట వేంకటాచలం సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, చరిత్ర పరిశోధకులు, విమర్శకులు. వీరు నూజివీడు తాలూకాలోని మధునాపురంలో చల్లా సుబ్బారాయుడు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. చల్లావారి ఇంటిలో పుట్టినా కోటవారికి దత్తత వెళ్ళారు. వీరిని దత్తత తీసుకొన్న దంపతులు: కోట నిత్యానందం, లక్ష్మీదేవమ్మ. వీరు సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు; ఖగోళశాస్త్రంలో విశేషకృషి చేసారు. వాని ఆధారంగా భారతీయ చరిత్రను పునర్నిర్మించారు. సృష్టి ఆరంభం మొదలగు విషయాలలో పాశ్చాత్య విద్వాంసుల కాలగణనం, వారు వారు కూర్చిన భారతదేశ చరిత్ర సరైనవి కావని విమర్శించారు. మన పురాణాలలోనే భారతదేశ వాస్తవచరిత్ర దాగివుందని వీరి సిద్ధాంతం. ఆర్య విజ్ఞానం ...

                                               

వసంతరావు వేంకటరావు

ఈయన 1909, ఫిబ్రవరి 21 వ తేదీన జన్మించాడు. తండ్రి పేరు తాతారావు. విజయనగరం మహారాజ కాలేజీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య ఎం.యస్సీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం వద్ద భౌతిక శాస్త్ర ప్రయోగ శాలలో కొంతకాలం శిక్షణ పొందాడు. మహారాజా కళాశాల, విజయనగరంలో 1935లో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరి, పదోన్నతులను పొందుతూ ప్రిన్సిపాల్ గా 1956-69 పదవీవిరమణ చేశాడు.

                                               

స్వాతి వారపత్రిక

స్వాతి సపరివార పత్రిక తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1984 సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ నుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005జాతీయ చదువరులసర్వే ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి ఉంది.

                                     

ⓘ విజ్ఞానం

అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరిగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న కచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం, జ్ఞానంల కలయికతో ఏర్పడినదే విజ్ఞానం.