Топ-100
Back

ⓘ నాధ్ ద్వారా. పడమటి భారతదేశంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఊరు నాధ్‌ద్వరా. ఇది అరావళి కొండలలో బనాస్ నది తీరంలో రాజసమండ్ జిల్లాలోఉన్నది. ఉదయపూరుకు ఈశాన్యంలో 48 కిలోమీట ..




నాధ్ ద్వారా
                                     

ⓘ నాధ్ ద్వారా

పడమటి భారతదేశంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఊరు నాధ్‌ద్వరా. ఇది అరావళి కొండలలో బనాస్ నది తీరంలో రాజసమండ్ జిల్లాలోఉన్నది. ఉదయపూరుకు ఈశాన్యంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీనాధ్‌జీ విగ్రహ ప్రతిష్ఠితమైన కృష్ణాలయము కారణంగా ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయములోని అవతార పురుషుడైన కృష్ణుడు 7 సంవత్సరాల బాలుడి విగ్రహంగా దర్శనమిస్తాడు. మథురలో పూజింపబడుతున్న ఈ విగ్రహము 1672లో మథుర సమీపంలో యమునాతటంలో ఉన్న గోవర్ధనగిరి నుండి తరలించబడి 6 మాసాల కాలం ఆగ్రాలో ఉంది. మొగలు సామ్రాజ్యాధినేత హిందూధర్మ వ్యతిరేకతా విధానాల నుండి రక్షించడానికి తరలించబడింది. నాధ్‌ద్వారా అంటే శ్రీనాధ్‌జీ ద్వారం అని అర్ధం. వల్లాభచార్యుల చేత స్థాపించబడిన పుష్టి మార్గం లేక వల్లభ సంప్రదాయ లేక శుద్ధ ద్వైత సంప్రదాయానికి ఈ వైష్ణవాలయం అయిన నాధ్‌ద్వారా ఒక ప్రతీక. వల్లభాచార్యులు రాజస్థాన్ ప్రజల చేత విఠల్‌జీతో సమానంగా గౌరవాదరణలను అందుకున్నారు. నాధ్‌ద్వారా శ్రీనాధ్‌జీ ప్రతిష్ఠ తరువాత ఇక్కడి దైవమైన శ్రీనాధ్‌జీ పేరుతో కూడా పిలువబడుతుంది.

ఈ ఆలయానికి జన్మాష్టమి సందర్భంగా భక్తులు ప్రవాహముగా వస్తారు. అలాగే దీపావళి, హోలి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ దైవం జీవించి ఉన్నట్లు భావించి ఆరాధించబడుతుంది. ఆలయం లోని మూల విరాట్టుకు రోజూ వారిగా స్నానం, వస్త్రధారణ, భోజనము ప్రసాదము లతో సాధారణ జీవితంలో ఉన్నట్లు విశ్రాంతి వేళలు ఉంటాయి. ఈ దైవాన్ని బాలకృష్ణుడిగా భావించి పిల్లల కొరకు తీసుకునే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. ఈ ఆలయ పూజారుల వల్లాభాచార్య వంశీకులుగా భావించబడుతున్నారు. వల్లభాచార్యుడు గోవర్ధనగిరిలో ఈ విగ్రహాన్ని కునుగొని ఇక్కడకు తెచ్చి ప్రతిష్ఠించాడని ప్రతీతి.

ఆలయంలో ప్రధాన ఆకర్షణలు హారతి, అలంకారము, వస్త్రధారణ. స్వామికి వేళకు తగిన వస్త్రధారణ జరుగుతుంది. నేతపంచె, జరీ కండువా, రత్నఖచిత ఆభరణాలు వాడతారు. స్వామికి అరాధనతో చద్దులు, గోవులను కాయడానికి ఉపయోగించే కర్ర, పూలు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా భక్తి గీతాలను ఆలాపిస్తూ సమర్పిస్తారు. స్వామిని చూడడానికి జాఖి అని పిలువబడే ఒక పరదాను తెరచి చూపిస్తారు.