Топ-100
Back

ⓘ మతాలు ..
                                               

ఎపిక్యూరియనిజం

ఎపిక్యూరియనిజం. సుఖ జీవన వాదం. క్రీస్తు పూర్వం 341-270 సంవత్సరాల మధ్య గ్రీసు దేశంలో జీవించిన తత్త్వవేత్త ఎపిక్యూరియస్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎపిక్యూరియనిజం. ప్రతి వ్యక్తీ సుఖమయమైన జీవితాన్నే కోరుకొంటాడు. ఐతే, మనస్సుకూ, శరీరానికీ హాయి కలిగించే సత్‌ ప్రవర్తనతో కూడిన జీవితమే సుఖాన్ని ఇస్తుందని ఆయన భావం. సుఖంగా ఉండటం అంటే ‘తినడం, తాగడం, తిరగడం’ అని అర్థం వచ్చేలా ఎపిక్యూరియస్‌ వాదానికి వ్యాఖ్యానాలు కొన్ని వచ్చాయి. కాని, అవన్నీ ఆయన ఆదర్శాన్నీ, ఆశయాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని వ్రాసిన వ్యాఖ్యానాలేనని పలువురు మేధావులు స్పష్టం చేశారు. ఏదైనా ఒక పదార్థాన్ని తింటే గానీ, తాగితేగాని రేపు తలనొప్పి వస్ ...

                                               

కన్ఫ్యూషియస్ మతం

కన్ఫ్యూసియనిజం. రెండు వేల సంవత్సరాలకు పైగా చైనీయులను ప్రభావితం చేస్తున్న ఒక మతం, ఒక జీవన విధానం, ఒక ఆలోచనా సరళి. కన్ఫూసియ నిజం ఒక వ్యవస్థీకృత మతంగా కంటే ఒక జీవన విధానంగా, ఒక నైతిక ప్రవర్తన నియమావళిగా చైనా జాతిని తీర్చిదిద్దింది. ఈ మతం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్. ఇది లాటిన్ భాషలో ఉచ్చారణ. చైనీస్ భాషలో ఈ పదాన్ని ‘కంగ్‌ ఫూ జా’ అని పలకాలి. ఈ పదాలకు అర్థం పరమ గురువు కంగ్‌ అని. ఆయన జీవించినది క్రీ. పూ. 551 నుంచి 479 వరకు. కాని ఎందరు పాలకులు మారినప్పటికీ నాటికీ నేటికీ కన్ఫ్యూసియస్‌ సిద్ధాంతాలకు విలువ తగ్గలేదు. వ్యక్తి వికాసం మొదలు ఆదర్శ విశ్వసమాజ నిర్మాణం వరకు వివిధాంశాలపై కన్ఫ్యూసియస్‌ చెప్పిన స ...

                                               

జొరాస్ట్రియన్ మతం

జొరాస్ట్రియన్ ఇరాన్ దేశానికి చెందిన ప్రాచీన మతం. ఈ మతాన్ని "మజ్దాయిజం" అనికూడా అంటారు. దీనిని జొరాస్టర్ స్థాపించారు. ఈ మతంలో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతం ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయిలో ఎక్కువగా నివసిస్తున్నారు. జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే వారిని జొరాస్ట్రియన్లు అని అంటారు. ఈ మతం క్రైస్తవ మతాలకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్ట్రియన్ల మత గ్రంథమైన అవెస్తా Avesta లో దేవుడి పేరు ఆహూరా మజ్దా Ahura Mazda.

                                               

బహాయి విశ్వాసము

బహాయిజం లేదా బహాయి విశ్వాసము, ఈ విశ్వాస స్థాపకుడు బహావుల్లా. ఇతను పర్షియా, 19వ శతాబ్దం నకు చెందినవాడు. ప్రపంచంలో ఈ విశ్వాసులు 60 లక్షలమంది, 200 కి పైగా దేశాలలో వ్యాపించియున్నారు. బహాయి విశ్వాసం ప్రకారం, మొత్తం మానావాళి ఒకేజాతి, ఇబ్రాహీం, మూసా, జొరాస్టర్, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు, ఈసా, ముహమ్మద్, ఆఖరున బహావుల్లా వీరందరూ ప్రవక్తలు. బహావుల్లా పేరు మీద ఈ విశ్వాసానికి బహాయి విశ్వాసమని, ఈ విశ్వాసాన్ని కలిగివున్నవారికి బహాయీలు అని వ్యవహరిస్తారు. బహాయిజం ఇరాన్‌ రాజధాని టెహరాన్‌ నగరంలో క్రీ.శ. 1863లో ప్రారంభమైన మతం. దీని వ్యవస్థాపకుడు మీర్జా హుసేన్‌ అలీ నూరి Mirza Hoseyn Ali Nuri. ఆయన ఒక వజీరు కు ...

                                               

బౌద్ధ మత గ్రంధములు

పాళీ అనగా గీత, లేక హద్దు అని అర్ధము. కాలక్రమమున ఆ అర్ధముపోయి పాళీ అనగా వాక్యము, మతపుస్తకము, పవిత్ర గ్రంథము అని వ్యవహరింపబడెను. అందువలన పవిత్ర గ్రంథముల వ్యాఖ్యాన, టీకాతాత్పర్యములను పాళీ అను పిలిచెడివారు. తరువాత బౌద్ధమతగ్రంథములు వ్రాయబడిన భాష అంతయు పాళీ అని పిలువబడెను. సిలోన్, బర్మా దేశములలో నివసించు బౌద్ధ మతస్థుల మత గ్రంథములు తిపిటిక మను పేరుతో వ్యవహరింపబడుచున్నవి. తక్కిన చక్కని శైలి గల పురాణభాషలవలె పాళీ భాషయొక్క శైలి కుదుటపడినది కాదు. పాళీ భాషకు నిస్పష్టమైన క్రమతలేదు. పాళీ భాష ప్రాకృత భాషలలో పురాతనమైనప్పటికిని, ఇది కొసవరకును పవిత్రమైనదిగా నుండక సంకరమైనది. ప్రాకృతభాషలతో మిళితమై ఇది ముఖ్యముగ ...

                                               

భారతదేశంలో మతములు

భారతదేశంలో మతములు: భారతదేశపు జనాభాలో హిందూ మతమును అవలంబించువారు 80% గలరు. భారత్ లో రెండవ అతిపెద్ద మతము ఇస్లాం జనాభాతో యున్నది. ఇతర భారతీయ మతములు బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతమును అవలంబించు వారు 3% జనాభాకన్నా తక్కువ గలరు. భారత్ లోని 2% జనాభా క్రైస్తవ మతమును అవలంబించుచున్నది.

                                               

మతము

మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు అని ఒక భావన. మతం అంటే యేమిటో నిర్వచించటం కష్టం. మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం అసాధ్యం. ఎందుకంటే నిర్వచనం జ్ఞానానికి ఆది, తుది. పైగా అన్ని మతాలకు సమానంగా అనువర్తించే నిర్వచనం అసలు సాధ్యమే కాదు. "అతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణే మతం" అన్నారు కొందరు. ఆ అతి ప్రాకృతిక శక్తులు దేవత కావచ్చు, దయ్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అయితే ఈ దేవత దయ్యాలు అన్ని మతాలకు సామాన్యం కావు. ఉ ...

                                               

మాయా మతం

మాయా మతం. మెక్సికో, గ్వాటెమాలా మొదలైన సెంట్రల్‌ అమెరికా దేశాలలో క్రీస్తు శకం 200 నుంచి 900 సంవత్సరాల వరకు వర్ధిల్లిన ప్రాచీన మతాలలో ఒకటి ‘మాయా’. విగ్రహ పూజలు, బహుదేవతారాధన, దేవతలకు బలులు ఇవ్వడం తదితర ఆచారాలు అనేకం ఉన్నాయి. మంచి భవనాలను కట్టడంలో ఈ జాతికి అద్భుతమైన అనుభవం ఉన్నట్లు కనిపిస్తుంది. ఖగోళ విజ్ఞానం ఉన్నందు వల్ల తమ సంవత్సరాలూ, నెలలు, రోజుల లెక్కలను తమదైన పద్ధతిలో రూపొందించు కొన్నారు. 260 రోజుల కాల చక్రాన్ని ఏర్పరచుకొని, తమ పండుగలు పబ్బాలను అందుకు అనుగుణంగా నిర్ణయించుకొన్నారు. స్పెయిన్‌ ఆక్రమణకు పూర్వం అక్కడ వర్ధిల్లిన మతాలను, కొత్తగా వచ్చిన క్రైస్తవంతో కలుపుకొని, కలగాపులగం సంస్కృతిన ...

                                               

షింటో మతము

షింటో అనే పదానికర్థం "దేవతల మార్గం" అని. భౌద్ధం నుంచి ఈ మతాన్ని వేరుగా గుర్తించటానికి ఆరవ శతాబ్దంలో ఈ పదం సృజింపబడింది. ఇది చైనా భాష నుండి వచ్చిన పదం. దైవమార్గం "డౌ". దీనికి జపాను నామం "కమి". అయితే ఈ "కమి"లో దేవతలు లేరు. పైనున్న వారికి, ఉన్నత జీవులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పితర, ప్రకృతి పూజ ఈ మతానికి ముఖ్య లక్షణం. ఇది సర్వ జీవవాద, ప్రాక్తన బహుదేవతా వాదాల నుండి పుట్టింది. ఈ విషయంలో ఇది వేదమతాన్ని పోలి ఉంది. ప్రకృతి శక్తుల ఆరాధన, సర్వజీవ భావం రెండీంటికి సమానమే. ప్రకృతిలో అదృశ్య శక్తులు, దేవతలు ఉన్నారని భావించి, వాటిని పూజించారు. ఈ అదృశ్య శక్తిని "మాన" అంటారు. ఇది ఒక రమైన విద్యుచ్ఛక్తి లాం ...

                                               

సిక్కుమతం

సిక్కు మతం, గురునానక్ ప్రబోధనల ఆధారంగా ఏర్పడిన మతం. ఏకేశ్వరోపాసన వీరి అభిమతం. సిక్కు మతంలో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథం లేదా ఆది గ్రంథ్. వీరి పవిత్ర క్షేత్రం అమృత్ సర్ లోని స్వర్ణ మందిరం.ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు లలో నివసిస్తుంటారు., ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.

అయ్యావళి
                                               

అయ్యావళి

అయ్యావళి 19వ శతాబ్దములో దక్షిణ భారతదేశములో ఉద్భవించిన ధార్మికపథము. ఇది ఏకోశ్వరోపాసక మతముగా ప్రారంభమైనా ఈ మతావలంబీకులు భారత ప్రభుత్వ సర్వేలలో హిందువులుగా ప్రకటించుకోవటం వలన ఈ మతాన్ని హిందూ మతంలో ఒక తెగగా భావిస్తున్నారు.

తొలి మూలపు ఇండో-ఇరానియన్ మతము
                                               

తొలి మూలపు ఇండో-ఇరానియన్ మతము

వైదిక, అవెస్తా మతాలకు ఉమ్మడి మాతృక అయిన మతం ప్రోటో ఇండో-ఇరానియన్ మతం అని ఒక వర్గపు పండితుల నమ్మకం. ఈ మతము యొక్క దేవతల పేర్లు కూడా వైదిక దేవతల పేర్ల లాగ ఉంటాయి. ఉదాహరణకు సరస్వతి = హరక్స్ వైతి, యమ = యిమ. మిత్ర = మిథ్ర.

                                               

ప్రవచనం

ప్రవక్త వల్లించే సందేశాలను ప్రవచనం అంటారు. ఇతను దైవాన్ని స్ఫూర్తిగా సూచిస్తూ మానవుడు దైవత్వం కలిగి ఉండాలని సూచనలిస్తుంటాడు. ప్రవక్త ఒక మతములోని, లేదా సాంప్రదాయంలోని విశేషాలను వివరిస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వాటిని అనుసరించడం వలన కలిగే ప్రయోజనాలను, దుష్పరిణామాలను విశదపరుస్తూ తన ప్రవచనముల ద్వారా మానవాళికి మనుగడకు ఉపయోగపడేలా చేసే ప్రసంగాన్ని ప్రవచనం అంటారు.